చక్కటి మాట చెప్పాడు నిర్మల్ అక్కరాజు.
నాకు ప్రతి గురువారం ఉదయం స్నేహ టీవీలో
ఉభయం. అంటే ఆనాటి వార్తల మీద విశ్లేషణ. ఇది ప్రతి రోజూ ఉదయం తంతే కనుక మా ఆవిడ
నాకు ‘వారాలబ్బాయి’ అనే నిక్ నేమ్
పెట్టింది.
ఒకరోజు ప్రోగ్రాం అయిపోయి
తిరిగొస్తున్నప్పుడు అతనన్న మాట ఇది.
‘తలెత్తుకుని జీవిద్దాం’.
(PHOTO COURTESY: IMAGE OWNER)
ఈ మాట అంటూ అతడు చూపించిన వైపు దృష్టి
సారించాను. రోడ్డు మీద కనబడ్డ వారందరి చేతుల్లో సెల్ ఫోన్లు వున్నాయి. వారిలో
రాత్రంతా ప్రయాణం చేసి బస్సులు దిగిన వాళ్ళున్నారు. వాళ్ళను ఇళ్ళకు చేరవేసే ఆటో
డ్రైవర్లు వున్నారు. రోడ్లు ఊడ్చే పనివారు వున్నారు. దాదాపు అందరూ తలదించుకుని
మొబైల్ ఫోన్లలోకి చూస్తున్నారు.
నిజమే! వీరందరూ ‘తలెత్తుకుని’ ఎప్పుడు
జీవిస్తారు?
నిర్మల్ అక్కరాజు నాకు కొత్తగా పరిచయం
అయిన టీవీ యాంఖర్. నిజానికి ఆయన ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగమే
చేస్తున్నాడు. కానీ ఇంత పొద్దున్నే లేచి వచ్చి చేసే ఈ యాంఖర్ కొలువు ఆయన ఇష్టపడి
నెత్తికెత్తుకున్నది. అసలాయన అసలు ఇష్టం రేడియో. ఆదివారం సెలవయినా పనికట్టుకుని
ఒకప్పుడు నేను పనిచేసిన రేడియోకి వెళ్లి వార్తలు చదువుతాడు. ఇష్టమయిన పనిచేసేటప్పుడు
కష్టం అనిపించదు అంటాడు రేడియో మీద చిన్నప్పటి నుంచి అవ్యాజమైన అనురాగం గుండెలనిండా
నింపుకున్న ఈ పెద్దమనిషి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి