నన్ను’గోడ’ దించిన టీవీ జర్నలిస్ట్ వెంకట
కృష్ణ - భండారు శ్రీనివాసరావు
కృష్ణ - భండారు శ్రీనివాసరావు
అంటీముట్టనట్టుగా, తామరాకుమీది నీటి
బొట్టులా, కాస్త ముదురుగా చెప్పాలంటే ‘గోడ మీది పిల్లి’లా టీవీ చర్చల్లో నా వైఖరి
ఉంటుందని చాలామంది చెప్పారు. ఇంతెందుకు, ఇంటికి రాగానే మా ఆవిడే అంటుంది, ఇక ‘గోడ’
దిగండని. మా ఆవిడ నాకు పెట్టిన ముద్దు పేరు ‘గోపి’

దీనికి కారణం నాకు నేనుగా పెట్టుకున్న
నిబంధన. ఎంతో అవసరం అయితే తప్ప పార్టీల పేర్లు, వ్యక్తుల పేర్లు,టీవీ చర్చల్లో నా నోటి నుంచి రాకూడదని.

ఈరోజు సోమవారం ఎప్పటి మాదిరిగానే AP
24 X 7 న్యూస్ ఛానల్ లో “The Debate With Venkata Krishna” చర్చాకార్యక్రమం. ఎప్పటి మాదిరిగానే నా విశ్లేషణ. చూసీ చూసీ, వినీ
వినీ విసుగు పుట్టిందో ఏమో కానీ వెంకట
కృష్ణ నవ్వుతూనే ఈ అంశం లేవనెత్తారు. ‘నొప్పించక తానొవ్వక’ అనే ఈ విధానం వల్ల ఒక
జర్నలిష్టుగా మీ బాధ్యతను పూర్తిగా నెరవేర్చినట్టు అవుతుందా అని.

ఆ విధంగా ఆయన నా నెత్తిన పాలు పోశారు.
నేను ఎందుకిలా మాట్లాడాల్సి వస్తోంది అనే ప్రశ్నకు బహిరంగంగా ఒక టీవీ వేదికగా వివరణ
ఇచ్చుకునే ఓ మంచి అవకాశం నాకాయన కల్పించారు. అందుకు కృతజ్ఞుడిని.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి