నిజంగా హర్షించదగ్గ
తీర్పు. నేరచరితులకు పెద్ద పీట వేస్తున్న రాజకీయ పార్టీలకు మింగుడుపడని విషయం. ట్రయల్
కోర్టులో శిక్షపడ్డ వెంటనే పదవి కోల్పోవడం అంటే సంకీర్ణయుగంలో మామూలు సంగతి కాదు.
బొటాబొటి మెజారిటీలతో బండి లాగిస్తున్న
పాలక పక్షాలు ‘తుమ్మితే ఊడిపోయే’ నేరగాళ్లకు ఇకముందు టిక్కెట్లు ఇవ్వడానికి
సంకోచిస్తాయి. ఆవిధంగా చాలావరకు రాజకీయాలు
క్షాలనం అయ్యే అవకాశం వుంది. కానీ అదే సమయంలో మరో ప్రమాదం పొంచి వుంది. రాజకీయ ప్రత్యర్ధుల బెడద
తొలగించుకోవడానికి పాలక పక్షాలు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా వుంది.
అమల్లో తేడాలు రాకుండా చూసుకోగలిగితే ఇది ఆహ్వానించదగ్గ నిర్ణయం. కానీ ప్రస్తుత రాజకీయాల
తీరుతెన్నులు గమనిస్తుంటే సుప్రీం తీర్పు
పర్యవసానాలు గురించి కొంత ఆందోళన కలగడం సహజం. (10-07-2013)
అవసరమైతే ప్రజాసంక్షేమం కోసం నేరగాళ్ళను రక్షించటం కోసం పవిత్రభారత రాజ్యాంగాన్ని సవరించటం జరుగుతుంది కాని ఉఇలాంటి తీర్పులను రాజకీయపార్టీలు అమలుకానిస్తాయా?
4 కామెంట్‌లు:
రెవ్యూ పెటిషన్ వేస్తారుట, అప్పుడే అయిందంటారా? :)
అవసరమైతే ప్రజాసంక్షేమం కోసం నేరగాళ్ళను రక్షించటం కోసం పవిత్రభారత రాజ్యాంగాన్ని సవరించటం జరుగుతుంది కాని ఉఇలాంటి తీర్పులను రాజకీయపార్టీలు అమలుకానిస్తాయా?
Sir, this judgment is only about section 8 (4) held ultra vires.
I suggest a deeper reading & analysis before celebrating.
Guess, Gottimukkala is right.
కామెంట్‌ను పోస్ట్ చేయండి