కూచి గోపాల కృష్ణ.
పెద్ద
పెద్ద మీసాలు. ఎవర్నీ లెక్కచేయనితనం. వాడెంత వీడెంత అనే మాటలు. ఆ గుబురు మీసాల మాటున మందహాసం. లెక్కచేయని తనం చాటున
మొక్కవోని ఆత్మ విశ్వాసం. అహంకారపు మాటల వెనక అతి సున్నితత్వం. ఇవన్నీ కలబోస్తే
కూచి గోపాల కృష్ణ.
ఆయనతో
యాభయ్ ఏళ్ళ పైచిలుకు పరిచయం. బెజవాడ గాంధి నగరం జింఖాన క్లబ్ దగ్గర నివాసం ఆయనది.
పెద్ద పెద్ద సీనియర్ రిపోర్తర్లకి కూడా లేని సైకిల్ వైభోగం. బీటు కానిస్టేబుల్
దగ్గర నుంచి ఐ.పి.ఎస్. అధికారి వరకు పరిచయాలు. కరకుతనం, భోళాతనం కలగలిపిన గొప్ప పీఆర్ వ్యక్తిత్వం.
ఒక
జర్నలిస్టు సంఘంలో మంచి జర్నలిస్టు అనిపించుకున్నాడు అంటే దాని వెనుక అతడి కుటుంబ
సభ్యుల మంచితనం కూడా వుంటుంది. కూచి గోపాల కృష్ణకు దక్కిన అదృష్టం అది. పిల్లలు
ప్రయోజకులు అయ్యారు. వారిని కట్టుకున్న వాళ్ళు మరింత ప్రయోజకులు అయ్యారు.
నిన్న
శనివారం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో కూచి గోపాలకృష్ణ ప్రధమ వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం జరిగింది.
వల్లీశ్వర్,
నందిరాజు రాధాకృష్ణ,
రెంటాల జయదేవ్ మరికొందరు జర్నలిస్టు మితృలు కూచి గోపాలకృష్ణతో తమ అనుబంధాన్ని
నెమరు వేసుకున్నారు. కుటుంబ సభ్యులు మధు, శోభ, జీవీ
రాము, తురగా
ఫౌండేషన్ సభ్యులు శారద, రాధిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
(28-08-2022)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి