ఇంకా ఏప్రిల్ మాసమే నడుస్తోంది కాబట్టి ఎంచక్కా ఏప్రిల్ ఫస్ట్ –
‘ఆల్ ఫూల్స్ డే’ కబుర్లు కొన్ని- ఆఫ్
కోర్స్ - అందరికీ కాకపోయినా కొందరికి తెలిసినవే అనుకోండి – చెప్పుకోవచ్చు. ఫూల్స్
గురించి ప్రముఖులు కొందరు నుడివిన మాటలు, కొన్ని దేశాల్లో ప్రాచుర్యంలో వున్న సామెతలు
ఇవిగో కొన్ని.
‘మనమంతా
ఫూల్స్ కి రుణపడి వున్నాం. వాళ్ళే లేకపోతే మన తెలివితేటలు ప్రపంచానికి తెలిసేవి
కావు’ – మార్క్ ట్వైన్
‘ఏమయినా చెప్పండి కాని, నాకు మాత్రం ఫూల్స్ అంటే ఎంతో నమ్మకం. అది నాపట్ల నాకున్న విశ్వాసం అని నా స్నేహితులు ఆట పట్టిస్తుంటారు.అది వేరే సంగతి.’ – ఎడ్గార్ అలెన్ పా
‘తెలివైన వాళ్లకి ఇతరుల సలహాలు అవసరం లేదు. తెలివితక్కువ వాళ్లు ఎవరి సలహాలు తీసుకోరు.’ - బెంజమిన్ ఫ్రాంక్లిన్
‘నిజమైన హాస్య ప్రియులు జోకులు వేయరు. ఇతరుల జోకులను హాయిగా ఆస్వాదిస్తారు. - మాక్స్ ఈస్ట్ మన్
‘నాకెందుకో నా తెలివితేటలపట్ల నాకు అపారమైన నమ్మకం. అంత తెలివికలవాడిని కావడం వల్లనో యేమో ఒక్కోసారి నా మాటలు నాకే అర్ధం కావు’ – ఆస్కార్ వైల్డ్
‘పందులకు పనసపండు ముక్కలు పెట్టకు. బుద్ధి వుంటే బుద్ధిహీనులకు ఎప్పుడూ సలహాలు ఇవ్వకు’ – ఐరిష్ సామెత
‘తెలివితక్కువవాళ్ళతో కూర్చుని నవ్వడం కంటే తెలివైన వాళ్ళతో కలసి ఏడవడం మంచిది’ – స్పెయిన్ నానుడి
‘నన్నొకసారి ఫూల్ ని చేసావనుకో అది నీకు అవమానం. మళ్ళీమళ్ళీ మరోమారు ఫూల్ ని చేసావనుకో అది నాకు అవమానం.’ – చైనా సామెత

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి