ఈరోజు ఆదివారం ఉదయం టీవీ 5 న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమంలో నాతోపాటు పాల్గొన్న వాళ్ళు: శ్రీ కుటుంబరావు (ఆంధ్రప్రదేశ్ ప్రణాలికా మండలి ఉపాధ్యక్షులు, టీడీపీ), శ్రీ రఘురాం (బీజేపీ, ఢిల్లీ నుంచి), శ్రీ పార్ధసారధి, మాజీ మంత్రి, వైసీపీ). టీవీ 5 ఎక్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీ విజయ్ నారాయణ
2 కామెంట్‌లు:
ఒకప్పుడు బౌద్ధులూ జైనులూ సనాతనధర్మావలంబుల మధ్యన వాదసభలు జరిగేవి.
అవి ఎంత అందంగా జరిగేవో వేరే చెప్పాలా?
బౌధ్ధుడు వాదంలో త్రిశరణములు ప్రమాణం తప్ప మిగతావి అంగీకారయోగ్యం కావంటాడు.
సనాతనధర్మవాది వేదములు తప్ప మిగతావి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాణం అయ్యే ప్రసక్తి లేదంటాడు.
జైనుడేమో ఠాట్ చతుర్వేదాలు కావు చర్పూర్వలు తప్ప మిగతావి చెత్త సుమా అని నిష్కర్ష చేస్తాడు పెద్దగొంతుతో.
ఎవరి వద్దా పట్టూ విడుపూ ఉండదు.
కాసేపు ఒకరి ప్రమాణాలను మరొకరు తూర్పారబట్టడంతో సరిపోతుంది.
అప్పుడు ఆగ్రహావేశాలతో ఒకరిపై ఒకరు త్వంశుంఠః అంటే త్వమేమశుంఠా అనుకోవటం - అరుపులూ కేకలూను.
ఇంకా బాహాబాహీ ముష్టాముష్టి వాదం మొదలు.
సభాసదులు వాళ్ళని బలవంతంగా విడదీసి ఊరి పొలిమేరలు దాటించటం.
ఎవరికి వారు తమదే జయం అని ప్రకటించుకొని ఊరూరా తమవిజయగాథలను స్వయంగానూ శిష్యముఖంగానూ చాటింపువేసుకొనటం.
వేరే ఎవడికో ఒళ్ళూమండితే మరొకచోట మరొక సభ.
మళ్ళా అదే తమాషా.
ఈ విధంగానే నేటి ఈ రాజకీయచర్చలున్నూ.
సమప్రమాణమైన సిధ్ధాంతమూ విషయమూ లేని నాటీ మతవాదసభలకూ నేటి రాజకీయ సభలకూ ఆట్టే తేడా ఏముంది?
నలుగురో ముగ్గురో వేరేవేరే రాజకీయపార్టీలవారు తామే లోకోద్ధారకపార్టీలవారమని గోలగోలగా అరవటమూ ఇతరులందరిపైనా మాటలు మిగలటమూ చూసిచూసి జనం ఈ తమాషాలను లెక్కజేయటం ఎప్పుడో మానేసారు.
ఐనా ప్రతిఛానెలువారూ మిగతాఛానెళ్ళ వారిలాగే ఎవరెవరో నాయకులనూ మేతావుల్నీ పోగేసి రోజూ ఈ తప్పనిసరి చర్చలు నడిపించకపోతే మిగతావారితో పోటీపడలేమని బలవంతంగా బండి లాగించటమే కాని అందరికీ ఈ చర్చల గురించి వీటి నిష్ప్రయోజకత్వాన్ని గురించీ అవగాహన లేదని అనుకోలేం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి