“అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ప్రవేశించడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయినా గట్టిగా ప్రయత్నించి అనుమతి సంపాదించాను. ప్రెసిడెంట్ వెకేషన్ లో వున్నారు. అందువల్ల - శ్వేత సౌధంలో మీడియా వ్యవహారాలూ చూసే ఒక ఉద్యోగిని మాటల్లో పెట్టి ‘ఓవల్ ఆఫీసు’ (వైట్ హౌస్ లో ప్రెసిడెంట్ కార్యాలయం) ను కూడా చూసాను.
ఓవల్ ఆఫీస్
ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని నాలో నేనే ఏదో వూహించుకుని ఆ విషయమే నా వెంట వచ్చిన ఆ తెల్ల పిల్లతో అన్నాను. పెద్ద వయస్సులేని ఆ అమ్మడు చిరునవ్వు నవ్వి ఇలా అంది. “ మీ ఊహల్నిఅలా అంతంత దూరం పోనివ్వకండి. ఆ ఎర్ర బటన్ నొక్కితే ప్రెసిడెంట్ కి కాఫీ కావాలని అర్ధం. పచ్చ బటన్ నొక్కితే బర్గర్ కూడా తీసుకు రావాలని సంకేతం.”తెలియని విషయాలను గురించి మామూలుగా మామూలు మనుషులు వూహించుకునే తీరుతెన్నులపై - ఓ నలభై ఏళ్ళక్రితం చదివిన ఈ జోక్ – సియాటిల్ లోని - ‘లేక్ వాషింగ్టన్’ (సరస్సు) లో ఓ ఆదివారం నాడు పెద్ద మర బోటులో విహరిస్తున్నప్పుడు గుర్తుకు వచ్చింది. విశాలమయిన ఈ మంచినీటి సరస్సు కొన్ని మైళ్ల దూరం విస్తరించి వుంది.
లేక్ వాషింగ్టన్ లో నౌకావిహారం
సాఫ్ట్ గేట్స్
దూరపు కొండలు నునుపు కాదు
పాత కొత్తల మేలుకలయికగా ఆ ఇంటిని డిజైన్ చేసారని చెబుతారు.
పాత చింతకాయ కాదు - ఖరీదు చూస్తే కోట్లలోనే
యావత్ ప్రపంచానికే టెక్నాలజీ సమకూర్చి పెట్టినవాడికి తన ఇంటిని ఒక ‘సాంకేతిక అద్భుతం’గా తీర్చిదిద్దుకోవడం పెద్ద విశేషమేమీ కాకపోవచ్చు. కానీ కనే వారికీ, వినే వారికీ ఆ నివాసం వింతల్లో వింతే.
మాయామహలుకు దారి
ఇంటికి వచ్చే అతిధులకు ఓ రకం చిప్ అమర్చిన బ్రేస్లేట్ ఇస్తారు. అంటే దేశ దేశాల్లోని వారెవరయినా వారిని కాంటాక్ట్ చేయాలనుకుంటే వేరే ఫోన్లు, సెల్ ఫోన్లు అవసరం లేదు. ఆ అతిధి యే గదిలో వుంటే ఆగదిలో అతడికి అతి దగ్గరలో వున్న ఫోనుకి ఆ ’ కాల్’ ’ కనెక్ట్ అవుతుంది. మరో విశేషం ఏమిటంటే- బయటనుంచి వచ్చిన అతిధి శరీర తత్వానికి తగినట్టుగా అక్కడి ఉష్ణోగ్రతలు మారిపోతుంటాయి. అంటే, వెచ్చదనం కావాలనుకునే వారికి అందుకు తగినట్టుగానూ, చల్లదనం కోరుకునేవారికి అందుకు అనుగుణంగానూ - ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటుంది.గోడలా అవి కావు రసరమ్య కుడ్యాలు
యద్దనపూడి సులోచనారాణి నవలలలో కలల హీరో కారు ఇతడి స్వంతం
అంతేకాదు – బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ పెట్టిన తొలి రోజుల్లో ఆయన ఆహ్వానంపై అందులో చేరిన సిమోనీ అనే హంగేరియన్ అమెరికన్ జీవితంలో ఎంతగా ఎదిగి పోయాడంటే , అతడు వందల కోట్లు పెట్టి టికెట్లు కొనుక్కుని రెండు సార్లు అంతరిక్షం లోకి వెళ్లి రాగల సంపన్నుడయ్యాడు.
అదీ మైక్రో సాఫ్ట్ షేర్ల మహాత్మ్యం అంటే.
కాకపొతే గత రెండు మూడేళ్లుగా ఆ షేర్లలో పెద్ద ఎదుగుదల కనబడడం లేదని షేర్ సింగ్ లు అంటుంటారు. అయితే, దానితో మీ లాటి వారికీ, నాలాటి వారికీ ఎంతమాత్రం సంబంధం లేదనుకోండి. – భండారు శ్రీనివాసరావు
NOTE : Images in the blog are copy righted to respective owners
3 కామెంట్‌లు:
శ్రీనివాస రావు గారూ
మీ కథనం చాలా బాగుంది.
మరిన్ని కోరుకుంటూ
mvs raju
Mvsr గారికి ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు
@ఆయన కుర్చీ పక్కన రెండు బటన్లు కనిపించాయి. వొకటి నొక్కితే మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడానికి, రెండోది నొక్కితే అణు యుద్ధం ప్రారంభించడానికి అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు వీలుగా వాటిని అమర్చారని...
కాదా౦డీ??మేము అలానే అనుకునేవాళ్ళ౦...అయితే కాఫీలూ బర్గర్లూనా
కామెంట్‌ను పోస్ట్ చేయండి