3, మే 2017, బుధవారం

రోములో వున్నప్పుడు .....


రోమన్ లా వుండాలని సామెత. మన వాళ్లకు ఈ సామెత పిచ్చపిచ్చగా నచ్చేసినట్టు వుంది. అంచేత వాళ్ళు ఏదేశం వెడితే ఆ దేశపు అలవాట్లు తుచ తప్పకుండా పాటిస్తుంటారు.
రెండు రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన మా పెద్దవాడితో కలిసి ఓ పెద్ద మాల్  కి వెళ్ళాము. పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులే  ఆ మాల్స్ కి మహారాజ పోషకులుగా అనిపించారు. బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గర బాగా రద్దీగా వుంది. క్యూ పద్దతి పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదు.
అది చూసి మావాడు చెప్పాడు.

“అమెరికాలో బయలుదేరినప్పుడు తోటి ప్రయాణీకులు, మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ క్యూ పద్దతి పాటించారు. ఒకరినొకరు తోసుకోకుండా, తాకకుండా చాలా మర్యాదగా వ్యవహరించారు. దుబాయ్  లో దిగిన తర్వాత కాస్త మార్పు కనిపించింది. క్యూ వున్నా ‘కాస్త తప్పుకోండి’ అనే రుబాబు బాబులు ఎక్కువయ్యారు. ఇక హైదరాబాదులో దిగగానే లగేజ్ కలక్షన్ దగ్గర అసలు రంగు బయట పడింది. ఎవరికి వారు హడావిడిగా పక్కవారిని తోసుకుంటూ సూటుకేసులు లాగేసుకుంటున్న ధోరణి చూస్తే, అమెరికాలో విమానం ఎక్కిన వాళ్ళు వీళ్ళేనా అనిపించింది” 

1 కామెంట్‌:

అన్యగామి చెప్పారు...

"అంచేత వాళ్ళు ఏదేశం వెడితే ఆ దేశపు అలవాట్లు తుచ తప్పకుండా పాటిస్తుంటారు."

దీనికి కూడా మనవాళ్ళ దగ్గర కొన్ని మినహాయింపులున్నాయి. మచ్చుక్కి ఒక ఇండియన్ కిరాణాకొట్టుకి వెళ్ళారనుకోండి, క్యూ పద్దతి పాటించాలనే నియమం అన్ని వేళల కనిపించదు. అదే తెల్లాళ్ళు మసిలే ప్రదేశాలుంటే మళ్ళీ పద్దతి మారి లైనులో ఉంటారు. దీని మీద మీరింత తక్కువ వ్రాయటం బాగోలేదు.