2, నవంబర్ 2018, శుక్రవారం

మార్చుకునేదే అభిప్రాయం – భండారు శ్రీనివాసరావు


మార్చుకునేవాటిని అభిప్రాయాలు అంటారా గుండెల్లో దాచుకున్న అభిమానాలు అంటారా!
“నాకు బాబు అంటే పడదు, కానీ మోడీ రాష్ట్రానికి చేసిన అన్యాయం అస్సలు బాగాలేదు, కాబట్టి నేను బాబు అభిమానిగా మారాను”
“నాకు జగన్ అంటే సరిపడదు, కానీ బాబు నాటకాలు చూసి విసుగెత్తి జగన్ సరయినవాడని ఇప్పుడు అనుకుంటున్నాను”
“నాకు పవన్ మీద మంచి అభిప్రాయం లేదు, అతనో మంచి సినిమా నటుడు అంతే. రాజకీయాలకు పనికిరాడు అనేది ఇప్పటివరకు నా ఉద్దేశ్యం. కానీ మారుతున్న పరిస్తితులను గమనించిన తర్వాత నా అభిప్రాయాన్ని మార్చుకుంటున్నాను”
జనమే ఇలా మారిపోతుంటే వాళ్ళని స్కాచి వడబోసిన రాజకీయులు సామాన్యులు కాదు కదా! వాళ్ళూ అవసరాలకు అనుగుణంగా అభిప్రాయాలూ, సిద్ధాంతాలు సూత్రాలు అన్నీ మార్చుకుంటూనే వుంటారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా!   

2 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

మారనిది అంటూ ఏముంది ఈ ప్రపంచంలో? కొన్ని తొందరగా మారిపోతాయి. కొన్ని ఆలస్యంగా.

సూర్య చెప్పారు...

అన్నట్లు "మార్పు చూసినకళ్ళు పార్ట్ 2" రాయాల్సిన సమయం వచ్చిందేమో.