11, అక్టోబర్ 2018, గురువారం

ఎవరికోసం ? – భండారు శ్రీనివాసరావుతుపాను సృష్టించిన నష్టాలు, సహాయక చర్యలపై టీవీలో చర్చ జరుగుతోంది.
“తుపాను తీరం దాటిన ప్రాంతం నుంచి మా ప్రతినిధి చెప్పిన వివరాలు విన్నారు కదా! అక్కడ పరిస్తితి భీభత్సంగా వుంది. పెనుగాలులకు చెట్లు కూకటి వేళ్ళతో కూలిపోయాయి. రోడ్లు  భయంకరంగా దెబ్బతిన్నాయి. రవాణా పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరాకు తీవ్రమైన అంతరాయం కలిగి ఆ ప్రాంతాలన్నీ అంధకారబంధురంగా మారాయి. సాధారణ పరిస్తితులు తిరిగి నెలకొనడానికి ఎంత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు అధికారులు.  ఈ నేపధ్యంలో సహాయక చర్యలు ఎలా వుండాలి? అక్కడి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అనే దానిపై ఇప్పుడు చర్చిద్దాం”
అన్నాడు యాంకరు.
“చర్చించి ఎవరికి ఉపయోగం? చర్చిస్తున్న ప్రాంతంలో తుపాను ప్రభావం లేదు. ప్రభావం చూపించిన చోట కరెంటే లేదని మీ విలేకరే చెప్పాడు. కరెంటు లేకపోతే పనిచేసే టీవీలు ఇంకా వినియోగంలోకి రాలేదు. మరెవరికోసం ఈ చర్చ?”
కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షకుడి సందేహం.  

5 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

ప్రేక్షకుడి ప్రాంతం లో తుఫాను వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుంటారుగా అందుకైనా ఉపయోగపడుతుంది. ఏమన్నా అంటే అన్నామంటారు గాని కొన్నిసార్లు మీరు రాసే టపాల వల్ల పూచిక పుల్లంత ఉపయోగం లేకపోయినా మేము చదవట్లేదా? ఇదీ అలాగే.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Well said

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@SURYA : నా రాతలకు విలువ కట్టడం కట్టకపపోవడం మీ ఇష్టం సుమండీ. కానీ పూచికపుల్లను చిన్న బుచ్చకండి. హీనంగా చూడకు దేన్నీ అన్నాడు మహాకవి శ్రీ శ్రీ. పూచికపుల్ల ప్రసక్తి తెచ్చారు కాబట్టి ఓ విషయం చెబుతా ఇనుకోండి. చాలా ఏళ్ళ క్రితం ఇందిరా గాంధీ పాలన కాలంలో పెద్ద గోయెంకా (రామనాధ్ గోయెంకా, ఇండియన్ ఎక్సప్రెస్ గ్రూపు అధిపతి) కు ఆమె అంటే నరనరాన ద్వేషం. ఆయన తన సహచరులతో అనేవారు, చిన్న పూచికపుల్ల దొరికినా దాంతో ఇందిరను దెబ్బతీస్తానని.

అజ్ఞాత చెప్పారు...

సోది చర్చలతోని ఏమి ఉపయోగం. ప్రతి వాక్యంలో పరిస్ధితి పరిస్థితి అంటూ పిచ్చివాగుడుకాయ ఎంకమ్మలు లబలబమని ఎదో కక్కుతుంటాడు. తుఫాను పుణ్యమా అని ఈ టుంబకాయ ఛానెల్లు గోల తప్పుతుంది.

సూర్య చెప్పారు...

నా వ్యాఖ్య మరోసారి గమనించండి. "కొన్నిసార్లు" అన్నానేగాని అన్ని టపాలూ పనికిరానివి అనలేదుగా. పైపెచ్చు మీరు చెప్పిన ఉదాహరణ తో కూడా నాకు ఎం ఉపయోగం లేదు. వాళ్ళు వాళ్ళు ద్వేషించుకుంటే నాకెందుకు? ఒక పౌరుడిగా చట్టవిరుధ్ధమైన నేరం జరిగినపుడు స్పందిస్తాను.