5, అక్టోబర్ 2020, సోమవారం

క్షణాల్లో లక్షలు - భండారు శ్రీనివాసరావు

న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే ఎన్నేళ్ళు కష్టపడాలి? యెంత కష్ట పడాలి?
అదే గంటకు అక్షరాలా తొంబై కోట్లరూపాయలు సంపాదించాలంటే –
ఇది కాలము, దూరము, కాలము, సమయము లెక్కకాదు, లెక్కకట్టి చెప్పడానికి. కానీ ఈ ప్రశ్నకూ ఈ మధ్య జవాబు దొరికింది.
అపర కుబేరుడు రిలయన్స్ సంస్థాపక అధినేత దీరూ భాయ్ అంబానీ పెద్ద కుమారుడు, ఆగర్భ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ ఆదాయపు లెక్కల్లో ఈ లెక్క వెలుగులోకి వచ్చింది. ఈ లెక్కను నిమిషాల్లోకి, సెకన్లలోకి లెక్కకట్టి చూస్తే. ఈ చిన్ని పోస్టు చదివేలోగా ముఖేష్ అంబానీ రాబడి ఒక సగటు జీవి నెల జీతాన్ని దాటిపోతుంది.
కుబేరులు, కుచేలురు సహజీవనం చేస్తున్న భారతం మనది.

4 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...



అంతేనా ? గంటకు తొంభై కోట్లేనా ? వెరీ పూర్ ఫెలో!


జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

గంటకు 90 కోట్లా? అయితే నిమిషానికి కోటిన్నర, సెకండ్ కు రెండున్నర లక్షలు అవుతుంది లెక్క. మీరన్న “సగటు జీవి” నెల జీతం ఏ పోలికకూ రాదు, పాపం బక్క ప్రాణి.

ఒక గంటకే ఇంతైతే ఒక రోజుకు (24 గంటలు) ఎంతవుతుంది, ఒక నెలకు (30 / 31 రోజులు) ఎంతవుతుంది, ఒక సంవత్సరానికి ఎంతవుతుంది (12 నెలలు) 😳😳!! అతిశయోక్తేమో??

ఏదో కథలో ముళ్ళపూడి వారు “ఎంత చేటైనా ఇంత చేటా” అంటారు లెండి, అలా ఉంది ఈ కుబేరుల సిరిసంపదల ఘనత.

సూర్య చెప్పారు...

వాళ్ళు సంపాదిస్తున్నారా లేక వేతనజీవులు వాళ్ళకి సంపాదించి పెడుతున్నారా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ విన్నకోట నరసింహారావు గారు. చిన్నప్పటి నుంచీ నేను లెక్కల్లో వెరీ పూర్. నేనే తప్పు రాసివుంటాను. ఇది పత్రికలో వచ్చింది: Ambani earned Rs 90 crore every hour since the March lockdown imposed to contain the spread of coronavirus, the report said.