10, మే 2013, శుక్రవారం

హన్నా! రాజన్నా! యెంత పని చేసావు?



‘అనుకున్నామని జరగవు అన్ని – అనుకోలేదని ఆగవు కొన్ని’
నిజం. ఇలా జరుగుతుందని ఎవరం అనుకోలేదు. ఇలా జరగాలని ఎవరం కోరుకోలేదు. కానీ భగవంతుడు కోరుకున్నాడు. అందుకే నాకంటే చిన్నవాడయిన ‘రాజన్న’ నన్ను మరింత పెద్దవాడిని చేసి తనను కోరుకున్న భగవంతుడి దగ్గరికే వెళ్ళిపోయాడు.

తలలో నాలుక అంటే  మా మొత్తం కుటుంబంలో రాజన్ననే చెప్పుకోవాలి.
నిత్య సంతోషి అన్నా వాడిని మించి మరో పేరు కనబడదు.
నవ్వుతూ నవ్విస్తూ, ఇక చాల్లే మీ ఏడుపులు మీరు ఏడవండి అని ఏడాది క్రితం అందర్నీ వొదిలేసి అంతే హాయిగా వెళ్ళిపోయాడు.
నిన్నా ఈ రోజూ రేపూ హైదరాబాదులో రాజన్న అనే కొలిపాక రాకేంద్ర ప్రసాద్  ఏడూడి మాసికాలు. అందరం కలుస్తున్నాం వాడొక్కడు లేకుండా. అందరం మాట్లాడుకుంటాం వాడిని గురించి, వాడి మంచితనం గురించి.
కాని వినడానికి వాడు లేడు.
ఎందుకో ఏమిటో ఎటు చూసినా వాడే కనబడుతున్నాడు. మనసారా నవ్వే రాజన్న నవ్వే వినబడుతోంది.
(10-05-2013)  

కామెంట్‌లు లేవు: