ఇప్పుడే ఒక ఛానల్ లో కింద వచ్చే స్క్రోలింగు చూశాను. రాబోయే కార్యక్రమానికి
చెందిన సమాచారం అది.
“సోనియా అమెరికా ఎందుకు వెళ్ళింది” అన్నది ఆ
స్క్రోలింగు.
కాస్త మర్యాదగా “సోనియా అమెరికా ఎందుకు వెళ్ళారు”
అని దాన్నే మార్చి రాయొచ్చు. ఒకవేళ అది కుదరని
పక్షంలో “సోనియా అమెరికా ఎందుకు వెళ్లినట్టు?” అని రాస్తే ఎవరికీ ఇబ్బంది వుండదు.
“మోడీ పారిస్ వెళ్ళారు” అనడానికీ, “మోడీ పారిస్
వెళ్ళాడు” అనడానికీ వున్న తేడాను ఈ స్క్రోలింగులు రాసే వాళ్ళు గమనిస్తే
బాగుంటుంది.
కాలేజీ రోజుల్లో మాకు ఇంగ్లీష్ గ్రామరు లెక్చరరు
క్లాసులోకి రాగానే ‘లెస్ నాయిస్ ప్లీజ్” అనేవారు. ‘స్టూడెంట్లు ఎట్లాగో అల్లరి
చేస్తారు. కాస్త తక్కువ గోల చేయండ’ని ఆయన వేడుకోలు.
అల్లాగే
ఈనాటి మీడియా కూడా, వున్నపరిధుల్లో, పరిమితుల్లో కాసింత ‘కర్టెసీ’ చూపితే
బాగుంటుందని భవదీయుడి సూచన.
3 కామెంట్‌లు:
నేతిబీరకాయలో నెయ్యా !!??
ఈ విషయంలో ప్రింట్ మీడియా కొంచెం నయం, కానీ స్పోర్ట్స్ పేజీలో ఆటగాళ్ళ పేర్లు ఏకవచనంలోనే ఎందుకు రాస్తారు అని ఒక పాత్రికేయ మిత్రుణ్ణి అడిగితే, జనాలు స్పోర్ట్స్ మెన్ ని అలాగే పిలుస్తారు కాబట్టి, అలా రాస్తేనే ఓన్ చేసుకుంటారు అని చెప్పారు. బహుశా, ఇదే లాజిక్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా పాటిస్తుందేమో
మరీ మోహబ్బత్ ఎక్కువైతే ఏకవచనం వస్తుందేమో నండీ !
మీడియా వారికి రాజకీయ నాయకులంటే మరీ మోహబ్బత్ ఎక్కువేమో !
త్యాగయ్య వారు ప్రేమతో రామ 'నీ' సమానమెవ్వరు అన్నట్టు :)
అదే చాగంటి వారి గురించి చెప్పాలనుకుంటే చాగంటి వారు చెప్పారు అనే అంటారేమో మీడియా (అనుకుంటా !:))
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి