రష్యాలో కమ్యూనిస్టుల పాలన సాగుతున్న రోజుల్లో
రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కోలో కాలు పెట్టాను. సోవియట్ పౌరులందరికీ గుర్తింపు
కార్డులు వుంటాయి. వాటిని విధిగా వెంట వుంచుకోవాలి కూడా. సరే! మాస్కో రేడియో వాళ్లు కూడా నాకూ, మా కుటుంబసభ్యులందరికీ ఈ కార్డులు ఇచ్చారు. దీన్ని
ప్రొపుస్కా అనేవారనుకుంటాను. ఇదిలేకుండా బయటకు వెడితే ఇంతే సంగతులు.
అక్కడ నిబంధనలు యెంత ఖచ్చితం అంటే, ఎంతటివారయినా
ఆఖరికి సాక్షాత్తు రేడియో వ్యవహారాలు చూసే మంత్రి అయినా సరే ఈ గుర్తింపు కార్డు
చూపిన తరువాతనే ఆఫీసులు లోపలకు అనుమతించేవారు. పొరబాటున ఇంట్లో మరచిపోయి ఆఫీసుకు
పోతే, రోజూ చూస్తున్న మనిషే కదా అన్న
మొహమాటం కూడా వుండేది కాదు. అప్పుడు ఇంటికి ఫోను చేస్తే, పిల్లలు అప్పటికే
స్కూలుకు పోయేవాళ్ళు కాబట్టి మా ఆవిడే
టాక్సీ వేసుకుని నా కార్డు పట్టుకువచ్చేది.
ఆ కార్డుకోసం ఓ ఫోటో స్టూడియోకు వెడితే ఓ రూబులు కాబోలు తీసుకుని ఇదిగో ఇలా ఓ నాలుగయిదు షీట్ల మీద వరసగా ఫోటోలు ప్రింటు వేసి ఇచ్చాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి