14, మే 2014, బుధవారం

అలనాటి ఆంధ్రపత్రిక మళ్ళీ కంటపడింది.


యెంత సంతోషం అనిపించిందో.


పక్కన స్టూడియో వన్ టీవీ ఛానల్లో 'నేనంటే నేను' పాత బ్లాక్ అండ్ వైట్ సినిమావస్తోంది. హీరో కృష్ణ, హీరోగా మారిన నాటి విలన్ కృష్ణంరాజు, చిదిమితే పాలుగారే వయస్సులో చంద్రమోహన్, నవ్వించే విలన్ నాగభూషణం, అందాల తార కాంచన, ఇక వస్తాదు నెల్లూరు కాంతారావు సరేసరి. కధలో భాగంగా చంద్ర మోహన్ చేతిలో ఆంధ్ర పత్రిక కనిపిస్తుంది. కాసేపే అయినా, అది చూడగానే  అలనాటి ఆంధ్ర పత్రిక వైభోగం కనులముందు కదలాడింది. ఆ పత్రిక్కి సంబంధించిన అనేక జ్ఞాపకాలు మదిలో సుడి తిరిగాయి. గొప్ప చరిత్ర కలిగిన ఆ గొప్ప పత్రిక చివరకు చరిత్రలో కలిసిపోయింది.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవునండి, అలనాటి "ఆంధ్రపత్రిక" ఒక nostalgic జ్ఞాపకం. ఈ నెల ఒకటవ తారీఖున కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారి జయంతి. శ్రీమతి మణి కోపెల్ల అనే వారు ఈ విషయమై తన బ్లాగ్ manimayuram.blogspot.in లో మే 1, 2014 న ఒక టపా వ్రాశారు, మీరు చదివే ఉంటారు. ఏ మీడియా వారు ఆ రోజున పంతులు గారిని గుర్తు చేసుకున్నట్లు కనిపించలేదు. అవున్లెండి, ఆయన ప్రముఖ పాత్రికేయుడు కాకుండా సినిమా "సెలెబ్రిటీ" అయితే, ఆయన పుట్టినరోజు ఆయన ఇంట్లోవాళ్ళ పుట్టినరోజులు, పెళ్ళిరోజులు వగైరా గుర్తు పెట్టుకునేదేమో మన మీడియా.