హైదరాబాదు ప్రెస్ క్లబ్ స్థాపించి యాభయ్ ఏళ్ళు
గడిచాయి. ఇందులో నలభయ్ ఏళ్ళకు పైగా ఆ క్లబ్ సభ్యుడిగా వుంటూ వచ్చాను. క్లబ్
కార్యవర్గ సభ్యుడిగా, క్లబ్ కార్యదర్శిగా, క్లబ్ ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో
ప్రెస్ క్లబ్ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాలుపంచుకునే అవకాశం లభించడం నా
అదృష్టం.
మొన్నీ మధ్య ప్రెస్ క్లబ్ స్వర్ణోత్సవాలు ఘనంగా
జరిగాయి. ప్రధాన ఉత్సవానికి ముందు రోజు క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి
తెలంగాణా ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరై సీనియర్
సభ్యులను సత్కరించారు. మరుసటి రోజు రవీంద్రభారతిలో నిర్వహించిన స్వర్ణోత్సవంలో గవర్నర్ శ్రీ నరసింహన్, కేంద్ర
మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణా ఐ.టీ. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులమీదుగా
మరోమారు ఈ సత్కారం స్వీకరించే అవకాశం మా బోంట్లకు కలిగించిన క్లబ్ కార్యవర్గానికి
కృతజ్ఞతలు.
7 కామెంట్‌లు:
Congratulations. By the way I read all your posts. Do keep writing/sharing the knowledge. Thank you.
@Sridevi - Thanks for your patronage
అభినందనలు శ్రీనివాసరావు గారూ. మీరు ఆ రంగానికి చేసిన సేవకి గుర్తింపు.
హైదరాబాద్ వచ్చి ఇన్నేళ్ళయినా మీకంటూ ఆస్థి సంపాదించుకోకపోయినా, కర్రవిరగకుండా పాము చావకుండా ఉండేలా మాట్లాడే మీరు,ఎవరి జోలికీ వెళ్ళకపోబట్టే నెత్తి మీద ఆస్థి మాత్రం మిగిలింది. మీకు నా అభిమాన జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యర్ గారి తర్వాతి స్థానాన్ని ఇస్తున్నాను.అభినందనలు.
Happy Blogging !
నీహారికగారి అభినందనలనీ అవిడ మీ కొసంగిన స్థానాన్నీ స్వీకరించండి. లేని పక్షంలో ఆవిడ చేతిలో మీ ఎముకలు మిగలవు.
@ Anonymous,
నా స్నేహితుల లిస్ట్ లో కూడా భండారు వారున్నారు,వారు మర్యాదస్థులు,నాకు వారితో భేధాభిప్రాయమెపుడూ రాలేదు.ఇద్దరు సమాన భావాలు కలిగినవారి మధ్య భేధాభిప్రాయం వచ్చే అవకాశం లేదు. మీరు ఆ(యా)సపడకండి.
తాటకి ఇక్కడ కూడ తయారైందే!
కామెంట్‌ను పోస్ట్ చేయండి