అరికాలి మీద ఎవరో గోకుతున్న ఫీలింగ్ తో మెలకువ వచ్చింది. టైం చూస్తే అర్ధరాత్రి దాదాపు పన్నెండు. కిందికి చూస్తే మంచాన్ని ఆనుకుని నా వైపే నవ్వుతూ చూస్తున్న నా మనుమరాలు జీవిక. ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. ఇంత రాత్రి పూట రెండు గదులు దాటుకుని పారాడుకుంటూ నా పడక గదిలోకి ఎలా వచ్చింది. చేతులు చాపి దగ్గరికి తీసుకోమంటున్న ఆ చిన్నారిని క్షణం ఆలస్యం చేయకుండా నా చేతుల్లోకి తీసుకున్నాను.
ఏడాది కాలంలో ఇలా ఎప్పుడూ జరగలేదు అనుకోవాలా!
జరిగిందని ఆనందపడాలా!
ఎంత
గొప్ప అనుభూతి.
‘అనగనగా
ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు.
ఒకటి ఎండలేదు. చేపా చేపా ఎందుకు ఎండలేదు, గడ్డి మోపు అడ్డం వచ్చింది. గడ్డి మోపా
గడ్డి మోపా ఎందుకు అడ్డం వచ్చావు?....’
నా
చిన్నప్పుడు మా బామ్మ చెప్పిన కధ చెబుతుండగానే
అది పూర్తి కాకుండానే నా ఒడిలోనే జీవిక నిద్రపోయింది.
07-01-2023
2 కామెంట్‌లు:
great Bliss.
అదృష్టం
మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే కుటుంబ సభ్యులు ఉండటం .
ఎన్ని కోట్లు , అపార్ట్మెంట్ లు ఉన్నా, ఏంటి ఉపయోగం . కొంత మంది పలకరింపు కి కూడా నోచుకోలేరు
మంచి అనుభూతి ను పంచుకొన్నారు. God bless her!
కామెంట్‌ను పోస్ట్ చేయండి