26, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఇంటర్యూలు చేయడం యెలా?



ఉద్యోగాలకు సరయిన అభ్యర్ధులను యెలా ఎంపిక చేయాలి ?  అనే అంశంపై ఒక ఆసక్తికరమయిన విధివిధానం నెట్లో తారాడుతోంది. అది ఏమనిన:


ఉద్యోగార్ధులనందరినీ ఒక గదిలో ప్రవేశపెట్టాలి. ఆ గదిలో అంతకు ముందే  కొన్ని ఇటుకలను అట్టేపెట్టాలి. పెట్టి విడతలు విడతలుగా అభ్యర్ధులను ఆ గదిలోకి పంపి తలుపులు మూసేయాలి. అయిదారు గంటల తరువాత గదిలోకి వెళ్ళి అక్కడి పరిస్తితిని ఓ మారు పరిశీలించాలి.

ఒకవేళ వారిలో ఎవరయినా ఇటుకలను ఇంకా లెక్కపెడుతూవుంటే అలాటివారిని అక్కౌంట్ డిపార్ట్ మెంటులో నియమించాలి.
వారిలో ఎవరయినా లెక్కపెట్టిన ఇటుకలనే మళ్ళీ లెక్కిస్తూ కనబడితే వారిని ఆడిటర్లుగా నియమించాలి.
ఎవరయినా ఇటుకలను గదిలో గందరగోళంగా సర్దే ప్రయత్నం చేస్తే వారిని ఇంజనీరింగు విభాగానికి పంపాలి.    
అలాకాకుండా ఇటుకలను విడ్డూరమైన విధానంలో అమర్చినట్టు కనబడితే వారిని ప్లానింగు విభాగంలో నియోగించాలి.  
ఇటుకలను ఒకరిపై మరొకరు విసురుకుంటున్న వాళ్ళను తక్షణం ఆపరేషన్స్ విభాగానికి పంపాలి.
నిద్రపోతూ కనబడ్డవారిని సెక్యూరిటీ లో నియమించాలి.
అసలేమీ చేయకుండా బద్ధకంగా కూర్చున్నవారిని హెచ్ ఆర్డీ లో వేయాలి.
ఒక్క ఇటుక కూడా కదల్పకుండా ఆలోచిస్తూ కూర్చున్నవారిని సేల్స్ విభాగానికి పంపాలి.
కిటికీ లోనుంచి దిక్కులు చూసేవారికి  స్ట్రాటజిక్ ప్లానింగు విభాగంలో పోస్టింగు ఇవ్వాలి.
ఎవరయినా ఒక్క ఇటుక కూడా కదపకుండా ఒకరితో మరొకరు ముచ్చట్లు చెప్పుకుంటున్న వారు కనిపిస్తే వారిని మనసారా అభినందించి కార్యాలయ అధిపతులుగా నియమించాలి. (26-02-2013)
Courtesy image owner

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

intakee tamaride department ???