(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 24-09-2015, THURSDAY)
నదుల అనుసంధానం అనే పదం దేశంలో ఇప్పుడు
త్వరితగతిన ప్రాచుర్యం పొందుతోంది. అటు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇటు
ఆంద్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం నదుల అనుసంధాన కార్యక్రమాలకు ఇస్తూవస్తున్న
ప్రాధాన్యత కూడా ఇందుకు దోహదం చేస్తుండవచ్చు.
ఈ అనుసంధాన ప్రక్రియకు ఈ నెలలోనే తెలుగు రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్ లో అంకురార్పణ జరిగింది. గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు
ఉద్దేశించిన పట్టి సీమ ప్రాజెక్టును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆఘమేఘాల మీద పూర్తి
చేసి, గోదావరి నీళ్ళను కృష్ణలో కలిపి రికార్డు వ్యవధిలో ఆ పని పూర్తి
చేశానని సగర్వంగా ప్రకటించింది. అనేకానేక బాలారిష్టాలను దాటుకుంటూ పట్టిసీమ
ప్రాజెక్టును పూర్తిచేసినట్టు ప్రభుత్వం అయితే ఆర్భాటంగా చెప్పుకుంటోంది కాని ఈ
విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి వున్నాయి. ఎవరి అనుమానాలు వారికి వున్నాయి. ఉండడమే కాదు వాటిని బాహాటంగా
వ్యక్తం చేస్తున్నారు కూడా. చెప్పిన గడువులోగా పని పూర్తిచేసిన ఘనతను తన ఖాతాలోకి
వేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం కొంత అనవసర ప్రయాస పడ్డదేమో అనికూడా
అనిపిస్తోంది. తొందరగా పనిపూర్తిచేసి సకాలంలో పొలాలకు నీళ్ళు అందించే ప్రయత్నం
హర్షించతగ్గదే, ములుకోల చేత
పట్టి అధికారగణాన్నీ, కాంట్రాక్టర్లను అదిలించకపోతే పనులు ముందుకు
సాగని మాట వాస్తవమే. అయితే ఇటువంటి భారీ ఇంజినీరింగు వ్యవహారాల్లో కొన్ని
సాంకేతికపరమైన వ్యవధానాలతో పనులు చక్కబెట్టుకోవాల్సిన అవసరం వుంటుంది. రాత్రికి
రాత్రే కాలువలు తవ్వించడం వీలయినట్టు, గడువులు నిర్దేశించి ఆక్విడక్టు
నిర్మాణాలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలా
వీలు కాదని, నీళ్ళు ఒదిలిన వెంటనే కూలిపోయిన ఆక్విడక్టు కధే చెబుతోంది. దీనికి
ఎవరు బాధ్యత వహించాలి అనే చర్చ కన్నా, ఇటువంటివి జరగకుండా చేయడంలో బాధ్యత వహించి
పనిచేయడం అనేది బాధ్యత కలిగిన ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం. కాకపొతే భారీ
ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో కొన్ని ఇటువంటి అవాంతర పరిస్తితులు తలెత్తడం సహజం
కూడా. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలి. మంత్రులు, అధికారుల
మీదా, అధికారులు కాంట్రాక్టర్ల మీదా నెపాలు మోపుకుంటూ సమస్యను సాగదీయడం తగని
పని. ఇక ప్రతిపక్షాలు యాగీ చేయకుండా వూరుకోవడం ఇలాటి సందర్భాల్లో అసాధ్యం. వాటికి
ఆ నైతిక హక్కు లేదనడం ఒకప్పుడు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇటువంటి ఆరోపణలే చేసిన
పాలక పక్షానికి తగదు. సరే! ఇప్పుడు కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ లో
నడుస్తున్న రాజకీయాల తీరుతెన్నులే ఆవిధంగా
వున్నప్పుడు చెబితే వినేవారు ఉంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది.
పొతే, అసలు నదుల అనుసంధానం అనే ప్రక్రియ మీదనే
జాతీయ స్థాయిలో పుంఖానుపుంఖాలుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ఆహా ఓహో అని
ప్రశంసిస్తూ వుంటే మరికొందరు దండగమారి వ్యవహారం అని ఎద్దేవా చేస్తున్నారు.
మరికొందరు పర్యావరణ ప్రేమికులు ఏకంగా నదుల అనుసంధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఒక
వాదం మంచిదనీ, మరో వాదం చెడ్డదనీ చెప్పలేని పరిస్తితి. ప్రతి
విషయంలో మంచీ చెడూ రెండూ ఉన్నట్టే ఇదీ అందుకు మినహాయింపు కాకపోవచ్చు. కాకపోతే ఈ మంచి
చెడుల నడుమ పైకి కనబడని ఓ సన్నని విభజన రేఖ వుంటుంది. దాన్ని పట్టుకోగలిగితే
మంచిని పెంచుకుంటూ, చెడు తీవ్రతని తగ్గించుకుంటూ మంచి ఫలితాలు
రాబట్టుకోవచ్చు.
నదులనేవిఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో
పారి మరెక్కడో సుదూరాన కడలిలో కలుస్తుంటాయి. అవి ప్రవహించే దారిలో తమ దాపున
వున్న పల్లపు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ వెడతాయి. ఆ నదీ పరివాహక ప్రాంతంలో
వున్న ప్రదేశాలు వాటి ఉనికికి అనుగుణంగా ప్రయోజనం పొందుతాయి. నీరు పల్లమెరుగు అనే
సామెతకు తగ్గట్టుగా ఎగువ ప్రాంతాలకన్నా దిగువన వుండే ప్రాంతాలకు లబ్ది ఎక్కువ
చేకూరుతుంది. ఇది ఆయా ప్రాంతాలకు ప్రక్రుతి ప్రసాదించే వరం, శాపం
కూడా. అయితే తద్విరుద్ధంగా భారీ మోటార్లు వాడి పంపుల ద్వారా ఎగువ ప్రాంతాలకు కూడా
నీరును తోడిపోసే సాంకేతిక ప్రక్రియలు ఉపయోగించి పట్టిసీమ వంటి ప్రయోగాలు
జరుగుతున్నాయి.
దేశంలో వున్న వేలాది నదుల్లో కొన్ని మాత్రమె
జీవనదులు. చాలావరకు వర్షాధారంగా పారే నదులు. అందువల్ల వీటిని అనుసంధానం చేయడం
ద్వారా ఎక్కువ ఫలితాలను సాధించవచ్చనీ, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని
పంటపొలాలకు మళ్ళించవచ్చనీ అనుసంధాన ప్రక్రియ మద్దతుదార్లు అంటున్నారు. అయితే ఇదేమీ
కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన అయితే కాదు. ఎన్నో దశాబ్దాల క్రితమే కాటన్ దొర వంటి
వారు దీన్ని ప్రయోగాత్మకంగానే కాదు శాశ్విత ప్రాజెక్టులు నిర్మించి మరీ రుజువు
చేసారు. ఆయన హయాంలోనే గోదావరి, కృష్ణా జలాల అనుసంధానం జరిగింది. అలాగే, గంగా కావేరీ అనుసంధానం చేయాలని ఎన్నో ఏళ్ళ నాడే ప్రముఖ ఇంజినీరు కేఎల్ రావు
తలపోసి ప్రణాళికలు కూడా సిద్ధం చేసారు.
అలాటి ఆలోచనలే నేటి పాలకులు చేస్తున్నారు.
ఇందుకోసం జాతీయ స్థాయిలో నదీనదాల అనుసంధానానికి భారీ ప్రణాళికలు రచిస్తున్నారు.
ఇప్పటి లెక్కల ప్రకారం వీటిని పూర్తి చేయడానికి అక్షరాలా పదకొండు లక్షల కోట్లు
అవసరమవుతాయని అంచనా. అంచనాలే ఈ స్థాయిలో వుంటే ఈ భారీ పధకాలు పూర్తయ్యేనాటికి ఇవి
ఏమేరకు పెరుగుతాయన్నది అంత సులభంగా అంచనా వేయలేని వ్యవహారం. ఇక ఈ ప్రాజెక్టు
గణాంకాలు చూస్తే కళ్ళు చెదురుతాయి. నీరు సమృద్ధిగా పారే 37
హిమనదాలను నీటి లభ్యత తక్కువగా వుండే దేశంలోని ఇతర నదులతో కలిపి వాటిని కూడా స్వయం
సమృద్ధ జలవనరులుగా మార్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో భాగంగా నదులను కలుపుతూ,
యాభయ్ నుంచి వంద అడుగుల వెడల్పున్న 30 కాలువలను పదిహేను వేల కిలోమీటర్ల పొడవున
తవ్వుతారు. చిన్నా పెద్దా అన్నీ కలిపి మూడువేల రిజర్వాయర్లు నిర్మిస్తారు. తద్వారా
ఎనిమిది కోట్ల డెబ్బయి లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తారు. దీనికి తోడు, మొత్తం 34 గిగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తికి మార్గం
వేస్తారు. నిజంగా కళ్ళు చెదిరే ప్రాజక్టే.
సరిగ్గా అమలు చేయకపోతే, అంతకంటే నిజంగా అంతంత ప్రజాధనం నీళ్ళ పాలు చేసే
ప్రాజక్టే.
అయితే
ఇదొక పార్శ్వం. ఇది రంగుల కల. నిజం అయితే, నిజం చేయగలిగితే అంతకంటే
కావాల్సింది లేదు.
మరో వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రకృతి
ప్రేమికులు దీన్ని పీడకలగా అభివర్ణిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పరిణామాలు భయంకరంగా
ఉంటాయని, పూర్తి బాధ్యతా రాహిత్యంతో కూడిన ఆలోచన అనీ
కొట్టిపారేస్తున్నారు.
నదులు ప్రవహించే తీరు ప్రకృతికి అనుగుణ్యంగా
ఉంటుందనీ, దానికి విఘాతం కల్పించడం వల్ల తాత్కాలిక
ప్రయోజనాలు సిద్ధించినప్పటికీ దీర్ఘకాలంలో ప్రకృతి సమతుల్యం దెబ్బతింటుందనీ వారి
వాదన. ఏ నదికి ఆ నది కొన్ని ప్రత్యేకతలు కలిగి
వుంటుంది. పొడవైన కాలువలు తవ్వి వాటిని కలిపే ప్రయత్నంలో నదుల నడుమ వున్న రక్షిత
అటవీ ప్రాంతాలు విధ్వంసానికి గురవుతాయి. ప్రకృతికి కొన్ని సహజ లక్షణాలు వుంటాయి.
వాటిని విధ్వంసం చేయాలని చూస్తే
విలయకారకమవుతాయి అనేది హెచ్చరికతో కూడిన వారి అభిప్రాయం.
జలవనరులను కాపాడుకోవడానికి నదుల అనుసంధానం ఒక్కటే
మార్గం కాదు. వాటర్ షెడ్స్, వర్షాల
వల్ల సమకూరే నీటిని భవిష్యత్ అవసరాలకు భద్రపరచుకోవడం, భూగర్భ
జలవనరులను పెంచుకోవడం, ఇంకుడు గుంతలు, నీటి
లభ్యతకు అనుగుణంగా పంటలు పండించే పద్దతుల్ల్లో మార్పులు చేసుకోవడం ఇలా అనేక
ప్రత్యామ్నాయాలు వుంటాయి. వాటినన్నింటినీ పూర్తిగా వాడుకున్న తరువాతనే నదుల
అనుసంధానం వంటి భారీ ప్రాజెక్టులను గురించి తలపెట్టాలన్నది వారి మనోగతం.
ప్రభుత్వాలు నడిపేవారికి వారి ఆలోచనలు వారికి
వుంటాయి. సమాజ హితంతో పాటు సొంత రాజకీయ ప్రయోజనాలు కూడా చూసుకోకతప్పదు.
పర్యావరణ పరిరక్షకులకి వీటితో నిమిత్తం వుండదు.
వారిది ఒకటే కోణం.
మరి మధ్యే మార్గం ఏమీ ఉండదా!
వుండే వుంటుంది.
కాకపొతే,
వెతుక్కునే ఓపిక వుండాలి. వినే
తీరిక వుండాలి.
(23-09-2015)
11 కామెంట్‌లు:
మీరన్నది వాస్తవమే సార్... పర్యావరణ పరిరక్షణ కూడా ప్రభుత్వం చూడాలి కదా... ఇప్పటికే మానవాళి కాలుష్య కోరల్లో చిక్కుబడింది. నీటి చుక్క కోసం ఎదురు చూపులు చూడటం అనేది కాలుష్యం చేసిన దుష్పరిణామమే. పర్యావరణాన్ని కాపాడుతూ చేపట్టే ఏ ప్రాజక్టు అయినా సమర్ధించవచ్చు... కానీ మానవాళి మనుగడకే ప్రమాదం తెచ్చే ప్రాజక్టుల్ని ఆమోదించడం హర్షణీయం కాదు... మీ విశ్లేషణను తూచగలిగినంత అనుభవజ్నుడిని కాదు గానీ.... బావున్నది సార్...
@రామచంద్ర శర్మ గుండిమెడ - ధన్యవాదాలు శర్మ గారు - భండారు శ్రీనివాసరావు
ఇప్పటికే చాలా నదుల నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తికాక ,పెండింగ్ లో ఉన్నాయి.ముందువాటన్నిటినీ పూర్తి చెయ్యమనండి.తర్వాత నదుల అనుసంధానం గురించి బాగా ఆలో చించి చర్యలు చేపట్టవచ్చును.అంటే 10 సంవత్సరాల తర్వాత.
నదుల అనుసంధానం పేరుతొ ప్రతిపాదించిన షుమారు ముప్పై ప్రాజెక్టులలో కేవలం మూడో నాలుగో ఆచరణకు మొదటి అడుగు తీసుకున్నాయి. కొంతమంది న్యాయమూర్తులు, ఒకరో ఇద్దరో ప్రముఖులు తప్ప ఎవరూ ఈ విషయాన్ని సమర్తించడం లేదు. వీరెవరు నీటి పారుదల & సంబందిత రంగాలకు చెందినా వారు కారు. ఈ ప్రతిపాదన వెనుక రాజకీయ లబ్ది పొందాలనే కక్కుర్తి లేదా ఆకాశానికి మెదలు కట్టాలనే అత్యుత్సాహం తప్ప ఇంకేమీ లేదు.
ఈ ప్రతిపాదన ఫలితాలు భయంకరమయిన ఖర్చు, గిట్టుబాటు లేమి, సాంకేతిక ప్రతికూలత, జల దోపిడీ & బడుగు బలహీన వర్గాల జీవితంతో చెలగాటం.
పైన చెప్పినవన్నీ ఘోరమయిన ప్రమాదాలు. వీటన్నిటి కంటే ముఖ్యంగా ప్రకృతితో చెలగాటం ఆడడం ఇంకా దారుణం.
Excerpts from India's foremost water expert V. Ramaswamy Iyer (passed away recently):
Let us turn from those specifics to theoretical considerations. We cannot simultaneously urge (i) that planning must be on the basis of a basin as a natural hydrological unit, and (ii) that we must cut across the basins and link them. Quite apart from the technical challenges involved, this implies the redrawing of the geography of the country. One's misgivings about that kind of technological hubris or Prometheanism ("the conquest of nature" philosophy) may be dismissed by some as romantic, but the practical difficulties involved cannot be so dismissed.
Barring a few cases where short gravity links may be feasible, inter-basin transfers generally involve the carrying of water across the natural barrier between basins (which is what makes them basins) by lifting, or by tunnelling through, or by a long circuitous routing around the mountains if such a possibility exists in a given case. Exceptionally heavy capital investments and continuing energy costs (in operation) are almost always likely to be involved. In addition, big dams, reservoirs and conveyance systems will need to be built, involving substantial environmental impacts and displacement/rehabilitation problems. All this will need to be looked at very closely in every case. Thorough Environmental Impact Assessments, Cost-Benefit (multi-criteria) analyses, qualitative assessments of non-quantifiable considerations, and based on these, rigorous investment appraisals, will need to be undertaken. Not too many projects are likely to survive such a scrutiny.
నదుల అనుసంధానం మంచిది కాదని జై గొట్టిముక్కల అంటారు. అవును మంచిది కాదు - ముఖ్యంగా ఆంధ్రావారు అమలు జేస్తున్నారు కాబట్టి - ఆ అలోచన సుతరామూ మంచిది కాదనే అంటారు గొట్టిముక్కల. ముఖ్యమంత్రి ఐనప్పటినుండీ - అవకతవక నిర్ణయాలు చేయటమూ , కోర్టులచేత మొట్టికాయలు తింటూ ఉండటమూ కెసీఆర్ గారికి పరిపాటి ఐపోయింది కదా, ఆయన నిర్ణయాలను తప్పుపడుతూ ఈ గొట్టిముక్కల ఏమన్నా వ్రాస్తున్నారా? ఎంతసేపూ అంధ్రావైపునుండి ఏ నిర్ణయం వచ్చినా అది తప్పనీ తప్పున్నరనీ తెలుగునూ ఇంగ్లీషునూ మిళాయించి ఏవేవో మాటలతో తూర్పారబట్టటం ఈ గొట్టిముక్కల నైజం అన్నది తెలుస్తూనే ఉంది. Very well, very well. అయ్యా గొట్టిముక్కలయ్యా జనమూ గమనిస్తూనే ఉన్నారు మీ పక్షపాతాన్ని!
@ Jai Gottimukkala,
నదుల అనుసంధానమే కాదు, నదుల మీద కట్టే డ్యాములకు కూడా అభ్యంతరాలు చాలానే ఉన్నాయి. ఒక్కసారి వీటిని పరిశీలించండి.
-------------------------------------------------
Q. Why is there so much opposition to large dams?
A: Large dams have provoked opposition for numerous social, environmental, economic and safety reasons. The main reason for opposition worldwide are the huge numbers of people evicted from their lands and homes to make way for reservoirs. The livelihoods of many millions of people also suffer because of the downstream effects of dams: the loss of fisheries, contaminated water, decreased amounts of water, and a reduction in the fertility of farmlands and forests due to the loss of natural fertilizers and irrigation in seasonal floods. Dams also spread waterborne diseases such as malaria, leishmaniasis and schistosomiasis. Opponents also believe that the benefits of dams have frequently been deliberately exaggerated and that the services they provide could provided by other more efficient and sustainable means.
Questions and Answers About Large Dams
Link: http://www.internationalrivers.org/questions-and-answers-about-large-dams
-------------------------------------------------
And We have many Large Dams.. one is famous Nagarjuna Sagar Dam.
-----------------------------------------------------------
From Net: Nagarjuna-Sagar, popularly known as Nagarjunsagar is located in the state of Andhra Pradesh and is located beautifully on Krishna River in Nalgonda district. It is among the world largest dam and was constructed amidst 1955 to 1967
-------------------------------------------------------------
నదుల అనుసంధానం పై మీరు లేవనెత్తిన అభ్యంతరాలు ఏమిటంటే నిర్వాసితుల కష్టాలు, పేద బడుగు బలహీన వర్గాల కష్టాలు, ప్రకృతితో చెలగాటం. విశేషమేమిటంటే, ఇవన్నీ డ్యాములు కట్టేప్పుడు కూడా జరుగుతాయి. ఒక నదిపై డ్యాములు కట్టడం అనేది ప్రకృతి విరుద్దమైన కార్యమే. పైన ఇచ్చిన లింకులో డ్యాములు వలన ఎన్ని నష్టాలున్నాయో చెప్పారు. డ్యాముల వల్ల ఉపయోగాలు అని మనం ఏవైతే అనుకుంటున్నామో .. అవన్నీ కూడా వేరే మార్గాల ద్వారా సాధించ వచ్చని చెబుతున్నారు.
నాగార్జున సాగర్ డ్యాం తీసుకోండి, ఇప్పుడు అది ఆల్రెడీ కట్టేసి ఉంది కాబట్టి అది భారత్ గర్వించ దగ్గ డ్యాం అయింది కానీ, కట్టక ముందు అక్కడ మీరు చెప్పినవన్నీ జరిగే ఉంటాయి. అలా జరగకుండా ఏ డ్యామూ ఇంతవరకూ కట్టబడలేదు.
మరి ప్రస్తుతం తెలంగాణా వారంతా నాగార్జున సాగర్ను మాత్రం 'నిజాం' ఘనతగా పొగుడుకుంటూ ఉంటారు కానీ, అది చేస్తున్న సొషియల్, ఎకొలాజికల్ డ్యామేజ్ గురించి మాట్లాడడం లేదెందుకు ?
నామేమనిపిస్తోందంటే, ఈ నదుల అనుసంధానం కూడా అలాంటిదే అనిపిస్తుంది. నష్టాలు, ప్రమాదాలూ లేవని మేము అనం. ఖచ్ఛితంగా ఉంటాయి. నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి, నిర్వాసితులకి, బడుగు బలహీణ వర్గాలకీ చేతనైనంత న్యాయం చేయాలి. ప్రకృతి కన్నెర్ర చేసినప్పుడు తీసుకోవాల్సిన నష్ట నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుని ముందుగా సన్నద్దమై ఉండాలి. ఇవన్నీ చేయగలిగితే నదుల అనుసంధాణం వల్ల దాని లాభాలు దానికి ఉండనే ఉంటాయి.
ఈ నదుల అనుసంధాణం పై నిపుణుల అభిప్రాయాలు అన్నవన్నీ దాదాపుగా లెఫ్టిస్టు విధానాలతో ముడిపడినట్టు అనిపిస్తుంది. నర్మదా బచావో ఆందోళనలు కానీ మరొకటి కానీ మీరు పరిశీలిస్తే అందులో వామపక్షవాద రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తాయి. వామపక్షీయుల రాజకీయాలలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, అభివృద్ది అనే దానితో పనిలేకుండా .. వీలైనన్ని వర్గాలను కూడగట్టుకుని, వారిద్వారా అధికారములోకి రావడం. ఒక్కసారి వారు అధికారములోకి వచ్చిన తరువాత .. ఇప్పుడు ఏవైతే వారు వద్దంటున్నారో అవన్నీ వారే స్వయంగా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఇండియాలో అయితే ఈ డ్యాములు అవీ వద్దని గోల చేస్తారే కానీ అదే డ్యాము చైనాలో కడితే .. కమ్యూనిష్టులు ఎంత అద్బుతంగా డ్యాం కట్టారో చూడమని ఫొటోలు పెడతారు. వేనోళ్ళ పొగుడుతారు. కాబట్టి, బడుగు బలహీణ వర్గాలకు న్యాయం అన్న నినాదముతో వామపక్షీయులు చేసే విశ్లేషనలు చూసి ప్రాజెక్టులు ఆపడం కన్నా .. వారు ఏకరువు పెట్టే నష్టాలను వీలైనంత తగ్గించి ఆ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి ప్రయత్నించడమే దేశానికి మంచిదని నా అభిప్రాయం.
@Srikanth M:
I will respond in English.
As you rightly pointed out, every irrigation project has submergence & resultant problems of displacement, rehabilitation etc. We need a better approach to ensure the benefits are shared equally so that the victims of "disruptive development" can be equal partners.
However this is not the main thrust of my argument against ILR (inter-linking of rivers). My points are summarized below:
1. Financial, legal & technical viability: ILR can't be implemented in toto as originally envisaged due to international water disputes. The Himalayan component is therefore limited to the undisputed Indus-upper Ganges segment only while the bigger surplus waters of Brahmaputra & lower Ganges can't be touched. Peninsular ILR is not viable by itself.
2. Undue enrichment: Peninsular ILR will enrich Andhra & TN (that too mainly the already rich "farmers") at the cost of the much more backward regions such as Vidarbha, Orissa, Chattisgarh etc.
3. Disruption of basins (most important point): Tinkering with basins is an invitation to disaster, much more than the damages you cite or the trans-basin diversions already in place.
Apart from career politicians & ignorant media folks, the only people who supported ILR wholeheartedly are Suresh Prabhu, late BG Verghese (journalist) and a couple of Supreme Court judges who took "judicial activism" too seriously. Not a single expert in the fields of irrigation, hydrology, agriculture or economics takes the idea seriously. The reasons are not far to seek.
Continuing further:
నేను కమ్యూనిస్టును కాను. నా వాదనలకు ideology తో సంబంధం లేదు.
@Jai Gottimukkala,
నేను చెప్పింది మీరు కమ్యూనిష్టులు అని కాదండి. మన చరిత్ర దగ్గరనుండి కొన్ని రకాల పరిశోధనల వరకు ఈ తరహా భావజాలానికి లోనయ్యాయి అని చెప్పాను. చాలా ఆందోళనలు ప్రస్తుతం ఇలానే జరుగుతున్నాయి. తెలంగాణా ఉధ్యమములో కూడా కమ్యూనిష్టూ భావజాలం బాగా చొచ్చుకుని వచ్చింది. ఆ భాష, ఆ పదజాలం, ఆ లాజిక్కులు తెలంగాణా ఉద్యమములోకి వచ్చేశాయి.మీరూ గమనించే ఉంటారు.
@Jai Gottimukkala,
నేను రాసిన కామెంటులో ఎకొలాజికల్ అంశాలను కూడా ప్రస్తావించాను. డ్యాములు కట్టడం వలన కూడా ఎకొలాజికలుగా సమతుల్యం దెబ్బతింటుంది. మరీ ముఖ్యంగా నాగార్జునా సాగర్ వంటి ప్రాజెక్టులు. అయినా సరే రిస్కు తీసుకుని ఆ ప్రాజెక్ట్ కట్టడం వలనే కదా ప్రస్తుతం అది అందరికీ ఉపయోగపడుతుంది.
మీరు మెన్షన్ చేసిన పాయింట్ల వద్ద్దకు వద్దాం
1. బ్రహ్మ పుత్రపై మనకు పూర్తి హక్కులు లేవు. కాబట్టి మనం వాటి జోలికి వెల్లలేం, అది నిజమే. కానీ కేవలం మన దేశములోనే పారుతున్న నదుల విషయములో మనం చొరవ తీసుకోవచ్చు. అది లాభదాయకమా కాదా అన్నది చర్చించాల్సిన విషయం. ఇక్కడే నిపుణుల విశ్లేషణలో రాజకీయ సిద్దాంతాలు చొరబడేది. (Communism and other)
2. నేను చెప్పింది ఈ తరహా కమ్యూనిష్టు భావాల గురించే. ఎవరో ఒక కమ్యూనిష్టు పెద్దాయన ఇలాంటి విశ్లేషనలు చేస్తారు. మనం వాటిని తీసుకుంటాం. ఆంధ్రాలో, తమిళనాడులోని రైతులు బాగా రిచ్ అనే అభిప్రాయానికి మీరు ఎలా వస్తున్నారు ? వారిలో కూడా బోలెడు మంది ఆత్మ హత్యలు చేసుకునే వారున్నారు. రాయల సీమ అంటేనే కరువు సీమ. ఇక ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలు సంపన్నమే అయినా ... వాటికి కూడ ఇబ్బంది కలగకుండా చూడాలి అనుకోవడం తప్పు కాదు. ఇక ఒరిస్సా, విదర్భ విషయం నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది నదుల అనుసంధానం గురించే అయినా .. విషయం ఇక్కడ పట్టి సీమ గురించి, దాని ద్వారా చేశామని చెబుతున్న నదుల అన్సూంధానం గురించే కదా ! (నావరకు నేను వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను). దాని వలన పక్క రాష్ట్రాలు ఏవిధంగా నష్టపోతాయి అన్నది అర్థం కావడం లేదు !
3. నాకు తెలిసి ఇదొక్కటే కాస్త సీరియసుగా ఆలోచించ దగ్గది. కానీ, ముందుగానే చెప్పినట్టు, ప్రతీ ప్రాజెక్టులోనూ మనం ప్రకృతి సమతౌళ్యాన్ని అంతో ఇంతో దెబ్బతీస్తూనే ఉన్నాం. నదుల అనుసంధానం చేయడం ... నదుల ప్రవాహ దిశను మార్చడం ఒకటి కాదు కాదా ? నష్టాలున్నా .. జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పడు మనం బహులార్దక ఆనకట్టలు కట్టినట్టే ఇది కూడా !
ఇదివరకే చెప్పినట్టు, కొంత మంది విశ్లేషణలలో భావాజాలాలు చొరబడడం ఎప్పటినుండో వస్తున్నదే. అలానే నదుల అనుసంధానం విషయములో కూడా !
@Srikanth M:
నేను పట్టిసీమ ఒక్కదాని గురించి కాదు మొత్తం "నదుల అనుసంధానం" అనే గున్న ఎనుగ గురించి మాట్లాడుతున్నాను.
ముందు ప్రాజెక్టు గిట్టుబాటు చూద్దాం. ఒక్కరంటే ఒక్క నిపుణులు కూడా ప్రాజెక్టు గిట్టుబాటు అవుతుందని చూపలేదు. మరోవైపు చూస్తె ప్రపంచ బాంక్ అనుబంధ ఆర్ధిక నిపుణులు కూడా ప్రాజెక్ట్ దండుగామారిదని తేల్చారు. కనీసం cost-benefit analysis కూడా లేకుండా లక్షాలాది కోట్ల ప్రజాధనం తగిలేయడానికి మనం చైనాలో లేము.
ఇక రెండో విషయానికి వస్తే గోదావరి పారివాహిక ప్రాంతంలో ఏడు రాష్ట్రాలు ఉన్నాయి. విస్తీర్ణం & వర్షం నీటి పోగు శాతాలు ఇలా ఉన్నాయి:
మహారాష్ట్ర: 48.7%; 43.7%
చత్తీస్గడ్: 12.7%; 16.8%
మధ్య ప్రదేశ్: 8.2%; 9.8%
ఒరిస్సా: 5.7%; 7.5%
ఆంద్ర: 4.9%; 4.8%
తెలంగాణా: 18.5%; 16.2%
కర్నాటక: 1.4%; 1.1%
మహారాష్ట్ర గోదావరి ప్రాంతం పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా & విదర్భ ప్రాంతాలకు విస్తరించింది.
ప్రస్తుతం గోదావరిలో అదనపు జలాల లభ్యత ఉండడానికి ముఖ్య కారణం పైని ప్రాంతాల తక్కువ వినియోగం. తమ అవసరాలకు తగినంత వినియోగం లేకపోవడం వలన వీటిలో ఎన్నో ప్రాంతాలు సంక్షోభంలో ఉన్నాయి. అతి బీద జిల్లాలయిన పర్భానీ, ఉస్మానాబాద్, చందా, బుల్దానా, బస్తర్, కళాహండీ, ఆదిలాబాద్, బీదర్ వగైరాలు ఈ కోవలోకి వస్తాయి.
ఎటువంటి లెక్క ప్రకారం తీసుకున్నా ఆంధ్రకు నీరు సంవృద్దిగా దొరికిందనే చెప్పాలి. కనీస అవసరానికి గొంతెమ్మ కోరికలకు తేడా ఉండాలనడం కమ్యూనిజం కాదు. మన దేశంలో equitable distribution అనే సిద్దాంతం ప్రకారం నీటి వాటాలు చేయాలి. Enriching the comparatively well-off regions at the cost of the deprived regions is not what India is about.
The very purpose of ILR is touted to help backward regions benefit. It ends up doing the opposite!
కొందరు "మేధావులు" (కమ్యూనిస్టులతో సహా) జీవజాలాలు సముద్రంలో "వృధాగా" పోతున్నాయని గగ్గోలు పెడుతుంటారు. ఇప్పుడు ఉన్న నీటిని బేసిన్ బయటికి తీసుకెళ్తే పైని రాష్ట్రాలు రేప్పొద్దున ప్రాజెక్టులు కట్టుకున్నాక ఏమి జరుగుతుందో వారికి తెలీదా?
మూడో విషయానికి వస్తే ప్రస్తుత అనుసంధాన ప్రణాళికకు మామూలు డాములకు పోలికే లేదు. కొందరు విశేషజ్నుల వ్యాఖ్యలు చూస్తె మీకే తెలుస్తుంది. వీరందరూ కమ్యూనిస్టు లేదా ఇతర రాజకీయాలకు చెందినా వారు కాదని మనవి.
"It amounts to nothing less than the redrawing of the geography of the country"
"From a holistic perspective, one does not see any ‘surplus’ water, because every drop performs some ecological service all the time"
"Violence is not intrinsic to the use of river waters for human needs. It is a particular characteristic of gigantic river valley projects that work against, and not with, the logic of the river"
"Are rivers bundles of pipelines to be cut, turned around, welded and re-joined? This is technological hubris arrogance – of the worst description, prometheanism of the crassest kind. The country needs to be saved from this madness"
కామెంట్‌ను పోస్ట్ చేయండి