చూడకపోవడం నేరం!
ఆదివారం. భోంచేసి ఓ కునుకు తీసేలోగా దివాకర్
నుంచి ఫోన్.
వీజేఎం దివాకర్ అనే నా జర్నలిస్ట్ స్నేహితుడు
మంచి రాయసకాడు. అంతకు మించి మంచి అభిరుచి కలిగిన కళా హృదయుడు.
‘అద్భుతం!
‘సుబ్బరాయశర్మ ఇంకా కొంతమంది మిత్రులతో కల్సి సినిమా
చూసి బయటకు వస్తూనే, మనసు ఉగ్గబట్టుకోలేక ఫోన్ చేస్తున్నాను. రాత్రే సతీష్
కుమార్తె పెళ్ళిలో ఈ చిత్రం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసి చెబుతున్నాను
శ్రీనివాసరావు గారు ఇది సెల్యూలాయిడ్ గీతం.
మిధునం పుస్తకం అందరం చదివాం. అంతటి హృద్యమయిన ఇతివృత్తం తెరకెక్కించడం సాధ్యమయ్యే
పనేనా అనికూడా అనుకున్నాం. అయితే పుస్తకానికి కాని, దాని అభిమానులకి కాని భరణి అన్యాయం చెయ్యలేదు. నేను చెబుతున్నాను
రాసుకోండి. ఈ చిత్రం చూడకపోవడం నేరం’ అంటున్నాడు దివాకర్.
మిధునం చిత్రానికి టాగ్ లైన్ ‘మన అమ్మానాన్నల
ప్రేమ కధ’ అని పెట్టారు.
‘మిధునం’ సినిమా చూడండి. బాగుంటే పదిమందికి
చెప్పండి. నచ్చకపోతే వెయ్యి మందితో చెప్పండ’ని తనికెళ్ళ భరణి గారు ఓ టీవీ
ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు.
నిజానికి ఈ చిత్రానికి ఆ మాటే టాగ్ లైన్ గా
పెడితే సరిపోయేదేమో భరణి గారు. (23-12-2012)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి