22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఎప్పుడో ఎక్కడో విన్నట్టు వుంది కదూ!




‘ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం!’
‘దోషులు ఎంతటివారయినా అరెస్టు చేసితీరుతాం!’
‘ప్రజల ప్రాణాలు కాపాడడం పాలకులుగా మా ప్రాధమిక కర్తవ్యం’
‘ఇలాటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం’
‘పేలుళ్ళలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్ష రూపాయలు. గాయపడిన వారికి యాభై వేలు’
‘క్షతగాత్రులు త్వరగా కోలుకోవడానికి మెరుగయిన వైద్యసాయం అందిస్తాం’
‘నిఘా వైఫల్యం’
‘ ప్రజల ప్రాణాలు కాపాడలేని ఈ అసమర్ధ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు’  
‘తక్షణం రాజీనామా చేయాలి’
‘చనిపోయిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి’
..........ఈ మాటలు ఎక్కడో, ఎప్పుడో విన్నట్టుంది కదూ.
ఇలాటి దుర్ఘటనలు జరిగినప్పుడల్లా ఇలాటి మాటలు పరిపాటే.
దిల్ సుఖ్ నగర్ పేలుళ్ళలో అసువులు బాసిన వారు ఈ వ్యర్ధప్రలాపాలు వినే అవకాశం ఎట్లాగో లేదు. గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి చెవినపడ్డా నవ్వుకునే పరిస్తితిలో వుండి వుండరు.
గతంలో జరిగిన ఈ మాదిరి దుర్ఘటనల్లో గాయపడి అంగవైకల్యంతో అలమటిస్తున్నవాళ్ళు ఈ మాటలు వింటూ ఎన్ని శాపనార్ధాలు పెట్టుకుంటున్నారో తెలవదు.
దేవుడే ఈ దేశాన్ని రక్షించాలి.
దేవుడి పేరుతోనే ఇవన్నీ జరుగుతుంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు? (22-02-2013)

NOTE: Courtesy image owner

8 కామెంట్‌లు:

BHAARATIYAVAASI చెప్పారు...

మీరు పైన వ్రాసినది చాలా చక్కగా ఉన్నది. కామెంటు వ్రాద్దామని క్రిందకి వచ్చేసరికి నాకు టీవీ వారే గుర్తుకొచ్చి ఆగిపోయాను. ఓ చిన్న బ్రేక్ తరవాత అన్న విధాన క్రింద ప్రకటన ఉన్నది. దయచేసి మంచి బ్లాగుల్లో టీవీల పెడధోరణులు పెట్టకండి. ఒక వేళ తప్పనిసరైతే, ఆ ప్రకటన వ్యాఖ్యల దగ్గర పెట్టకుండా ఉంటే పర్వాలేదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ BHAARATIYAVASI-'మీరు పైన వ్రాసినది చాలా చక్కగా ఉన్నది. కామెంటు వ్రాద్దామని క్రిందకి వచ్చేసరికి నాకు టీవీ వారే గుర్తుకొచ్చి ఆగిపోయాను. ఓ చిన్న బ్రేక్ తరవాత అన్న విధాన క్రింద ప్రకటన ఉన్నది. దయచేసి మంచి బ్లాగుల్లో టీవీల పెడధోరణులు పెట్టకండి. ఒక వేళ తప్పనిసరైతే, ఆ ప్రకటన వ్యాఖ్యల దగ్గర పెట్టకుండా ఉంటే పర్వాలేదు.'- భారతీయవాసి గారు - నేను పోస్ట్ చేసిన ఈ ఇరవై ఒక్క వాక్యాలలో ఒక్కచోట కూడా 'టీవీ' అనే పదం రాలేదు. కాస్త వివరంగా రాస్తారా? - భండారు శ్రీనివాసరావు

BHAARATIYAVAASI చెప్పారు...

నేను వ్రాసింది మీరు బాగా వ్రాశారనే, పైన మీరు చెప్పినవి అక్షర సత్యాలు. వాటి గురించి కాదు. పొస్టు కామెంటు అనే దాని క్రింద "పొట్ట తగ్గించుకొండి, మెస్సేజుల ద్వారా వేలు సంపాయించుకోండి" అని వివిధ రకాలైన ప్రకటనలు మీ బ్లాగులో కనపడినాయి. వాటి గురించి నేను మీకు తెలియచెసింది. అయితే ఈ రోజు అవి కనపడటం లేదు. బహుశా మీకు తెలియ కుండా ఆ ప్రకటనలు వస్తున్నాయేమో, ఒకసారి చూసుకోగలరు. నా సూచనకి అన్యధా భావించకండి.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@BHARATIYAVASI- ధన్యవాదాలు. నా బ్లాగులో ప్రకటనలా? ఆశ్చర్యంగా వుంది. మీరు రాసిన తరువాత చెక్ చేసాను. అలాటివేవి కనబడలేదు. అయినా సమాచారం ఇచ్చినందుకు మరోమారు కృతజ్ఞతలు.-భండారు శ్రీనివాసరావు

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@BHARATIYAVASI- ధన్యవాదాలు. నా బ్లాగులో ప్రకటనలా? ఆశ్చర్యంగా వుంది. మీరు రాసిన తరువాత చెక్ చేసాను. అలాటివేవి కనబడలేదు. అయినా సమాచారం ఇచ్చినందుకు మరోమారు కృతజ్ఞతలు.-భండారు శ్రీనివాసరావు

అజ్ఞాత చెప్పారు...

మన నాయకులకి కొత్తగా పనిచేయడమే కాదు.
కొత్తగా మాట్లాడడం కూడ రాదు.

ఎప్పుడూ అవే పడికట్టు పదాలతో రాజకీయ ప్రసంగాలు.
న్యూస్ చానల్స్ చూడాలంటే చిరాగ్గా ఉంటోంది.

astrojoyd చెప్పారు...

రావు గారు దేవుడు వచ్చి కాపాడనవసరంలేదు..గొర్రెల మండలాంటి వోతరులు పాకెట్ బిర్యానికీ -అరక కి అమ్ముడుపోకుండా ఉంటె చాలు..చైతన్యం అనేది వోటర్లలో రావాలి గాని..ఇంత చిన్న విషయానికి దేవుడు రానవసరంలేధనుకుంటా..

astrojoyd చెప్పారు...

రావు గారు దేవుడు వచ్చి కాపాడనవసరంలేదు..గొర్రెల మండలాంటి వోతరులు పాకెట్ బిర్యానికీ -అరక కి అమ్ముడుపోకుండా ఉంటె చాలు..చైతన్యం అనేది వోటర్లలో రావాలి గాని..ఇంత చిన్న విషయానికి దేవుడు రానవసరంలేధనుకుంటా..