13, మే 2019, సోమవారం
Will YS Jagan Supports Rahul Gandhi After Elections? | The Debate | AP24x7
ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం AP 24 X 7 TV ఛానల్ లో సీనియర్ యాంకర్ గోపి నిర్వహించిన చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ సాయి కృష్ణ (బీజేపీ), శ్రీ బ్రహ్మం చౌదరి (టీడీపీ), శ్రీ అంబటి రామకృష్ణ( కాంగ్రెస్), శ్రీ రాజీవ్ గాంధి (వైసీపీ)
11, మే 2019, శనివారం
‘టైమ్’ బాంబ్
(Published in SURYA telugu daily on 12-05-2019, SUNDAY)
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న దశలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన టైమ్ మేగజైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఒక ముఖపత్రచిత్ర (కవర్ పేజి) కధనాన్ని ప్రచురించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న దశలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన టైమ్ మేగజైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురించి ఒక ముఖపత్రచిత్ర (కవర్ పేజి) కధనాన్ని ప్రచురించింది.
అనేక దేశాల అధినాయకులు, ప్రత్యేకించి
వర్ధమాన దేశాల నాయకులు ఈ పత్రికలో తమ గురించి కధనాలు రావాలని ఉవ్విళ్ళూరుతుంటారు.
అందులోను కవర్ పేజి కధనం అంటే మాటలా! దాని తీరే వేరు.
టైమ్ పత్రిక ప్రచురించిన ఈ కధనంతో
కూడిన సంచిక మరో ఏడెనిమిది రోజుల్లో చదువరుల చేతుల్లోకి వస్తుంది. అయితే, ఈలోగానే ఈ కధనం గురించిన అనేక సంచలన కధనాలు భారతీయ
భాషల్లో వెలువడే అనేక దినపత్రికల్లో ఇప్పటికే వచ్చేశాయి.
ఒక కధనానికి పత్రికలు లేదా మీడియా
పెట్టే శీర్షికలు ఒక్కోసారి దానికి సంచలనతత్వాన్ని అద్దుతుంటాయి. అలాంటిదే టైమ్
పత్రిక పెట్టిన ఒక శీర్షిక ‘ ఇండియాస్
డివైడర్ ఇన్ చీఫ్’. అంటే ‘భారత దేశపు విభజన సారధి’ అని అర్ధం చెప్పుకోవచ్చు.
ప్రముఖ జర్నలిస్ట్ ఆతిష్ తసీర్ మోడీ
గురించి ఈ వ్యాసం రాసారు. ప్రధాని మోడీని, అయన విధానాలను తూర్పారబట్టే రీతిలో ఈ
కధనం సాగింది.
2014 లో సగటు భారతీయ ఓటర్లకు ఉజ్వల
భవిష్యత్తుపై అంతులేని ఆశలు రేకెత్తిస్తూ అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఇప్పుడు
ఒక సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారన్నది ఆ వ్యాస సారాంశం. ఒకప్పటి ఆశావహ దృక్పధం మోడీలోఇప్పుడు
కొరవడిందన్నది ఆ వ్యాస రచయిత అభిప్రాయం.
‘సమాజంలోని విబేధాలు నాడు అంటే 2014
లో మోడీ విజయానికి దోహదం చేశాయి. వాటిని
సద్వినియోగం చేసుకుంటూ మోడీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికలలో కూడా
అవే పరిస్తితులను భరిస్తూ తనకు ఓటేయాలని ఆయన ప్రజలను కోరుతున్నారు. గతంలో మోడీ
చెప్పిన విషయాలు ఇవే. హిందూ పూర్వ వైభవం, దక్షిణ కొరియా మోడల్ అభివృద్ధి ఈ రెండింటితో ఉజ్వల భవిష్యత్ నినాదం అప్పుడు
కలిసివచ్చింది. కానీ అయిదేళ్ళ కాలం గడిచిపోయిన తర్వాత ఆయనిప్పుడు ఎన్నికల హామీలను
నిలబెట్టుకోలేని సగటు రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు’ అని తసీర్ వ్యాఖ్యానించారు.
మోడీపై తసీర్ అక్షర దాడి ఇంకా ఇలా కొనసాగింది.
