19, జనవరి 2015, సోమవారం

తెరిచి పెట్టిన పుస్తకం


మరుగేలరా ఓ రాఘవాఅని  పాడుకునే రోజులకు రోజులు  దగ్గర పడుతున్నాయి. ఇక ముందు ముందు  మనుషుల జీవితాల్లో చాటు మాటులు వుండవు. అంతా బహిరంగమే. బతుకు బస్ స్టాండ్అనుకుంటూ బాధపడే భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిపే ఓ ఆంగ్ల కధనం ఒకటి  ఇప్పుడు నెట్లో షికార్లు చేస్తోంది. దానికి స్వేచ్చానువాదం:


2020లో బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయడం కోసం చట్నీస్ కు  ఫోన్ చేస్తే ఆ సంభాషణ ఇలా సరసంగా సాగుతుంది.
గుడ్ మార్నింగ్. నాకు వెంటనే నాలుగు ప్లేట్లు .....
ఒక్క నిమిషం సర్! మీ మల్టీ పర్పస్  కార్డ్ నెంబర్ చెబుతారా?”
కార్డు నెంబరా! ఒక్క నిమిషం ఆగండి చూసి చెబుతాను..... నా నెంబరు ... 889861356102049 998-45-54610"
థాంక్స్. అయితే మీ పేరు శ్రీనివాసరావు. మాదాపూర్ లో మహారాజా ఛాట్ ఎదురుగా వున్న అపార్ట్ మెంటులో నాలుగో అంతస్తులోని ఫ్లాట్లో వుంటారు. మీరక్కడ ఏడాదిగా అద్దెకు వుంటున్నారు. మీ లాండ్ లైన్ నెంబరు 23731056. సారీ అది బీ యస్ ఎన్ ఎల్ కనెక్షన్ కావడం వల్ల కేబుల్ షార్టేజ్ కారణంగా ఇంకా షిఫ్ట్ చేయలేదు. ప్రస్తుతం ,మీ  మొబైల్ నెంబరు  9849130595.  ఇప్పుడు చెప్పండి. మీకేమి కావాలి?”
నాకేమి కావాలో చెబుతాను సరే! ఇంతకీ  నా ఫోను నెంబర్లు, నా వివరాలు మీ దగ్గర ఎలావున్నాయి?”
సిష్టంతో కనెక్ట్ అయివున్నాం సర్”   
సరే! నాకు త్వరగా నాలుగు ప్లేట్లు బాబాయి ఇడ్లీ ...
వన్ మినిట్ సర్! మీరు మొన్న ఉదయం మీ భార్యతో కలసి వెళ్లి  శ్రీనగర్ కాలనీలోని క్లినిక్ లో  షుగర్ చెక్ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఉదయం పూట ఇడ్లీ తినడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆవిడ రిపోర్ట్ బాగానే వుంది. ఆమెకు ఇడ్లీ చెబుతాను. మీకు  బ్రౌన్ బ్రెడ్ శాండ్ విచ్ ఆర్డర్ చేస్తాను.
ఓకే! బిల్లు సుమారుగా ఎంతవుతుంది?”
యెంత సర్! చాలాతక్కువ. సర్వీస్ చార్జ్ కాకుండా  పన్నెండు వందలు
కార్డు మీద పే చెయ్యవచ్చా?”
తప్పకుండా. కాకపోతే చిన్న ప్రాబ్లం సర్!  కంప్యూటర్ చెబుతున్నదాన్నిబట్టి చూస్తే  మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ రికార్డు ఏమీ బాగాలేదు. ఇప్పటికే మూడు వాయిదాలు కట్టలేదు.  హౌసింగ్ లోన్ బకాయి కూడా పేరుకు పోయివుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా క్యాష్  మాత్రమే కట్టాల్సి వుంటుంది
ఓ షిట్! ************
సర్! మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసలే  మీ మీద బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక కేసు నమోదయి వుంది. మూడు రోజుల క్రితం బార్ నుంచి కారులో వస్తూ పోలీసులకు పట్టుపడి వాళ్ళతో తగాదా పెట్టుకున్నారని రికార్డ్ చెబుతోంది. కాబట్టి మరో కేసుకు అప్పుడే తొందర పడవద్దని మర్యాద పూర్వకంగా సలహా ఇస్తున్నాను.
ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!
అదిగో సర్! అదే వద్దన్నాను. తల్లి  ఏమిటి తల్లి! బల్లి లాగా...
ఇవతల వ్యక్తి  పరిస్తితి చెప్పక్కరలేదు. ఊహించుకోవచ్చు. ఏదో చిత్రంలో బ్రహ్మానందం పాత్ర మాదిరిగా కింద పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు. 
NOTE:  Courtesy Image Owner 

7 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

బాబోయ్.

అజ్ఞాత చెప్పారు...

ఎప్పుడో 2020 దాకా ఎందుకు. ప్రస్తుతం సంపన్న దేశాల్లో ఇదే పరిస్థితి.

http://www.forbes.com/sites/kashmirhill/2012/02/16/how-target-figured-out-a-teen-girl-was-pregnant-before-her-father-did/

శశి కుమార్ చెప్పారు...

వామ్మో!!! నవ్వు తెప్పిచ్చినా , ఇది భవిష్యత్తులో జరిగితే ?!!!! వద్దు బాబోయ్ వద్దు

Zilebi చెప్పారు...


ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!”

సారీ సార్ , మీ రు ఇంట్లో వంట చెయ్య కూడదు . లాస్ట్ టైం ఇంట్లో వంట చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇంట్లో వంట ఇక మీదట చెయ్య బోనని రాసిచ్చేరు . కాబట్టి ....

ఓర్నాయనో ....

మీ నాన్నారు గతించి ....

వామ్మో ...

మీ అమ్మ గారు హాస్పిటల్ లో ....

హే రామ్ !

సార్ మీరు ప్రోక్లైమేడ్ నాస్తికులు ....

చీర్స్
జిలేబి

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Zilebi - జిలేబి గారు. పొరబాటున మీ మెయిల్ మిస్సయింది. మీరు పెట్టిన కామెంటులో సగం అర్ధం అయింది. రెండో సగం అమ్మా, నాన్నా అని రాసారు. అదే కాస్త తికమక పెట్టింది.నా మెయిల్:bhandarusr@gmail.com
మీ కామెంటు.
ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!”

సారీ సార్ , మీ రు ఇంట్లో వంట చెయ్య కూడదు . లాస్ట్ టైం ఇంట్లో వంట చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇంట్లో వంట ఇక మీదట చెయ్య బోనని రాసిచ్చేరు . కాబట్టి ....

ఓర్నాయనో ....

మీ నాన్నారు గతించి ....

వామ్మో ...

మీ అమ్మ గారు హాస్పిటల్ లో ....

హే రామ్ !

సార్ మీరు ప్రోక్లైమేడ్ నాస్తికులు ....

చీర్స్
జిలేబి
(ఇక్కడ పోస్ట్ చేయడం అసందర్భం అని తెలుసు. అయినా తప్పలేదు. మన్నించండి)

అజ్ఞాత చెప్పారు...

"ఆదిత్య 369" సినిమా రెండో భాగంలో (భవిష్య కాలం) ఇంతే.

sarma చెప్పారు...

మీ నాన్నారు గతించి ....

వామ్మో ...

మీ అమ్మ గారు హాస్పిటల్ లో ....

హే రామ్ !

సార్ మీరు ప్రోక్లైమేడ్ నాస్తికులు ....
పూర్తిగా జాతకం చదివేయడం కదండీ,పుట్టిన రోజు తాగిన గాడిద పాలో, దొండాకు పసరుతో సహా ! :)