19, డిసెంబర్ 2012, బుధవారం

ప్రాతఃస్మరణీయుడు పర్వతాలరావు గారు


ప్రాతఃస్మరణీయుడు పర్వతాలరావు గారు

చనిపోయి ఆరేళ్ళు దాటిపోతున్నా  ‘మీ అన్నగారెలా వున్నారు? కులాసాయే కదా!’ అంటూ ఆయన మిత్రులు కొందరు ఫేస్ బుక్ లో అడుగుతున్నారంటే నిజంగా ఆయన చిరంజీవే. మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు దాదాపు యాభయ్  అరవై ఏళ్ళ క్రితం రచించిన కొన్ని గేయాలు ఇంకా యెంత తాజాగా, ఇప్పటికీ వర్తించేలా యెలా వున్నాయో తెలపడం కోసం ఈ ప్రయత్నం – భండారు శ్రీనివాసరావుకీర్తిశేషులు భండారు పర్వతాలరావు 


చేయకు

వృధాలోచనలతో నింపి
యెదలో వ్యధ పండించకు
కాంచ చంద్రు నమవస నిశి
కళ్ళూరకే చికిలించకు

పుట్టని రేపును చూడగ
పట్టుదలతో శ్రమియించకు
తెగిన వీణ తీగెలపై
బ్రతుకు పాట మ్రోయించకు

కీర్తి కొరకు కక్కుర్తితో
కలమునమ్మ తలపెట్టకు
కండలపై బ్రతుకు పేద
వాండ్ల తలను చెయిబెట్టకు
         
 (తెలుగు స్వతంత్ర – జనవరి 4,1958)                

1 వ్యాఖ్య:

Pantula gopala krishna rao చెప్పారు...

బాగుంది.మరిన్ని ఇలాంటివి అందించండి.