9, మే 2013, గురువారం

ఆకాశవీధిలో .......











నా మార్గం అనితర సాధ్యం  అన్నాడు మహాకవి. ఆయన అన్నట్టే ఆయన మనసుపడ్డ కమ్యూనిస్ట్ చైనా,  నడిచేవారి గుండెలు అదరగొట్టే ఓ దుర్గమ మార్గాన్ని సముద్ర మట్టానికి 4,700 అడుగుల ఎత్తున  ఓ కొండ శిఖరం చుట్టూ  నిర్మించింది.  ఏడాది క్రితమే ఈ మార్గాన్ని పర్యాటకులకోసం తెరిచారు. కాస్త గుండె దిటవు వున్నవాళ్ళే దీనిపై పాదం మోపి నడవగలరు. బలహీన మనస్కులు నడిచేదారి మాత్రం కాదు.


ఒక వైపు చూస్తే నల్లని కొండరాయి. మరోవైపు నాలుగువేల అడుగుల పైచిలుకు మృత్యు లోయ. ఈ రెంటినీ విభజిస్తూ మధ్యలో మూడంటే  మూడడుగుల మాయ దారి.  వెన్నులో చలి పుట్టించడానికి ఇది చాలదన్నట్టు, కిందికి చూస్తే కళ్ళు తిరిగేటట్టు ఈ దారి ఉపరితలాన్ని  పూర్తిగా పారదర్శికమయిన గ్లాసుతో నిర్మించారు. ఒక్క అడుగు  పొరబాటుగా వేశారా ఇంతే సంగతులు.  ఎంతటి  అగాధంలోకి జారిపోతారో  తెలుసుకుంటేనే చాలు గుండెలు జారిపోతాయి. చైనా లోని తియాన్మెన్ పర్వత శిఖర సానువుల్లో ఈ అద్భుత, భయానక కాలి  బాటను పర్యాటకులకోసం పర్వత శిఖరం చుట్టూ సముద్రమట్టానికి 4,700 అడుగుల ఎత్తున ప్రాణాలకు తెగించి మరీ  చైనా కార్మికులు నిర్మించారు. 

     






కామెంట్‌లు లేవు: