మోడీ గెలుస్తాడా ? రాహుల్ గెలుస్తాడా ?కేసీఆరా !
చంద్రబాబా! జగనా !
ఇవన్నీ నిన్నటి మాటలు. ఇవాళ ఫలితాలు తేలిపోయాయి.
ఇక ఆ చర్చ అనవసరం.
ఓటరుగా మన బాధ్యత మనం పూర్తిచేశాం. ప్రభుత్వాలు
ఏర్పడతాయి. పాలకులు కొలువు తీరుతారు. వాళ్లు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా
సరే. లేకుంటే, వాళ్ల దగ్గర లేని ఆయుధం, అయిదేళ్ళ తరువాత మన దగ్గర మాత్రమే వుండే
'ఓటు' అనే ఆయుధం మనదగ్గరే వుంటుంది. బెంగ పడాల్సిన పని లేదు.
ఈసారి మనం తెలిసో తెలియకో తెలివిగా ఒక మంచి పని
చేశాం. అటు కేంద్రంలో, ఇటు తెలంగాణలో, మరో పక్క సీమాంధ్రలొ ఒకే పార్టీకి ప్రభుత్వం
సొంతంగా ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఇచ్చాం. వెనుకటి మాదిరిగా సంకీర్ణాలకి
చోటివ్వలేదు. ఎన్నికల ప్రణాళికలో అన్ని పార్టీలు అలవికాని వాగ్దానాలు చేసుకుంటూ
పోయాయి. సంకీర్ణ ధర్మం ప్రకారం అమలు చేయలేకపోయాం అని ఇన్నాళ్ళు కుంటి సాకులు
చెబుతూ వచ్చాయి.
అది, ఇంకానా ఇకపై కుదరదు.
చెప్పిన మాట నిలబెట్టుకొకపోతే ఆయా పాలక పక్షాలను కాలరు
పట్టి నిలదీసే మహత్తర అవకాశాన్ని మనమే కల్పించుకున్నాం.
ఇక భయం లేదు. మనకు మనమే ఒక రక్షరేఖ
కల్పించున్నాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి