అరవై ఏళ్ళ క్రితం.
ఇంటి పెరట్లో చింతచెట్టు కింద నిలబడి
చూపు సాగినంత మేర నిలబడి చూస్తుండేది మా అమ్మ. సెలవులకు వచ్చి తిరిగి వెళ్ళే నా
వైపే ఆమె చూపు. వెనక్కి తిరిగి చూస్తానేమో అని ఆమె ఆరాటం. నేను వెళ్ళే కాలిబాట మలుపు
తిరిగేవరకు ఆమె చూపు నా మీదే. మరోసారి నేను వచ్చేవరకు నా రూపు తన కళ్ళల్లో
దాచుకోవాలనే కోరిక కాబోలు.
మళ్ళీ ఇన్నేళ్ళకు అదే దృశ్యం మరో
రూపంలో పునరావృతం. విదేశంలో ఉన్న మా పెద్దవాడు హైదరాబాదు వచ్చి కొన్ని రోజులు మాతో
గడిపి తిరిగి వెడుతుంటే మా ఆవిడ కళ్ళల్లో అదే నీటి పొర. కిందకి వెళ్లి కారు
ఎక్కించేవరకు కళ్ళార్పకుండా అవే చూపులు, రెప్ప వాలిస్తే కంటికి కనబడుతున్నది
కనబడదేమో అన్న భయం కాబోలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి