విమాన
ప్రమాదాలు, అదృశ్యాలు గురించి వరస సమాచారాలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో 2009
లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం
బ్లాక్ బాక్స్ ఆధారంగా యూ ట్యూబ్ లో లభ్యమవుతోంది. విమానం గాలిలోకి లేచిన కొద్ది నిమిషాల్లోనే పక్షులు
డీకొన్న కారణంగా ఒక నదిలో కూలిపోయిన దృశ్యాలు ఇందులో వున్నాయి.
జనవరి
పదిహేనవ తేదీన న్యూయార్క్ నగరంలోని లా గార్దియా ఎయిర్ పోర్ట్ నుంచి యుయస్ ఎయిర్
వేస్ కు చెందిన ఎయిర్ బస్ విమానం, వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ కు
బయలుదేరింది. అయితే మూడు నిమిషాలు కూడా గడవకముందే ఆ విమానాన్ని పక్షులు డీకొన్నాయి.
ఫలితంగా ఇంజిన్ శక్తి దెబ్బతిన్నది. ప్రమాదాన్ని సకాలంలో పసికట్టిన విమాన సిబ్బంది
దగ్గరలో ఎలాటి విమానాశ్రయం లేకపోవడంతో తెగించి విమానాన్ని మన్హాటన్ సిటీ
దాపున హడ్సన్ నదిలో దింపారు. విచిత్రం ఏమిటంటే ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం
జరక్కపోవడం. అందులోని 155
మంది ప్రయాణీకులు, సిబ్బంది సురక్షితంగా
బయట పడ్డారు. తరువాత ఆ విమాన సిబ్బందిని
అత్యుత్తమ పురస్కారంతో గౌరవించారు.
ఈ
సంఘటనకు సంబంధించిన దృశ్యాలను కింది లింక్ లో చూడవచ్చు.
|
|
|
NOTE: Courtesy youtube
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి