2, జనవరి 2013, బుధవారం

చెప్పుకోండి చూద్దాం ?



చెప్పుకోండి చూద్దాం ?



సుబ్బారావు ఆయన  భార్య కలసి నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లారు. ప్రవేశ రుసుం తల ఒక్కింటికీ పది రూపాయలు.
సుబ్బారావు దంపతులకు ఏడుగురు సంతానం.
వారిలో ఇద్దరు మగ అయిదుగురు ఆడ.
అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి.
మగపిల్లలు ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు.
ఆడపిల్లలకు ఒక్కొక్కరికీ మళ్ళీ ఆరుగురు సంతానం.
ఇప్పుడు చెప్పండి.
ప్రవేశ రుసుం కింద సుబ్బారావు గారు యెంత చెల్లించి వుంటారు?

Image Courtesy : CartoonStock.com 

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

20rs

శ్రీరామ్ చెప్పారు...

సుబ్బారావు ఆయన భార్య కలసి నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లారు. ప్రవేశ రుసుం తల ఒక్కింటికీ పది రూపాయలు.
================================

ప్రవేశ రుసుం కింద సుబ్బారావు గారు Rs.20/-చెల్లించి వుంటారు.

అజ్ఞాత చెప్పారు...

తలకు 10రూ రేటు. తల వుందోలేదో, వున్నా తీసుకెళ్ళారో లేదో అన్న విషయం క్లియర్‌గా లేదు, అది తెలిస్తే కాని చెప్పలేము.

voleti చెప్పారు...

ఇంత పెద్ద సంతానం కల్గి, వాళ్ళందరికీ పెళ్ళీళ్ళూ చేసిన సుబ్బారావు గారు పది రూపాయలు దండగ అనుకుని, లేదా కట్టే స్థోమత కూడా లేక , పైగా వీళ్ళింట్లోనే పెద్ద జూ వుండగా వేరే జూ ఎందుకని వెనక్కి తిరిగి వచ్చేసారు..