19, ఏప్రిల్ 2019, శుక్రవారం

మోడీ,జగన్ & కేసీఆర్ వీళ్ళెవ్వరు నా సమీక్షలను ఆపలేరు : చంద్రబాబు | Hot To...









ప్రతి శుక్రవారం మాదిరిగానే  ఈరోజు  ఉదయం Prime 9 న్యూస్  ఛానల్   Hot Topic With Journalist Sai  చర్చాకార్యక్రమంలో  నాతోపాటు పాల్గొన్నవాళ్ళు: శ్రీ  విజయ కుమార్  (టీడీపీ), శ్రీ శ్రీనివాసరెడ్డి (టీఆర్ ఎస్), శ్రీమతి సునీతా రెడ్డి (బీజేపీ), శ్రీ విజయలక్ష్మి (వైసీపీ)

18, ఏప్రిల్ 2019, గురువారం

ఒక పరీక్ష పెట్టి ఈవీఎం లను అటకెక్కించండి

News Talk |Special Discussion With Senior Journalist Bhandaru Srinivas R...





ప్రతి గురువారం మాదిరిగానే ఈరోజు ఉదయం స్నేహ టీవీ న్యూస్ టాక్ ముఖాముఖి చర్చాకార్యక్రమంలో నాతోపాటు యాంకర్ లావణ్య

16, ఏప్రిల్ 2019, మంగళవారం

KSR Live Show: Chandrababu strategy On EVMs | గెలిస్తే భేష్..లేదంటే ట్రా...





ప్రతి మంగళవారం మాదిరిగానే ఈరోజు ఉదయం సాక్షి టీవీ  KSR Live Show చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు :   శ్రీనివాస యాదవ్ (టీ. ఆర్.ఎస్.), శ్రీ నాగార్జున యాదవ్ (వైసీపీ), శ్రీ అంబటి రామకృష్ణ ( ఏపీ కాంగ్రెస్), శ్రీ లక్ష్మీపతి రాజా (బీజేపీ)

ఎందుకు రాశాను? – భండారు శ్రీనివాసరావు


(Published in SURYA today, Tuesday, 16-04-2019) 

ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆ పుస్తకం రాసిన పెద్దమనిషి చెప్పిన సంగతులు ఇవి.
గ్రంధరచయిత ప్రసంగం ఇలా సాగింది. (ఇలానే అని కాదు, విన్న సంగతులు కాబట్టి కాస్త అటూ ఇటూగా)
“ఈ పుస్తకం రాయడానికి నాకు చాలా కారణాలు వున్నాయి.
“విసుగూ విరామం లేని ఉద్యోగం చేసి రిటైర్ అయి ఖాళీగా వున్నాను. మరీ అలా ఏ వ్యాపకం లేకుండా ఉండిపోతే ఇంట్లో ఆడవాళ్ళకు కూడా మొహం మొత్తుతుంది. మరి ఏం చేయాలి కాలక్షేపానికి అనుకుంటూ వుంటే ఓ పెద్దమనిషి తారసపడి, ఇంతవరకు ఏమాత్రం తీరికలేని ఉద్యోగాలు ఎన్నో  చేసారు కదా! బోలెడు అనుభవాలు కూడా  వుండే వుంటాయి. ఎంచక్కా ఓ ఆత్మకధ రాస్తే పనికి పనీ వుంటుంది, కాల్క్షేపంగాను వుంటుంది’ అని సలహా చెప్పాడు.
“సలహా బాగానే వుందని పించింది. కాకపొతే చాలా అనుమానాలు వచ్చాయి.
“తెలుగులో రాయాలా? ఇంగ్లీష్ లో రాయాలా?
“తెలుగువాడినే కానీ తెలుగులో రాసేంత తెలుగు వచ్చా అన్నది అనుమానం.  ఇంగ్లీష్ బాగానే వచ్చు కానీ తెలుగులో విషయాలు తెలుగు రాని వాళ్ళు చదివితే వారికి అర్ధం అవుతుందా అనే ఇంకో సందేహం.
“పోనీ ఇటు తెలుగులో, అటు ఇంగ్లీష్ లో రెండింటిలో రాస్తే పోలా! భేషుగ్గా వుంది ఐడియా.
‘ఉత్తర హిందూ స్థానంలో ఎక్కువ కాలం ఉద్యోగం చేయడంఅనే కారణం చేత  నా తెలుగు నాలుగు పొడి ముక్కలు  మాట్లాడడానికి, ఇక్కడ అంతా క్షేమం లాంటి చిన్న చిన్న ఉత్తరాలు రాసుకోవడానికి సరిపడేలా  కుదించుకు పోయింది.
“అదో పెద్ద ఇబ్బందేమీ కాదు, నువ్వు చెబుతుంటే చక్కగా రాసిపెట్టే వాళ్ళు బోలెడు మంది వున్నారని ఆ పెద్దమనిషే మళ్ళీ ఇచ్చాడు భరోసా.
“సరే! ఒక పెద్ద సమస్య తేలిపోయింది. మరి ఆత్మకధ అంటే కొన్ని చెప్పుకునేవి, కొన్ని చెప్పుకోలేనివి  వుంటాయి. గాంధీ గారిలా అన్నీ  రాసుకోవాలా లేదా కొన్ని రాసుకుని కొన్ని దాచుకోవాలా’
‘ఏ మసాలా లేకుండా రాముడు మంచి  బాలుడు తరహాలో రాస్తే చదివేవాళ్ళు ఉంటారా!
“అది పుస్తకం రాసిన తరువాత మాట. ముందు రాయడం మొదలు పెట్టమని ఆ పెద్దమనిషి గోల.
“అదీ సరే. మొదలు పెట్టేస్తాను. భాష సమస్య తీరింది, మరి మా ప్రాంతపు రాయలసీమ యాసలో రాయాలా లేదా అన్ని ప్రాంతాలవారికి అర్ధం అయ్యేలా తెలుగు సినిమా భాషలో  రాయాలా?’
“ఓరి బాబోయ్ ఇన్ని అనుమానాలా. ఇన్ని కడుపులో పెట్టుకుని ఇన్నాళ్ళు ఇన్ని ఉద్యోగాలు ఎలా చేసావంటూ ఆ  పెద్దమనిషి ఆక్రందన’
ఈ విషయాలన్నీ చెప్పిన ఆ పెద్దమనిషి నిజానికి చాలా చాలా పెద్ద మనిషి.
పేరు  యాగా వేణుగోపాల రెడ్డి. వై.వీ.రెడ్డి అనేది అందరికీ తెలిసిన పేరు. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిగా పదవీ విరమణ చేశారు. 2003 – 2005  మధ్య రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేశారు. ‘నా జ్ఞాపకాలు’ అనే పేరుతొ తమ అనుభవాలతో కూడిన ఒక గ్రంధం రచించారు.



  
     

15, ఏప్రిల్ 2019, సోమవారం

Janasena Leader Addepalli Sridhar Analysis on VVPats Counting | The Deba...





ప్రతి సోమవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం   AP 24 X 7  టీవీ  ఛానల్ లో  The Debate With venkata Krishna  చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ శ్రీనివాసరాజు (బీజేపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన).

Debate on BJP Ready For Plan "B" in After Election | The Debate with Ven...





ప్రతి సోమవారం మాదిరిగానే  ఈరోజు ఉదయం   AP 24 X 7  టీవీ  ఛానల్ లో  The Debate With venkata Krishna  చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్నవాళ్ళు : శ్రీ రామకృష్ణ (టీడీపీ), శ్రీ శ్రీనివాసరాజు (బీజేపీ), శ్రీ గోవింద రెడ్డి (వైసీపీ), శ్రీ అద్దేపల్లి శ్రీధర్ ( జనసేన).