2, ఆగస్టు 2013, శుక్రవారం

A leader who let his heart rule his head

My article in The Hans India today on Shri P.V.Ranga Rao who died in Hyderabad yesterday.





(02-08-2013)


భండారు వంశం

(నిన్నటి తరువాయి)

పర్వతాలయ్య గారి తమ్ముడు లక్ష్మీనారాయణ గారు వ్యవహార దక్షుడు. వూళ్ళో తగాదాలు వస్తే ఆయన దగ్గరకు వచ్చి పంచాయితీ పెట్టేవారు. సన్నగా,పొడుగ్గా, నిటారుగా ఉండేవాడు. ఎనభయ్ నాలుగేళ్ళకు పైగా జీవించాడు. ఆయనకు సంతానం కలగలేదు. మా పినతండ్రి రామప్రసాదరావు గారిని దత్తు తీసుకున్నారు. మా తాతగారు ప్రవ్తాలయ్య గారు బండ్లు కట్టుకుని భద్రాచలం వెళ్లి దైవ దర్శనం చేసుకుని వచ్చారు. బహుశా ఆయనకు భద్రాద్రి రామునిపై వున్న భక్తి కారణంగా మా నాన్నగారికి రాఘవ రావు అనీ, మా బాబాయికి రామప్రసాదం అనీ పేరిడి ఉండవచ్చు. ఆయనకు కనకమ్మగారని మేనత్త (రామయ్యగారి సోదరి) వుండేది. గోపినేనిపాలెం  రాజయ్యగారు ఆమె కొడుకే అనుకుంటా. అయితరాజు గోపాలరావు గారి భార్య, భండారు కామేశ్వర రావు గారి అత్తగారు జగ్గమ్మక్కయ్య, కనకమ్మగారి సంతతికి చెందినదే. తాయమ్మ, లచ్చమ్మ గార్లు ఆయన తోబుట్టువులు. లచ్చమ్మగారు సుబ్బయ్య తాతయ్య రేకుల ఇంట్లో వొంటరిగా ఉంటూ వొండుకుని తింటూ అకస్మాత్తుగా చనిపోయింది. అంతా పురుగు చేష్ట (పాము కాటు వంటిది) అనుకున్నారు. ఆమెకు సంతానం లేదు. బాల వితంతువు. డాక్టర్ జమలాపురం రామారావు (అంతా రాములు మామయ్య అంటారు. గమ్మతేమిటంటే చిన్నా పెద్ద అందరికీ ఆయన రాములు మామయ్యే.) ఆయన తాయమ్మ గారి సంతానం. పర్వతాలయ్యగారు బతికుండగా లోలోపల రగులుతూ వచ్చిన విబేధాలు ఆయన పోగానే ఒక్కసారి భగ్గుమన్నాయి. మా తాతగారిలా మా నాన్నగారు సర్దుకుపోయే మనిషి కాదు. మా బామ్మ గారిలాగే ఆయనకూడా ఒకరికి  లొంగి వుండే రకం కాదు. గ్రామానికి ఎవరు వచ్చినా మా ఇంటనే భోజనం చేసేవారు. హోటళ్ళు అవీ లేని రోజుల్లో అలాటి ఆదరణ ఎంతో ఆకట్టుకునేది. మా ఇంట్లో భోజనం చేసిన అధికారులందరూ మా నాన్న అన్నా, మా కుటుంబం అన్నా ఆదరాభిమానాలు చూపేవారు. మా నాన్నగారికి అధికారుల వద్ద ప్రాపకం అల్లా లభించిందే కాని ఒకరి సిఫారసు వల్ల కాదు. 

(కీర్తిశేషులు లక్ష్మయ్య తాతయ్య - వరం బామ్మ)


అప్పటిదాకా గ్రామంలో తిరుగులేని పెద్దరికం అనుభవిస్తున్న లక్ష్మీనారాయణ గారిది విచిత్రమైన మనస్తత్వం. ‘మీరే’ అని పెద్దపీట వేసి పిలిస్తే ప్రాణం ఇచ్చేమనిషి. తన మాట కాదంటే, వాడి అంటూ చూసే రకం. ఏది చేసినా కుటుంబంలో పెద్దవాడినయిన తనని సంప్రదించి చేయాలన్నది ఆయన కోరిక. అయితే మా నాన్నగారికి తనకు తోచింది చేయడం అలవాటు. ఒకరిని సలహా అడగడం తక్కువ. ఇద్దరూ వ్యవహార దక్షులు, స్వతంత్రులు కావడంతో వాళ్ళ మధ్య సామరస్యం ఎక్కువకాలం సాగలేదు. పరిస్తితి మాట పట్టింపులతో మొదలయి, క్రమంగా మాటలు లేకపోవడం దాకా వచ్చింది. ఆ శతృత్వం  15,20 ఏళ్ళపాటు సాగింది. ఈ లోపల ఇద్దరి నడుమా ఓ అరవై డెబ్బయ్ కేసులు, దావాలు నడిచివుంటాయి. ఈ గ్రంధ నడిచినన్నాళ్ళు వేమిరెడ్డి సోదరులు అయిదుగురూ మా నాన్నగారి  పక్షాన పెట్టని కోటలా నిలబడ్డారు. మునసబు వాసిరెడ్డి అక్కయ్య గారు కూడా మా నాన్న గారి వైపే వుండేవారు. మునసబు కరణాలు కలిసి వస్తుంటే మా రాములు మామయ్య సరదాగా ‘అక్కయ్య, బావయ్య  వస్తున్నార’ని నవ్వేవాడు. (మరో భాగం మరో సారి) 

1, ఆగస్టు 2013, గురువారం

PV Ranga Rao - who preferred heart rule head!



Seventy-five-year-old P V Ranga Rao is the eldest son of former Prime Minister P V Narasimha Rao. Of his three sons—Ranga Rao, Rajeshwar Rao and Prabhakar Rao— eldest Rao had been the most outspoken.  He remained a committed bachelor ever since the tragic death of girl, whom he loved most, in an accident.



(P.V.RANGARAO) 

He had often been known in state political circles as a maverick that always lets his heart rule his head. After his father rapped him on the knuckles for the means he adopted to oust Kasu Brahmananda Reddy, he decided to sever all ties with him.
His mother's death in 1970 came as a big blow to Ranga Rao, who started the Satyamma Narasimha Rao Memorial College in Hyderabad in her honour. A dedicated son, he literally worships his mother and harbours a feeling that his father had neglected the family.
He remained committed to his decision to keep distance from his father for well over a decade. It was only in 1985, when Narasimha Rao was HRD minister under Rajiv Gandhi, he decided to bury the hatchet with his father.
In the interim—when Narasimha Rao distanced himself from his eldest son—Ranga Rao was sought after by his father's detractors for anti-Rao statements in the Telugu press. The gossip mill also worked overtime during these 12 years.
Ranga Rao (affectionately known among  his close friends as Ranganna) does not wish to talk anymore about the past. He seems to have had a change of heart ever since his father, as prime minister, spent 24 hours  in Hyderabad while the eldest son was undergoing a bypass surgery.
For all his quirks, Ranga Rao is not guilty of having used his father's position to further his interests. He prefers to stay out of the limelight and is interested in literature and the performing arts.
He had a brief stint as Education Minister during Kotla Vijayabhaskara Reddy's Cabinet.
Ranga Rao, who was born at Vangara  passed away on Wednesday due to heart-related complications.

01-08-2013

భారతంలో ఆంద్ర ప్రదేశ్


మహాభారతంలో ఒక కధను ప్రసిద్ధ హాస్య రచయిత ఎంబీఎస్ ప్రసాద్ గుర్తుచేస్తున్నారు. ఇది చదివిన తరువాత భుజాలు తడుముకుంటే ఆయన పూచీ లేదు. కాకపోతే హాయిగా నవ్వేసుకోవచ్చని మాత్రం పూచీ ఇస్తున్నాను. నవ్వగలిగిన వాళ్ళు మాత్రమే చదవండి సుమా!
“దృతరాష్ట్రుడు పేరుకు రాజే కాని గుడ్డివాడు. అతని తమ్ముడు పాండురాజు  అతని పేరు మీద యుద్ధాలు చేసి రాజ్యాన్ని వృద్ధి చేసాడు. అతని పిల్లలు ప్రజ్ఞావంతులు. దాంతో  దృతరాష్ట్రుడికి  దిగులు పట్టుకుంది. లక్క ఇల్లు దహనం తరువాత పాండవులు వున్నచోటికి విదురుడిని పంపి వారిని హస్తినాపురానికి రప్పించాడు.

“ధర్మరాజుని పిలిచి - ‘రాజ్యాన్ని చీల్చి నీకూ, నీ  సోదరులకు అర్ధరాజ్యం ఇచ్చేస్తున్నాను. అయితే నీకిచ్చే అర్ధరాజ్యం హస్తినాపురం కాదు. కొత్త చోటు. నా పిల్లలు మంచి వాళ్ళు కాదు. మీకు హాని తలపెడతారు. అది నేను చూడలేను. అంచేత మీరు ఎంచక్కా ఖాండవ ప్రస్థం వెళ్ళిపొండి. ఆక్కడ మిమ్మల్ని ఎవరో బాధించరు. ఎందుకంటే,  అక్కడ ఏ సౌకర్యాలు లేవు. ప్రస్తుతం అది దుర్గమం, నిర్జనం. వెళ్లి దాన్ని హాయిగా  ఏలుకొండి” అని పాండవులను పంపేశాడు. శుభం భూయాత్!
Courtesy Shri M.B.S.Prasad (Great Andhra.com) 

చింతించి వగచిన ఏమి ఫలము?



మహబాగా ఆలోచించి, నిపుణులతో చర్చించి, అధికారులతో పలుమార్లు సమీక్షించి, ప్రజా ధనాన్ని పెద్దమొత్తంలో వెచ్చించి ప్రభుత్వాలు చేసే నిర్వాకాలు ఇలాగే వుంటాయి.



(కార్టూనిస్టుకి  ధన్యవాదాలు) 

నా చిన్ననాటి శతృవు మా నాన్న


చిన్నప్పుడు మా నాన్నంటే  హడల్. ఆయన వస్తున్నాడంటే అందరం పరార్. ఆయన ఏం మాట్లాడినా హుంకరిచినట్టే వుండేది.  మీదపడి కరిచినట్టే వుండేది.  ఆయన ‘ఇలా వుండాలి’ అంటే అలాగే వుండాలి. గీచిన గీటు దాటితే ఇంతే సంగతులు, వీపు విమానం మోతే.
పొరపాటున కూడా రేడియో ముట్టుకోవడానికి వీల్లేదు. ఆయన బీరువా తెరవడానికి కుదరదు. ఇరుగింటికీ, పొరుగింటికీ చక్కర్లు కొట్టడానికి లేదు. వూరికే కూర్చుని ముచ్చట్లు పెట్టడానికి కుదరదు. చెప్పిన మాట ఏది వినకపోయినా, వినలేదని తెలిసినా బడితె పూజే.    
మేం అల్లరి చేస్తే అమ్మ కూడా ‘నాన్న ఇంటికి రానీ మీ సంగతి చెబుతా’ అని బెదిరించేది. ఆ మాట వినగానే మాకు కాళ్ళు చల్లబడేవి. అంతా గప్ చుప్. అంత భయం నాన్నంటే. నాన్నంటే  యముడు. అందుకే చిన్నతనంలో మా నాన్నే మాకు మొదటి శతృవు.   
అదంతా ఎప్పటిదాకా మాకు కొంత తెలివిడి వచ్చేదాకా. పదిహేను మీదపడ్డాక కాని మా నాన్నలో దాగున్న అసలు మంచితనం  నాకు కనబడలేదు.  ఆయనే ఈయనా అనిపించేది. స్కూలు ఫీజు కనుక్కుని మరీ కట్టేవాడు. పుస్తకాల సంగతి సరేసరి. ఇంటికి వస్తూనే స్కూల్లో ఏం జరిగిందీ అన్నీ అడిగి తెలుసుకునే వాడు. పాకెట్ మనీ అడక్కుండానే పెంచేవాడు. మంచి మార్కులొస్తే ‘శభాష్’ అనేవాడు. చిన్న చిన్న  బహుమతులు ఇచ్చేవాడు. రాకపోతే ‘పర్వాలేదు ఈసారి తెచ్చుకుందువు కాని’ అని ప్రోత్సహించేవాడు.
ఇప్పుడు ఇంజినీరింగ్ చదువుతున్నాను. రేపో మాపో అమెరికా పై చదువులకు వెళ్ళబోతున్నాను. ఇదంతా మా నాన్న చలవే. సందేహం లేదు. చిన్నప్పుడు  అలా క్రమశిక్షణతో పెంచబట్టే ఇప్పుడిలా తయారుకాగలిగాను.
ఎంతయినా నాన్న నాన్నే.
కాకపొతే ఈ వాస్తవం బోధ పడడానికి పిల్లలకు  కొంత కాలం పడుతుంది.
(సందీప్ కుమార్ పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)

భండారు వంశం (నిన్నటి తరువాయి)

(నిన్నటి తరువాయి)

కాపురానికి వచ్చిన కొత్తల్లో మా బామ్మగారికి ఎప్పుడయినా కోపం వస్తే చక చకా నడిచి కాకరవాయిలోని తన పుట్టింటికి పోయేదట. ఆమెది తన మాట సాగించుకునే తత్వం. స్వతంత్రంగా ఆలోచించి పనిచేయగల ధైర్యం వున్న మనిషి. ఒకరికి తగ్గివుండే స్వభావం కాదు.ముఖ్యంగా ఏదయినా ఆపద మీద పడ్డప్పుడు బేలగా ఏడుస్తూ కూర్చోకుండా గట్టిగా నిలబడి ప్రతి క్రియ ఆలోచించే వ్యక్తి. తల్లి చెల్లమ్మ గారిలా ఆమె మెతక మనిషి కాదు.


(భండారు రుక్మిణమ్మగారు - చిన్నతనంలో - పెద్దయిన తరువాత)

ఇస్లాం ఉపదేశం పొందినప్పుడు  ఆమె తనకు తోచినట్టు చేసింది. భర్తను కూడా సంప్రదించలేదు. పైగా తన తల్లిని కూడా తోడు తీసుకువెళ్ళి తనతో పాటు ఉపదేశం చేయించింది. భర్త, ఆయన సోదరులు అందరూ సనాతన వాదులు అన్న సంగతి తెలిసీ, వాళ్ళు తను చేసే పని హర్షించరని ఎరిగుండీ కూడా ఆమె ఆ సాహసం చేసింది. నిజానికి అదేదో ఎవరో స్వాములవారు చేసే ఉపదేశం వంటిది అనుకున్నారేమో. మతం మార్పిడివంటి తీవ్ర చర్య అన్న  సంగతి వారు గ్రహించి వుండరు. దానితో మా తాతగారికి మొదట్లో కష్టం కలిగి దంపతుల మధ్య ఎడం ఏర్పడ్డా, ఆయనది సర్దుకుపోయే స్వభావం కనుక వాళ్ళ కాపురం దెబ్బ తినలేదు.


(మరో భాగం మరో సారి)