‘ప్రధానమంత్రిగా మోడీ తీసుకున్న చర్యలు
దేశంలో విద్వేషపూరిత మతపరమైన జాతీయ వాదాన్ని పెంచి పోషించడానికి తోడ్పడ్డాయి. మోడీ
అయిదేళ్ళ పాలనలో దేశంలోని నిమ్న కులాలవారు, ముస్లిములు, క్రైస్తవులు వంటి
అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు ఉదారవాదుల నుంచి దాడులు ఎదుర్కుంటున్నారని ఆయన
ఆరోపించారు.
‘గత ఎన్నికల సందర్భంగా మోడీ ప్రవచించిన
ఆర్ధిక విధానాలు అద్భుతాలు సృష్టించడం మాట అలా వుంచి అందులో ఏవీ వాస్తవ రూపం
ధరించలేదు. అందరికీ అభివృద్ధి అనే ఆనాడు ఇచ్చిన నినాదం ఇప్పుడు ఆచూకీ లేకుండా
పోయింది. పైగా, ప్రజల నడుమ తీవ్ర విబేధాలు
నెలకొన్న పరిస్తితిని ఆయనే తెచ్చారు’ అన్నారు తసీర్.
అంతేకాదు, ఆ వ్యాసకర్త తసీర్ ప్రధాని మోడీపై తన విమర్శల పరంపర కొనసాగిస్తూ, ‘భారత్
మరో అయిదేళ్ళ పాటు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా’ అనే సందేహంతో కూడిన ప్రశ్నను
సంధించారు.
ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే
అయినప్పటికీ మోడీ అభిమానులకు ఊరట కలిగించే విషయం ఒకటుంది. అదేమిటంటే మరో అయిదేళ్ళు
నరేంద్ర మోడీ పరిపాలన దేశానికి తప్పదనే నిగూడార్ధం ఇందులో దాగుంది.
కేవలం మోడీని విమర్శించడానికి,
దుమ్మెత్తి పోయడానికి మాత్రమే ఉద్దేశించలేదని అనుకోవాలనో లేదా సమతుల్యం చేయాలనో
తెలియదు కానీ రచయిత మోడీకి సంబంధించి కొన్ని ఉపశమన వాక్యాలను కూడా జొప్పించారు.
బలహీన ప్రతిపక్షం వుండడం మోడీ అదృష్టం,
మోడీని ఓడించడం తప్ప వీరికి మరో అజెండా
లేదని ఆయన తేల్చేశారు. వారసత్వ సిద్ధాంతాలు మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ దేశ
ప్రజలకు కొత్తగా ఇచ్చేది ఏమీ లేదని అన్నారు. ప్రతిపక్ష కూటమిని సిద్ధాంత సారూప్యత
లోపించిన బలహీన కూటమిగా అభివర్ణించారు.
కాకపోతే, ఇదే సంచికలో మోడీని
శ్లాఘిస్తూ, ఆకాశానికి ఎత్తేస్తూ మరో వ్యాసం ప్రచురించారు. బహుశా సమన్యాయం చేయడానికి టైమ్ పత్రిక సంపాదక వర్గం ఈ
విధానాన్ని ఎంచుకుని ఉండవచ్చు.
ఈరెండో వ్యాసాన్ని యూరేసియా గ్రూపు
అధ్యక్షుడు ఇయాన్ బ్రెమర్ రాసారు.
భారత దేశంలో ఆర్ధిక సంస్కరణలు
కొనసాగాలంటే అందుకు మోడీనే సరైన వ్యక్తి అని ఆయన అభివర్ణించారు.
‘భారత్ లో ఆర్ధిక సంస్కరణలను మరింత
ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం వుంది. దేశంలోని ఇతర రాజకీయ పార్టీల నేతలతో
పోలిస్తే సమర్ధవంతంగా ఈ సంస్కరణలను అమలు చేసే సామర్ధ్యం మోడీకి మాత్రమే వుంది. అయన హయాం లోనే భారత దేశానికి చైనా,
అమెరికా, జపాన్ వంటి దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు పడ్డాయి. దేశంలో
కోట్లాదిమంది ప్రజల జీవితాలు మెరుగుపడడానికి మోడీ విధానాలే కారణం. ఆధార్ వంటి
వ్యవస్థల విస్తరణపై మోడీ ప్రభుత్వం దృష్టి సారించిన ఫలితంగా ప్రభుత్వ నిధుల
దుర్వినియోగానికి అడ్డకట్ట పడింది’ అని బ్రెమర్ మోడీని కొనియాడారు.
‘ప్రత్యర్ధిపై ఆధిపత్యం చెలాయించే
తత్వం మోడీది’ అని అయన కుండ బద్దలు కొట్టారు. అయితే, అదే సమయంలో దేశంలో అవసరమైన
సంస్కరణలు చేపట్టే విషయంలో మోడీకి మంచి పేరు వుంది. దీటైన ప్రత్యామ్నాయం లేకపోవడం ఆయన పాలిట వరంలా మారింది’ అని బ్రెమర్
అభిప్రాయపడ్డారు.
సహజంగానే టైమ్ పత్రిక కధనాలు దేశంలో
ముఖ్యంగా మీడియాలో పలు చర్చలకు ముడి సరుకుగా మారింది. అందులో ఎన్నికల వేళాయే! మోడీ
అనుకూలురు, ప్రతికూలురు ఈ కధనాలను తమకు అనువైన రీతిలో భాష్యం చెప్పుకుని విశ్లేషణలను
వండి వార్చారు.
‘టైమ్ పత్రిక విశ్లేషణ అక్షర సత్యం,
మోడీ ప్రభలు మసకబారుతున్నాయి’ అంటున్నారు మోడీ వ్యతిరేకులు.
‘టైమ్ పత్రికా మజాకా! ఈ దేశానికి మోడీ
తప్ప వేరు గత్యంతరం లేదని ఆ పత్రిక రాసిందంటే ఇక దానికి తిరుగులేదు’ అంటున్నారు
మోడీ అనుకూలురు.
మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని పేటిక
సన్నివేశం గుర్తుంది కదా! ఎవరి మనసులో బొమ్మ వారికి కనిపిస్తుంది.
నిన్ననో మొన్ననో ఓ టీవీ చర్చలో తెలుగుదేశం
ప్రతినిధి, బీజేపీ ప్రతినిధుల నడుమ సాగిన సంభాషణను ఈ సందర్భంలో పేర్కొనడం సముచితంగా వుంటుంది.
‘తెలుగు మీడియా కళ్ళతో చూస్తే
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్తితులు ఒకరకంగా కానవస్తాయి’ బీజేపీ ప్రతినిధి వ్యాఖ్య.
‘జాతీయ మీడియా కళ్ళతో చూడండి, దేశంలో స్తితిగతులు
మరో రకంగా కనిపిస్తాయి’ అనేది టీడీపీ ప్రతినిధి ప్రతి వ్యాఖ్య.
పార్టీల విధానాల వద్దకు వచ్చేసరికి
పరస్పరం విబెధించుకునే ఈ రెండు పార్టీల ప్రతినిధులు మీడియా విషయంలో ఈ రకమైన
అభిప్రాయాలతో వుండడం ఒక రకంగా మంచి పరిణామం కాదు. రాజకీయ పార్టీలు మీడియాను
ఎక్కడికక్కడ తమకు అనుకూలంగా మార్చుకుని
వ్యవహరిస్తున్నాయి అనే అభిప్రాయం విస్తరించడం స్వతంత్ర మీడియాకు అంత క్షేమకరం
కాదు. (EOM)
మీడియా ఆత్మశోధన – భండారు శ్రీనివాసరావు
సూటిగా....సుతిమెత్తగా....
అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పత్రికలవారిపట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించేవారనేది బహిరంగ సత్యం. పత్రికల యజమానులే కాకుండా అనుదినం వార్తలు సేకరించే సాధారణ విలేకరులతో కూడా ఆయన సంబంధాలు ఆదరణ పూర్వకంగా ఉండేవి. చక్కటి తెలంగాణా పలుకుబడితో కూడిన ఆయన మాటలు వినసొంపుగా ఉండేవి. సునిశితమయిన హాస్యంతో అంజయ్యగారు చేసే వ్యాఖ్యలు, విలేకరులకు వండివార్చిన 'సిద్దాన్నం' మాదిరిగా వార్తల ముడిసరుకుగా మారిపోయేవి. మరునాడు పత్రికల్లో తను చెప్పిన విషయాలను చదువుకుని 'ఇంత చక్కగా మాట్లాడానా' అని అమాయకంగా మురిసిపోయేవారు. ఆ రోజుల్లో తెలుగు పత్రికారంగంలోకి దూసుకువచ్చిన ఒక దినపత్రిక మాత్రం, కొత్త బాణీ కనిపెట్టి అంజయ్యగారి భాషను యధాతధంగా ప్రచురించడం మొదలుపెట్టింది. అందుకు ఆయన నొచ్చుకున్న దాఖలాలు లేవు కానీ, ఆ పత్రిక తీరు ముఖ్య మంత్రి స్తాయికి తగినట్టుగా లేదని జర్నలిష్టు వర్గాలలోనే కొందరు గుస గుసలాడుకున్న మాట నిజం. వున్నది వున్నట్టు రాయడంతోపాటు, అన్నది అన్నట్టు రాసే పత్రికా సంప్రదాయానికి అప్పుడే బీజం పడినట్టువుంది.
రాష్ట్ర రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో, అప్పటివరకు వార్తలకోసం కాంగ్రెస్ పార్టీ వర్గ రాజకీయాలపై ఆధారపడిన పత్రికలకు కొత్త వనరు దొరికినట్టయింది.
ఏరోజుకారోజు పత్రికలలో వచ్చిన వార్తలను పరిశీలించి అదే రోజు మధ్యాన్నం ఒక పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, రెండో పార్టీ అదే రోజు సాయంత్రం పెట్టేది. ఒకరి కామెంట్లు మరొకరికి చేరవేసే బాధ్యతను అత్యుత్సాహం కలిగిన కొందరు విలేకరులు భుజానికి ఎత్తుకునేవారు. ఇందులో వారికి ఏవో స్వార్ధ ప్రయోజనాలు వున్నాయని సందేహించనక్కర లేదు. వార్తకు వార్త తెగులు అన్నట్టు ఏదో కొత్త వార్త పట్టుకెళ్లాలన్నదే వాళ్ళ ఆరాటం. దీన్ని ఆయా రాజకీయ పార్టీలు సద్వినియోగం చేసుకునేవి. ఈ క్రమంలో సంబంధ అనుబంధాలు క్రమేపీ బలపడేవి. తాము చెప్పదలచుకున్న మాటలను తమనోటితో కాకుండా, తాము బయటపడకుండా, తమ చేతికి మసి అంటకుండా పత్రికలలో ప్రచురింపచేసుకునే విధానం రూపుదిద్దుకుంది. ఒక వార్త పత్రికల్లో వచ్చేలా చేసి, అదే వార్తను మర్నాడు తామే ఖండించేలా వీలుకల్పించే ఈ నూతన వొరవడి, రాజకీయ ప్రత్యర్ధుల పీచమణచడానికి కొందరికి బాగా ఉపయోగపడుతూ వచ్చింది. ఈ పరిణామ క్రమమే తదనంతరకాలంలో వార్తల స్తానంలో వార్తా కధనాల ఆవిర్భావానికి మార్గం వేసింది.
నూతన ఆర్ధిక సంస్కరణల అమలుతో అన్ని రంగాలలోమాదిరిగానే పత్రికారంగంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పత్రికల ముద్రణలో రంగు, హంగులు పెరిగిపోయాయి. పెద్ద స్తాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళ ప్రవేశంతో జర్నలిజం రంగానికి 'గ్లామరు' తోడయింది. సిబ్బంది జీతభత్యాలు కలలో ఊహించలేనంతగా పెరిగిపోయాయి. ఆహ్వానించదగిన ఈ పరిణామాలన్నీ పవిత్రమయిన పత్రికా రంగంలో స్వార్ధశక్తులు చొరబడడానికి కొంతమేరకు తోడ్పడ్డాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగల అమోఘమయిన శక్తి యుక్తులున్న ఈ రంగంపై రాజకీయుల కన్ను పడడంలో ఆశ్చర్య పడాల్సినది ఏమీ లేదు. అలాగే, రాజకీయ నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బడా పారిశ్రామికవేత్తలు కూడా ఈ రంగాన్ని ఎంచుకోవడంలో వింతేమీ లేదు. ఈ రెండు బలవత్తర శక్తులూ మీడియాను తమ కనుసన్నల్లో ఉంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల పర్యవసానంగానే నిప్పుకు చెదలంటుకున్నాయని చెప్పాలి.
మీడియా విశ్వసనీయతపై ఇన్నాళ్ళుగా కదలాడుతున్న నీలినీడలు ఇటీవలి కాలంలో కారుమబ్బులుగా మారి ఒక పెద్ద ప్రశ్నను మీడియా ముందుకు తెచ్చాయి.
మంచికో చెడుకో మీడియాపై ఒక చర్చ మొదలయింది. పత్రికలంటే పన్నెత్తి మాట్లాడడానికి జంకే వాళ్ళందరూ ఈ నాడు మీడియా నీతీ నిజాయితీలను గురించి నిలదీస్తున్నారు. నిరాధార వార్తలను ప్రసారం చేసే టీవీ ఛానళ్ళ నిగ్గుతేల్చాలని నిగ్గదీస్తున్నారు. బాధ్యతతో మెలగాలనీ, నిజానిజాలను ప్రసారానికి ముందే నిర్దారించుకోవాలనీ నీతి బోధలు చేస్తున్నారు. ఒకరికి దిశానిర్దేశనం చేయాల్సిన మీడియా, ఒకరితో చెప్పించుకోవాల్సిన దుస్తితిలో పడిపోయింది.
వీటికి తోడు అవినీతి ఆరోపణలు, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలూ వెలుగులోకి వచ్చి అసలే మసకబారుతున్న మీడియా విశ్వసనీయతను మరింత ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
అందుకే, మీడియా ఆత్మ శోధన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇతరుల తప్పులు ఎన్నడంతో సరిపుచ్చుకోక, తమ దగ్గర తప్పు ఎక్కడ జరుగుతున్నదో, ఎలా జరుగుతున్నదో తెలుసుకుని దిద్దుబాటు చర్యలు మొదలుబెట్టుకోవాలి. పత్రికల్లో, మీడియాలో వస్తున్న వార్తలపై, వార్తాకధనాలపై చదువరులనుంచి, వీక్షకులనుంచి విమర్శలు, అభిప్రాయాలు స్వీకరించి సరయినవాటిపై స్పందించి భేషజాలకు పోకుండా తగు మార్పులు చేసుకోవాలి. రేటింగులలో పోటీ తగ్గించుకుని నవ్యత్వంతో కూడిన కార్యక్రమాల రూపకల్పనలో పోటీ పెంచుకోవాలి. సొంత కట్టుబాట్లు, స్వీయ నియంత్రణ ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్తలో మిగిలిన అన్ని స్తంభాలు శిధిలమవుతున్నప్పుడు సరిదిద్దడానికి నేనున్నానంటూ మీడియా సన్నద్ధంగా నిలబడాలి. పూర్వ వైభవాన్నీ, వెనుకటి ఔన్నత్యాన్నీ, విలువలతో కూడిన పత్రికా సంప్రదాయాలనూ పునరుద్ధరించుకోవాలి.
కానీ, ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో ఇది నెరవేరే కలేనా?
లేబుళ్లు:
మీడియా ఆత్మశోధన – భండారు శ్రీనివాసరావు
Discussion | Time Magazine Cover on Modi With Controversial Headline | P...
ప్రతి శనివారం మాదిరిగానే ఈరోజు ఉదయం ABN Andhra Jyothy టీవీ న్యూస్ ఛానల్ లో యాంకర్ శ్రీనివాస్ నిర్వహించిన Public Point ముఖాముఖి చర్చాకార్యక్రమంలో .....
10, మే 2019, శుక్రవారం
చంద్రబాబు వెస్ట్ బెంగాల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యల సారాంశమేంటి ? Hot Topic...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime Nine Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అజయ్ శర్మ( జనసేన), శ్రీ రవిబాబు(వైసీపీ), శ్రీ వేల్పూరి శ్రీనివాస్ ( టీడీపీ)
టీవీ9 రవి ప్రకాష్ పై హీరో శివాజీ పెట్టిన కేసు వెనక రహస్యమేంటి ? | Hot To...
ప్రతి శుక్రవారం మాదిరిగానే ఈరోజు ఉదయం Prime Nine Hot Topic With Journalist Sai చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ అజయ్ శర్మ( జనసేన), శ్రీ రవిబాబు(వైసీపీ), శ్రీ వేల్పూరి శ్రీనివాస్ ( టీడీపీ)
Chandrababu met Rahul Gandhi over VVPAT slip counting | The Fourth Estat...
ప్రతి గురువారం మాదిరిగానే సాక్షి టీవీ లో అమర్ దేవులపల్లి 'ఫోర్త్ ఎస్టేట్' చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ జీ.వీ. వెంకటరెడ్డి (కాంగ్రెస్), శ్రీ రాజశేఖర్ (వైసీపీ), శ్రీ లక్ష్మీపతి రాజా (బీజేపీ)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)