ఓ నలభై ఏళ్ళక్రితం పేపర్లు ఇలాగే వుండేవి. సమాజానికి
కావాల్సిన వార్తలు. చికోరీ తక్కువ కాఫీ ఎక్కువ లాగా అన్నమాట.
ఈనాటి ఈనాడు ప్రధాన శీర్షిక – గాలి సోకుతోంది. ‘గాలి’
వార్తలు చదివీ చదివీ ఇదీ మరో ‘గాలి (జనార్ధన రెడ్డి) వార్త కాబోలు అనుకున్నవాళ్ళు
వున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘పీల్చే గాలిలో పెరుగుతున్న సీసం – దానివల్ల జనాలకు
వాటిల్లే ప్రమాదాలు’ గురించిన సమాచారం చాలా వివరంగా వుంది.
మరో వార్త ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలినా గురించి.
రొమ్ము కేన్సర్ పై ఆమె సాధించిన విజయం గురించి. యెంత గొప్పగా వుందో.
ఇంకోటి- చిన్నపిల్ల మరణాలకు కారణమవుతున్న ‘రోటా వైరస్ పై భారతీయ అస్త్రం’ అనే చక్కటి
వార్త.
కుడి వైపు పైన ఇంజినీరింగ్ కాలేజీల్లో విదేశీ
విద్యార్ధులకు ప్రవేశం కల్పించే అంశం గురించిన వార్త.
సీ.బీ.ఐ. స్వతంత్రత కోసం చట్టం తెచ్చే వార్త.
మండు వేసవిలో పండు వెన్నెల మాదిరిగా సేద తీర్చే
వార్తలు.
జన్మానికో శివరాత్రి. రోజూ ఇలాటి వార్తలే వేస్తె
ఇంతే సంగతులు.
ఈ సంగతి వారికీ తెలుసు.
అందుకే-
‘లబ్ది పొందింది జగనే –
పితాని, దోపిడీ నాయకుడు జగన్- మంత్రి ఆనం, జగన్ స్వార్ధానికి మంత్రులు బలి –కన్నా’
అంటూ సింగిల్ లైన్ లో క్లుప్తంగా ఇచ్చారు. (15-05-2013)
1 కామెంట్:
ఆంజలీనా కు కాన్సరు లేదు. ఇంకా రాలేదు. 87% వచ్చే అవకాశాలు వున్నాయి. కాన్సరు ఇంకా రాకుండానే ఇటువంటి వైద్యం ఎంతవరకు సబబు.
( మీ బ్లాగు తరచుగా చూస్తుంటాను. నచింది. కొంతమంది పెద్దల బ్లాగులలో వయసుతో వచ్చిన అనుభవం అంతర్లీనంగా వుంటుంది. అందులో మీదొకటి. )
కామెంట్‌ను పోస్ట్ చేయండి