శాసన సభలో చలోక్తులా? ఇది నమ్మే విషయమేనా అని అనుకోకండి.
ఓ నలభయ్, యాభయ్ ఏళ్ళక్రితం తెలుగు పత్రికల్లో
'బాక్స్' కట్టి మరీ ఈ ఛలోక్తులు ప్రచురించేవారు. చదువుకోవడానికి తమాషాగానే కాకుండా
ఆహ్లాదంగా కూడా ఉండేవి.
1958 లో కళా వెంకటరావు గారు రెవెన్యూ మంత్రి. రాములు
అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని తమాషా పట్టించాలని 'మంత్రిగారు మాట్లాడుతున్నది
కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనా' అని జోకబోయారు. అంటే మంత్రిగారు చెప్పేవన్నీ పై
పై మాటలు, ఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు కాదుకదా! వెంటనే
తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా నాలుకతోనే మాట్లాడుతాడు.
కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ నాలుకతో మాట్లాడుతారేమో నాకు
తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు కిమ్మిన్నాస్తి. గమ్మున
కూర్చుండిపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి