పాత
తెలుగు సినిమాల్లో రానున్న ఘటనలను ముందు సూచనాప్రాయంగా చెప్పడానికి కొన్ని
దృశ్యాలను చూపించేవారు. దేవుని గూట్లో వెలుగుతున్న దీపం హఠాత్తుగా ఆరిపోయినట్టు
చూపిస్తే ఆ సినిమాలో ఒక పెద్ద పాత్ర
మరణించబోతున్నదని ప్రేక్షకులు ముందే అర్ధం
చేసుకునే వారు. ఇలాంటి షాట్లని సినిమా పరిభాషలో ఏమంటారో తెలియదు.
సినిమా
రంగం నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన తర్వాత ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా 1990 లో కాబోలు బాపు దర్సకత్వంలో శ్రీనాధకవి
సార్వభౌముడు అనే సినిమాలో నటించారు. గౌఢడిండిమభట్టు కంచుడక్క పగలగొట్టించి, తన కవితాపటిమతో
తెలుగు నేల నాలుగు చెరగులా పేరు ప్రఖ్యాతులు ఆర్జించి ఓ వెలుగు వెలిగిన శ్రీనాధ
కవిసార్వభౌముడు, తన అవసాన దశలో సమస్త భోగభాగ్యాలను పోగొట్టుకుని దయనీయ స్థితిలో
కన్నుమూస్తాడు. అయినా ఆయన గుండెధైర్యం
ఆయనది. చెక్కు చెదరినది.
చివరి
క్షణాల్లో కూడా
“దివిజకవివరు
గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు
శ్రీనాధుడమరపురికి” అంటూ మరణిస్తాడు.
తన భవిష్యత్తు ఎలా వుండబోతోందో తెలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో ఆ పాత్ర ధరించారని నేను అనుకోను. కానీ ముందు చెప్పిన సినిమా ఫార్ములా ఇక్కడ అచ్చుగుద్దినట్టు సరిపోయేలా, తదనంతర కాలంలో అనేక ఘటనలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి.
1 కామెంట్:
౧౯౨౨~౨౦౨౨ శత జయంతి
శ్రీ నందమూరీ తారక రామా రావు గారు
కామెంట్‌ను పోస్ట్ చేయండి