నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేసే రోజుల్లో తెలుగు కార్యక్రమాలు శ్రద్ధగా వినే శ్రోతలకు రేడియో తరపున చిన్ని చిన్ని కానుకలు పంపించే సాంప్రదాయం వుండేది.
మన దేశంలో టీవీ దూరదర్సన్ రూపంలో రంగప్రవేశం చేసిన మొదటి సంవత్సరాలలో బాగా కలిగిన వాళ్ళ ఇళ్ళల్లోనే టీవీ సెట్లు కనిపించేవి. ఆదివారం రోజున ఆ లోగిళ్ళు అన్నీ రామాయణ, భారతాల ప్రేక్షకులతో నిండి కనిపించేవి. బాపూ రమణలు మిస్టర్ పెళ్ళాం చిత్రంలో ఇటువంటి సన్నివేశాలను హృద్యంగా జొప్పించారు కూడా.
మరి ఇప్పటికీ వెనుకటి మాదిరిగా రేడియో (ఆకాశవాణి) వింటున్నవాళ్ళు, దూరదర్సన్ చూస్తున్న వాళ్ళు వున్నారా అని కొందరు అమాయకంగా అడుగుతుంటారు. పెద్ద గీత ముందు చిన్న గీత లాగా మునుపటి మాదిరిగా ‘ఈ సంగతి రెడియోలోవిన్నాం’ అని చెప్పేవాళ్ళు అంతగా కనిపించక పోవచ్చుకానీ వినేవాళ్ళు లేకుండా మాత్రం పోలేదు.
రేడియో వినడమే కాదు, రేడియో అంటే ప్రాణం అని చెప్పే ఒక వ్యక్తి ఈరోజు నాకు తారసపడ్డాడు. అతడి మాటల్లో నా ప్రసక్తి వుంది కాబట్టి అది ప్రస్తావించకుండా విషయం వివరించలేని పరిస్తితి నాది. కొంత స్వోత్కర్ష అనిపించినా దానికి మినహాయింపు ఇచ్చి నేను చెప్పే విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నా వినమ్ర పూర్వక విన్నపం.
ఇవ్వాళ నేనూ మా ఆవిడా తీరి కూర్చుని గిల్లికజ్జాలు పెట్టుకోవడం మంచిది కాదని, ఆ తీరిక సమయాన్ని ఓ సినిమా చూడడంలో గడపాలని నిర్ణయించుకుని దాన్ని తక్షణం అమలుచేసాం. ఒక మాల్ లోని హాల్లో సినిమా చూసి ఇంటికి రావడానికి ఉబెర్ బుక్ చేసుకునే ప్రయత్నంలో వుండగా ఆ వ్యక్తి మా ఆవిడతో మాట్లాడ్డం గమనించాను. రేడియోలో పనిచేసే శ్రీనివాసరావా అని అతడు ఆరా తీయడం కనిపించింది. కన్నుమూసి తెరిచేలోగా అతగాడు అదాటున ముందుకు వంగి నా కాళ్ళకు దణ్ణం పెట్టాడు. నలుగురిలో అతడలా చేయడంతో సిగ్గుతో ముడుచుకుపోయాను.
“ఇది నేను రేడియోకు పెడుతున్న నమస్కారం, వేరేలా అనుకోకండి” అనేశాడు.
తన పేరు సుభాష్ అని, కరీం నగర్ జిల్లా వాసిననీ, ప్రస్తుతం కూకట్ పల్లిలో వుంటున్నాననీ వివరాలు అడగకుండానే చెప్పాడు. రేడియో వినడం చిన్నప్పటి నుంచి తనకు అలవాటని చెబుతూ జేబులోనుంచి ఒక బుల్లి ట్రాన్సిస్టర్ తీసి చూపించాడు. వారానికి రెండు సార్లు వచ్చే వార్తావాహిని, ప్రతి గురువారం వచ్చే జీవన స్రవంతి వినేవాడినన్నాడు. 1989 లో నేను మాస్కో వెళ్లకముందు నేను చేసిన ప్రోగ్రాములు అవి. అంటే దాదాపు మూడు దశాబ్దాలు కావస్తోంది. టీవీల్లో భండారు శ్రీనివాసరావు అని చెబుతూ వుంటారు, అలా చూసి మిమ్మల్ని గుర్తు పట్టాను అని ఒక చిన్న వివరణ ఇచ్చి నా మనసు మూలల్లో తొలుస్తున్న సందేహాన్ని నివృత్తి చేసాడు.
ఆ రేడియో అభిమానితో ఓ సెల్ఫీ దిగాలనిపించింది. కానీ ఆ ప్రక్రియ నాకు రాదు. ఈ లోపల అతడే ఓ సెల్ఫీ తీసుకోవచ్చా అని అడిగి తన సెల్ ఫోన్ తో తీసి ఒకటి నాకు వెంటనే వాట్సప్ లో పంపాడు.
ముందుగా మాస్కో రేడియో ప్రసక్తి ఎందుకు తెచ్చాను అంటే, ఆకాశవాణివాళ్ళు కూడా ఇటువంటి అభిమానులతో కొన్ని ఇంటర్వ్యూలు చేసి ప్రసారం చేస్తే బాగుంటుందని.

కొసమెరుపు: కారెక్కగానే మా ఆవిడ అంది, గిల్లికజ్జాకు ప్రారంభ సూచికగా.
"మీరు రేడియో మనిషని అటు రెడియో వాళ్ళు, ఇటు దూరదర్సన్ వాళ్ళు ఎప్పుడో మరచిపోయారు, కనీసం రేడియో వినే వాళ్ళయినా మిమ్మల్ని గుర్తుంచుకుంటున్నారు, సంతోషించండి"
8 కామెంట్‌లు:
there were/are/will always be fans for all good things. I am glad that you were able to meet one of such ardent fans and got to taste the pleasure out of that meeting.
మా నాన్నగారికి రేడియో అంటే ప్రాణం. చివరి రోజుల్లో కళ్ళు కనిపించక మానేసారు కానీ బెడ్ మీద పడుకునే రేడియోలో వార్తలు వింటూనే ఉన్నారు. మా ఇంట్లో కొత్తగా టేప్ రికార్డర్ రావడం ఆదివారాలు అందరం కూర్చుని శ్రద్దగా సినిమాలు వినడమూ ఇంకా గుర్తే ! ఎఫ్ ఎం రేడియోలు ప్రాచుర్యం పొందింది కూడా రేడియోకి ఆదరణ ఉండటం వల్లనే కదా ? ఇపుడు ఎఫ్ ఎం లలో కూడా ఎడ్వర్టైజ్మెంట్స్ పెరిగిపోవడం వల్ల ఆసక్తి తగ్గింది. కొన్ని బ్లాగులు చదవాలంటే ఈ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల చదవబుద్దికావడం లేదు. మొబైల్ లో చదవాలంటే అవి అడ్డుపడుతున్నాయి. వినోదం కోసం రేడియో వింటాం కానీ వినోదాన్ని వ్యాపారం ఆక్రమించేసి వినోదాన్ని తగ్గిస్తే ఆసక్తి తగ్గిపోతుంది.
@అజ్ఞాత : ధన్యవాదాలు
@నీహారిక : ధన్యవాదాలు
1970 ప్రాంతం లో మద్యాహ్నం 3 గం.లకు"ఆకాశవాణి...సంక్షిప్త శబ్ద చిత్రం" అని ఎంతో ఉద్వేగంగా అనౌన్స్ చేస్తూ చక్కటి సినిమాలు వినిపిస్తూ వుంటే పిల్లా..పాప...ముసలి..ముతకా..అంతా బుజ్జి రేడియో చుట్టూ చేరి...చెవులు రిక్కించి వినేవాళ్ళం... బయట రోడ్డు మీద పిట్ట మనిషి వుండే వాడు కాదు..కొన్నేళ్ళ పాటు ఆకాశ వాణి ఎంతో వెలుగు వెలిగింది.. రేడియో లో పనిచేసే వారు దేవతలు...ఇది నిజం...
// “..... వినోదాన్ని వ్యాపారం ఆక్రమించేసి వినోదాన్ని తగ్గిస్తే ఆసక్తి తగ్గిపోతుంది.” //
Well said నీహారిక గారూ. ఇప్పుడు జరుగుతున్నది దోపిడీని ఒక్క వాక్యంలో బాగా summarise చేశారు. ఉదాహరణకు :- టీవీ ఛానెళ్ళలో ఇదేగా మనకు కనిపించేది ... అడ్వర్టైజ్మెంట్ల మోజులో పడి ఛానెల్ వారు ప్రేక్షకుడికి చూపించేది 1/3rd స్రీనే కదా ... చూసేవాడి కళ్ళు నాశనమైపోయేట్లు. మరొక ఉదాహరణ :- జనాలు సినిమాహాలుకి వెళ్ళేది వినోదానికే కదా .... అక్కడ ఎంత విచ్చలవిడి దోపిడీ నిస్సిగ్గుగా జరుగుతోందో కనబడుతూనే ఉంది ... నీళ్ళ సీసా వందరూపాయలు, చిన్న పాప్ కార్న్ పొట్లం రెండువందల రూపాయలు (నేను విన్న వార్తలని బట్టి) ... ఇంక ప్రేక్షకుడికి వినోదం ఏం దక్కుతుంది, ఈ దోపిడీ గురించి తలుచుకోవడమే మిగులుతుంది కానీ (డబ్బు వెదజల్లేవారికి చీమకుట్టినట్లు ఉండదనుకోండి, అది వేరే సంగతి). దండిచేస్తాం, నియంత్రించేస్తాం అంటుంటారు ఏలినవారు. కానీ మీరన్నట్లు వ్యాపారాదాయపు మత్తు ఎక్కిన వారికి ఇవేమీ పట్టవు. .
@voleti : THANKS - BHANDARU SRINIVAS RAO
@ విన్నకోట నరసింహారావు : ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి