25, జనవరి 2013, శుక్రవారం

బాపు గారికి పద్మశ్రీ అట! అక్కటా!


బాపు గారికి పద్మశ్రీ అట! అక్కటా!




బాపూ గారికి 'పద్మశ్రీ' పురస్కారమట. నవ్వాలో ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇన్నేళ్ళకు మన ప్రభుత్వాలకు ఆయన గుర్తువచ్చినందుకు సంతోషించాలా. బాపు అనే రెండక్షరాలతో ప్రసిద్దుడయిన మహామనీషికి మరో మూడక్షరాలు తగిలించి అదో గొప్పగా అనుకుంటున్నందుకు బాధపడాలా! అంత గొప్పవాడికి ఇవ్వడానికి ఇంత చిన్న బిరుదే దొరికిందా! బాపు గారికి దీనివల్ల వొనగూడే అదనపు గౌరవం ఏమీ లేదు. నిజానికి ఆ పురస్కారానికే గౌరవం బాపు గారి పేరుకు ముందో వెనకో పట్టుకుని వేళ్ళాడుతున్నందుకు. అందుకే, ఆ గౌరవానికి నా అబినందనలు (25-01-2013)

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఈ పద్మ పురస్కారాల కమిటీలో మన తెలుగువాళ్ళు ఉంటారు. ఆ తెలుగువాళ్ళకి తెలుగూ రాదు, ఇంగ్లీషూ రాదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పట్నుండీ హైద్రాబాదులో పెరిగారు మరి. ఎవడో రెకమెండేషన్ చేస్తే ఇలా కమిటీలో వచ్చి కూర్చుంటారు. మీ ఆంధ్రాలో ఎవరైనా ఉన్నారా అని ఛైర్మనో ఎవరో అడిగితే "లేరు" అనిచెప్పేసి అక్కడిచ్చిన ఫ్రీ మీల్సు మెక్కేసి రావడమే వాళ్లకి తెలుస్తుంది. అంతవరకు ఎందుకు లెండి. మన ఛీఫ్ మినిస్టర్ గారి తెలుగు మాట్లాడ్డం చూస్తే తెలియట్లేదా మన లాంగ్వేజీ, మనమూ ఎక్కడున్నామో?

ఇది తెలుగు వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. ఈ దరిద్రం తమిళుల్లో కానీ, కన్నడిగుల్లో కానీ, వేరెవ్వరిలో కానీ కనిపించదు.

ఈ తరం తెలుగు వాడినెవడినైనా (వయస్సు ఇరవై కన్నా తక్కువ ఉండాలి, ఈ తరం అంటే) పోతన రాసిన (అతి శులభమైన ద్రాక్షా పాకం సుమండీ) కింద ఇచ్చిన వచనం (పద్యం కూడా కాదు) అర్ధం చెప్పమనండి చూద్దాం?

"ప్రదాత ఇగినూటి అర్ధ పరంపరా వామనంబై...

అజ్ఞాత చెప్పారు...

It is just insulting him

అజ్ఞాత చెప్పారు...

పోన్లెండి, ఆ అవార్డుకి విలువొచ్చింది :)

Jai Gottimukkala చెప్పారు...

"మరో మూడక్షరాలు తగిలించి"

Padmasri & similar awards are honorary in nature. They can't be prefixed or suffixed to one's name. BTW this is also true of honorary doctorates.

In other words, calling people "Dr. Mohan Babu", "Padmasri Bapu" is illegal.

If he is unhappy, he can always reject the award.

అజ్ఞాత చెప్పారు...

గత 20ఏళ్ళలో పద్మశ్రీలకు అంత విలువ రావడం ఇదే మొదటిసారి చూస్తున్నాము.