'మీ గొంతు పీలగా అనిపించింది’
‘మొదలు
పెట్టినప్పుడు దూకుడుగా మొదలెడతారు. పోను పోను తేలిపోతున్నట్టుగా వుంటుంది. ఇక
వాక్యం ముగించేటప్పుడు ఆఖరు పదాలు మింగేస్తునారు’
నాలుగు
దశాబ్దాలకు పూర్వం నేను రేడియో ఉద్యోగంలో చేరి వార్తావాహిని కార్యక్రమాన్ని
వారానికి ఒకసారో,
రెండుసార్లో సమర్పిస్తున్నప్పుడు దాన్ని రేడియోలో విని నాతో మా ఆవిడ అన్న మాటలు
ఇవి.
నా
ప్రోగ్రాం వినే అవకాశం నాకు లేకపోవడం వల్ల
మా ఆవిడ మాటలే వేదం అనుకుని కొంత బాణీ మార్చుకునే ప్రయత్నం చేశాను. ఈలోగా వారం
వారం ‘జీవన స్రవంతి’
మొదలయింది. ‘తినగ తినగ వేము తియ్యనగును’ అన్నట్టు నా గొంతుకు శ్రోతలు అలవాటు పడిపోవడంతో నా భార్య మాటలు చెవిన
పెట్టడం మానేసాను.
ఇప్పుడు
టీవీల్లో కొందరి స్వరాలు వింటుంటే ఈ పూర్వపు రోజులు గుర్తుకొస్తున్నాయి. ఒక్కోసారి
అనిపిస్తుంది,
వీళ్ళకు మంచీచెడూ చెప్పే భార్యలు లేరా, లేక చెవికి ఎక్కించుకుపోవడం అనే నా
చెడ్డ అలవాటు వీరికీ ఉందా అని. (2020)
2 కామెంట్లు:
చానెళ్లలో లైవ్ రిపోర్టర్లు ఆంకర్లు లొడ లొడమని కక్కుతున్నట్లు వాగుతున్నారు. వాళ్ళు చెప్పే మాటలు కార్టూన్ చానెల్ లో బొమ్మలు వాగినట్లు కలగా పులగం గా ఉంటాయి.
కొన్నిసార్లు మీ బ్లాగు పోస్టులు కూడా అంతే సార్!
మొదట దూకుడుగా రాసేస్తారు. పోను పోను తెలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. చివరికి ఏం చెప్పదలచుకున్నారో తెలియకుండా ముగించేస్తారు☺️☺️☺️
కామెంట్‌ను పోస్ట్ చేయండి