ఈ పాడు ప్రపంచంలో పదిమంది
మొదటి వాడు కడు పేదవాడు – పనిచేసి పొట్టపోసుకోవడం తప్ప ఏమీ తెలియనివాడు.
ఇక రెండోవాడున్నాడే ఇంట్లో వొంట్లో బాగా
వున్నవాడు. పేదవాడి పొట్టకొట్టి తన పొట్ట నింపు కునేవాడు.
పోతే, మూడోవాడు. పోలీసు. పై ఇద్దర్నీ కాపాడుతున్నట్టు
భ్రమ కలిగిస్తూ ఆ క్రమంలో తనను తాను
కాపాడుకునేవాడు.
నాలుగోవాడు పన్నులు కట్టేవాడు. పై ముగ్గుర్నీ పోషించేందుకు క్రమం తప్పకుండా సుంకాలు చెల్లిస్తూవుంటాడు.
అయిదోవాడు పరమ బద్ధకస్తుడు. ఏమీ చెయ్యడు. తనకోసమే కాదు పక్కవాళ్ల కోసంకూడా. అందుకని వీడి పోషణ భారం మిగతా వాళ్లు చూస్తుంటారు. కాదు, పరాన్నభుక్కు మాదిరిగా ఇతగాడే ఇతరులపై ఆధారపడి జీవిస్తుంటాడు.
ఆరోవాడికి తాగడం తప్ప మరో పనిలేదు. పక్కవాళ్ల కోసం తాగుతున్నానంటాడు. అందులో కొంత నిజం లేక పోలేదు. మద్యం సీసాల పై వసూలుచేసే పన్నుల తోనే ప్రభుత్వాలు సంక్షేమ పధకాలు అమలుచేస్తుంటాయి కదా!
ఇక ఏడోవాడు బ్యాంకరు. అందరికీ అప్పులు ఇస్తూ,వడ్డీలపై వడ్డీలు వసూలుచేస్తూ చట్టప్రకారం అందర్నీ నిలువు దోపిడీ చేస్తుంటాడు.

ఎనిమిదోవాడు లాయరు. తన వాదనా పటిమతో పై
ఏడుగురినీ బోల్తాకొట్టిస్తూ తన పబ్బం గడుపుకుంటూ వుంటాడు.
తొమ్మిదో వాడు డాక్టరు. ఇతడిది త్రిమూర్తులలో శివుడి పాత్ర. అందర్నీ చంపి తాను బతుకుతుంటాడు.
పోతే ఆఖరువాడు, పదోవాడు ఎవడంటే – ఇంకెవడు? రాజకీయ నాయకుడు.
పోతే ఆఖరువాడు, పదోవాడు ఎవడంటే – ఇంకెవడు? రాజకీయ నాయకుడు.
అందరికన్నా నాలుగాకులు ఎక్కువ చదివినవాడు. పై
తొమ్మిదిమందిని ఏడు నిలువుల లోతున పాతేసి,
వారి పేరుతో కలకాలం కాకిలా హాయిగా జీవిస్తుంటాడు.
3 కామెంట్‌లు:
/ఇతడిది త్రిమూర్తులలో శివుడి పాత్ర. అందర్నీ చంపి తాను బతుకుతుంటాడు. /
శివ! శివా...
శివుడు చంపడండి, ఈ పాడు ప్రపంచం నుంచి విముక్తి కలిగిస్తాడంటారు, యమధర్మరాజు ద్వారా.
@SNKR - అనుకున్నాను. ఇలాటి అపార్ధం కలుగుతుందని. త్రిమూర్తులలో బ్రహ్మ సృష్టికర్త - విష్ణువు రక్షకుడు - శివుడు లయకారుడు - త్రిమూర్తులు సృష్టి స్తితి లయకారులు అన్న భావనలో అది రాసింది. అంతే కాని చంపి తాను బతకడమని కాదు. -భండారు శ్రీనివాసరావు
అంటే ఈ పదోవాడు దశకంఠుడా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి