‘మీ సొమ్ము - మీ
చేతిలో’ అనే నినాదంతో యువనేత రాహుల్ సలహాపై ‘నగదు బదిలీ’ పధకాన్ని ఎన్నికల
బ్రహ్మాస్త్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఆ యువనేతను ప్రధానమంత్రిగా చూడడం ఒక్కటే తమ చిరకాల స్వప్నమని బాహాటంగా ప్రకటించుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు,
‘మీ బరువు – మీరే మోయాలి’ అనే ట్యాగ్ లైన్ తో ‘బరువు
బదిలీ’ పధకానికి రూపకల్పన చేసి తాము కంటున్న ‘కల’ను తామే ‘కల్ల’ చేసుకుంటున్నారు.
పెరిగిపోతున్న విద్యుత్
ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థ భారాన్ని ఇక యెంత మాత్రం మోసే పరిస్తితి లేదనీ, కాబట్టి ఆ బరువును వినియోగదారులకు ‘బదిలీ’
చేయక తప్పదనీ చెబుతూ ప్రభుత్వం చల్లగా
తప్పుకుంటోంది.
మరి ఈ ‘బరువు బదిలీ’
పధకాన్ని అన్ని రంగాలకు విస్తరింపచేస్తే జనం పని గోవిందా! (08-01-2013)NOTE: COURTESY IMAGE OWNER
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి