విన్నంతలో
కన్నంతలో అమెరికా
అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్
(కేంద్ర ప్రభుత్వం), స్తానిక
(రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం
సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం ‘స్కూలు డిస్ట్రిక్టుల’ను ఏర్పాటు చేసారు. తమ
పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను
బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ‘ఇన్నోవేషన్ ఫండ్’ నుంచి గ్రాంట్ రూపంలో
ఇస్తుంది.ఈ ఏడాది (2010) వంద
మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు – బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న
సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ
వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల
ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు
బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక
విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం – అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ
స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.
ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి
గానే వసతులు, చక్కటి
భవనాలు, క్రీడా
మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ
కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ
కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్
రూము, ఇండోర్
జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా
అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల
హోటళ్ళకు దీటుగా వున్నాయి.
(ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో ఒక దృశ్యం)
2 కామెంట్‌లు:
ప్రభుత్వాలిచ్చే గ్రాంట్స్ కొంత వున్నా, స్థానికంగా ప్రజలు కట్టే property taxes ద్వారావచ్చే ఆదాయమే ప్రధానమండీ ఈపాఠశాలకి.
@ పండు గారికి = అందుకే ఈ శీర్షికకి 'కన్నంతలో విన్నంతలో అమెరికా' అని పేరు పెట్టాను. కొన్ని చూసినవి కొన్ని విన్నవి.సమాచారం సమగ్రంగా లేకపోవడానికి అవకాశం వుంటుంది.ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
కామెంట్‌ను పోస్ట్ చేయండి