5, డిసెంబర్ 2023, మంగళవారం

తిరుపతి మనదేనా! – భండారు శ్రీనివాసరావు

 హరి సర్వోపగతుడు, సర్వవ్యాపితుడు. ఇందుగలడు  అందులేడు అనే సందేహము లేని వాడు.

భగవంతుడు అనేవాడు  అన్ని ప్రాంతాలకు చెందినవాడు. భగవంతుడు అందరికీ భగవంతుడే. అలాంటివాడిని ఒక నగరానికో, ఒక రాష్ట్రానికో పరిమితం చేసి మాట్లాడడం సంకుచితమే అవుతుంది.

అయినా కానీ, కొన్ని సందర్భాలలో  భాషాభిమానం ఈ వాదాన్ని ఒప్పుకోనివ్వదు.

ఉదాహరణకు సప్తగిరి నవంబరు సంచిక. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక పత్రిక. ఈ పత్రికను లక్షలాది మంది చదువుతుంటారు. తిరుమలకు సంబంధించిన అనేక అరుదైన విషయాలు, విలువైన  వ్యాసాలు ఈ పత్రికలో వస్తుంటాయి.

సరే అసలు విషయానికి వస్తాను.

నవంబరు సంచిక అంటే కిందటి నెల సంచిక 50 వ పుటలో బాల వినోదం విభాగంలో “మీకు తెలుసా?”  అనే శీర్షిక కింద కొన్ని ప్రశ్నలు వేసి అదే సంచికలో కింద సమాధానాలు కూడా ఇచ్చారు. జవాబులను ప్రశ్న పక్కనే బ్రాకెట్లో ఇచ్చాను.

అవేమిటంటే :

తిరుమల స్వామికి గర్భగుడిలో పై కప్పుకు కట్టే పట్టు వస్త్రం పేరు?  (కురాళం)

కోయిలాళ్వార్ తిరుమంజనం నాడు స్వామికి తొడిగే వస్త్రం పేరు?  (మలై గుడారం)

స్వామి నుదిటి నామం పేరు?  (తిరుమణి కాపు)

పట్టు విసనకర్ర పేరు?  (ఆలవట్టం)

పచ్చ కర్పూరం పేరు?  (గంబూరా)

కుంకుమ పూవు పేరు? (జాప్రా)

రాత్రి నిద్రించిన హుండీకి గల పేరు?  (తోక ముల్లె)

దేవస్థానానికి చలానాల రూపంలో చెల్లించే నగదుకు గల పేరు?  (ఇరసాల్ నామా)

దేవుని వస్తువులు ఉంచే గది పేరు?  (సభరసబేరా)

ఆలయ బీగాల గుత్తి పేరు?  (లచ్చెన)

బాలపాఠకుల విభాగంలో సంధించిన ఈ ప్రశ్నలకు సంపాదక వర్గం వాళ్ళు ఇచ్చిన సమాధానాలు చాలామంది పెద్దలకు కూడా తెలిసివుండే  అవకాశం వుందని నేను అనుకోవడం లేదు.

అసలీ పేర్లు ఏమిటి? అలాంటి అన్యభాషా పదాలను ఇప్పటికీ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది?

వాళ్ళు పెట్టిన శీర్షికనే చివర్లో  నేనూ ఉపయోగిస్తాను.

“మీకు తెలుసా?

(05-12-2023)

10 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

ఏదో ఈ నాడు ఆంధ్రా లో వుందని‌ అంతా తెలుగు పేర్లే అయ్యుండాలె అంటే ఎలాగండీ భండారు వారు ?
కన్నడ ఆసామి విజయనగర రాయలు,
తమిళ అయ్యంగార్లు
శివాజీ కాపాడిన స్థలము.
ఆర్కాటు నవాబు ఏలిన ఇలాకా :)


సో ఇన్నేసి వెరైటీ పేర్లు ఉండనే వుంటాయి గదా :)



ఇలా

bonagiri చెప్పారు...

"తిరుపతి తమిళులది, మద్రాసు మనది" అని ఒక వ్యాసం ఎప్పుడో చదివాను. తిరుమల రామచంద్ర గారు వ్రాసినట్లు గుర్తు.

అజ్ఞాత చెప్పారు...

ఆలయం లో వైష్ణవ సంప్రదాయం ఉన్నంత మాత్రాన ఊరు మారి పోతుందా. తిరుపతి లో తెలుగు జనాభా మద్రాసు లో తమిళ జనాభా అధికం. సహజంగా తిరుపతి తెలుగు వారికి మద్రాసు తమిళ వారికి ఇవ్వడం జరిగింది. ఇందులో వివాదానికి తావు లేదు. మీరు పోస్టుకు పెట్టిన శీర్షిక బాగాలేదు. అనవసర వివాదం సరికాదు.

అజ్ఞాత చెప్పారు...

Creating a new problem?

అజ్ఞాత చెప్పారు...

తిరుపతి ఖచ్చితంగా మనది కాదు .. పేరులోనే ఉంది కదా ..

అజ్ఞాత చెప్పారు...

ఎవరిదో వారికిచ్చేద్దామంటారా?
వాల్లు సనాతన ధర్మాన్ని కాపాడతారంటారా ?

అజ్ఞాత చెప్పారు...

మీ లాంటి సీనియర్ జర్నలిస్ట్లు ఇలా సెన్‌సేషనల్ హెడ్ లైన్ పెట్టి టపా రాయడం‌ బావోలేదు.

Chiru Dreams చెప్పారు...

మద్రాసుకి, తిరుపతికి మధ్య వదిలేసిన ఎన్ని గుడులున్నాయి? తిరుపతి గురించే ఎందుకు అందరి బాధ?

నీహారిక చెప్పారు...

ఈసారి పోస్టులో భద్రాచలం రామాలయం మనదేనా అని టైటిల్ పెట్టండి. అక్కడ తెలంగాణా భాష మాట్లాడేవారు తక్కువ కదా?

hari.S.babu చెప్పారు...

Zilebi చెప్పారు..
కన్నడ ఆసామి విజయనగర రాయలు,
తమిళ అయ్యంగార్లు
శివాజీ కాపాడిన స్థలము.
ఆర్కాటు నవాబు ఏలిన ఇలాకా :)

5 డిసెంబర్, 2023 3:33 PMకి
bonagiri చెప్పారు...
"తిరుపతి తమిళులది, మద్రాసు మనది" అని ఒక వ్యాసం ఎప్పుడో చదివాను.

5 డిసెంబర్, 2023 3:49 PMకి
అజ్ఞాత చెప్పారు...
తిరుపతి ఖచ్చితంగా మనది కాదు .. పేరులోనే ఉంది దా ..

5 డిసెంబర్, 2023 9:59 PMకి
అజ్ఞాత చెప్పారు...
ఎవరిదో వారికిచ్చేద్దామంటారా?
వాల్లు సనాతన ధర్మాన్ని కాపాడతారంటారా ?

6 డిసెంబర్, 2023 4:37 AMకి
Chiru Dreams చెప్పారు...
మద్రాసుకి, తిరుపతికి మధ్య వదిలేసిన ఎన్ని గుడులున్నాయి? తిరుపతి గురించే ఎందుకు అందరి బాధ?

6 డిసెంబర్, 2023 8:25 AMకి
నీహారిక చెప్పారు...
ఈసారి పోస్టులో భద్రాచలం రామాలయం మనదేనా అని టైటిల్ పెట్టండి. అక్కడ తెలంగాణా భాష మాట్లాడేవారు తక్కువ కదా?

6 డిసెంబర్, 2023 9:07 PMకి

hari.S.babu
భలే ఉన్నాయి కామెంట్లు.ఇంతకీ గుడితో ఎవరికి అవసరం ఉంది?స్వామికా!భక్తులకా!ధర్మకర్తలకా!వ్యాపారులకా!

ఎవడికి అవసరం అయితే వాడు స్వామివారి పేరున వ్యాపారం చేసుకుని సొంతానికి కొంచెం వెనకేసుకోవటం కోసమే కదా గుడిని కట్టేది,కాదా?కాశీ మొదలు తిరుమల వరకు ప్రముఖమైన ప్రతి ఆలయమూ తనచుట్టు ఒక వ్యాపారనగరాన్ని ఏర్పాటు చేసుకోవటం కాకతాళీయమా - కానే కాదు.

వ్యాపారం ఎవరు ఎక్కువ చెయ్యగలిగితే వాళ్ళు ఆలయాల్ని రక్షించి పోషించి వైదిక ధర్మాన్ని నిలబెట్టగలుగుతారు.TTD బోర్డులోకి క్రైస్తవ మతస్థులు కూడా దూరలని తహతహలాడుతూ పైరవీలు చేసుకుంటున్నదీ రమణ దీక్షితులు లాంటి కన్నింగ్ బ్రాహ్మిన్స్ నాసాలో ఉద్యోగాలు వదిలేసి పూజారులైనదీ స్వామివారి వ్యాపార పరమైన వైభవం వల్లనే.

జై శ్రీ రామ్!