వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా
(ఈరోజు పత్రికల్లో ఢిల్లీ కొత్త సీఎం వుండబోయే కొత్త జంట ఇళ్ళ ఫోటోలు చూసిన తరువాత 2012 మార్చి నెలలో రాసింది గుర్తుకు వచ్చింది. ఇప్పటికీ దీదీ అక్కడే వున్తున్నారో లేదో తెలవదు)
(ఈరోజు పత్రికల్లో ఢిల్లీ కొత్త సీఎం వుండబోయే కొత్త జంట ఇళ్ళ ఫోటోలు చూసిన తరువాత 2012 మార్చి నెలలో రాసింది గుర్తుకు వచ్చింది. ఇప్పటికీ దీదీ అక్కడే వున్తున్నారో లేదో తెలవదు)
కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా
నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి. దాని పేరు హరీష్ చంద్ర స్ట్రీట్.
కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో
కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే.
ఓపెన్ డ్రైనేజీ. మురుగుకాలువ. వీధిలోనే స్నానాలు. ఇంటి ఆకారం కూడా లేని టార్పాలిన్ తడికెల నడుమ కాపురాలు. వీధి కుక్కల స్వైర
విహారాలు. చూడగానే వికారం కలిగించే చిరుతిళ్ళ అంగళ్ళు.
కలకత్తాలోనే కాదు దేశంలో ఏ బస్తీలో చూసినా ఇలాటి
వీధులు అనేకానేకం కానవస్తాయి. అటువంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ అని సన్నాయి
నొక్కులెందుకు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
అదే. అది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం.
పై ఫోటోలను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో
ఒకదానిలో బెంగుళూరు పెంకులు కప్పిన ఒక సాదా సీదా ఇల్లు కనిపిస్తుంది.
ఆ ఇంట్లో వుండే వ్యక్తి మాత్రం అంత సాదా సీదా
సాధారణ మనిషి కాదు. కొన్ని దశాబ్దాలపాటు అవిచ్చిన్నంగా పశ్చిమ బెంగాల్
రాష్ట్రాన్ని పాలించిన మార్క్సిష్టులకు, లెఫ్ట్ పార్టీలకు అధికార పీఠాన్ని దూరం చేసిన అత్యంత సాదా సీదా రాజకీయ నాయకురాలు,
తృణమూల్ అధినేత్రి ‘దీదీ’ – మమతా బెనర్జీ
- ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తున్నది ఆ ఇంట్లోనే అంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. కానీ
కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు కదా.
సాధారణంగా ఎవరయినా రాజకీయ నాయకులు నివాసం వుండే
ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు బాగా వుంటాయనీ, మామూలు పౌరులను వేధించే నీటి కొరత,
కరెంటు కోతలు వుండవనీ, వీధులు పరిశుభ్రంగా వుంటాయనీ జనంలో ఓ నమ్మకం. నమ్మకమే కాదు
మనవైపు చోటా మోటా రాజకీయ నాయకులు, అధికారులు నివసించే ప్రాంతాల్లో ఇలాటి ఇబ్బందులు
లేకపోవడం నిజం కూడా.
ఈ నేపధ్యంలో మమతా దీదీ నివసిస్తున్న ఇల్లూ, ఆ
ఇల్లు వున్న వీధినీ చూస్తుంటే ఇలాటి రాజకీయ నాయకులు కూడా వుంటారా అనిపించడం అంతే సహజం. కానీ ఒక ముఖ్యమంత్రి వుండే వీధే అలా వుంటే ఇక మిగిలిన వాటి సంగతేమిటి? దీనికి జవాబు కూడా అంతగా అర్ధం కాని
‘హింగ్లీ’ (హిందీ-బెంగాలీ) భాషలో ఆ వీధిలో
వుండే వ్యక్తి నుంచే లభించింది. కోల్ కటా లోని అన్ని వీధులు బాగుపడ్డ తరువాతే తన
వీధిని బాగు చేసే పనికి పూనుకోవాలని దీదీ హుకుం జారీ చేసారట. ఇందులోని నిజానిజాలు
ఆ వీధికి ఎదురుగా వుండే మరో వీధిలో కొలువున్న మరో ‘దేవత’ కలకత్తా కాళీనే చెప్పాలి.
దీదీ సాదా సీదా వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు ఆ
వీధి వ్యవహారం అంత ఆశ్చర్యం
కలిగించకపోవచ్చు. కాకపొతే,
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల ‘రక్షణ’ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. (19-03-2012)
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల ‘రక్షణ’ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. (19-03-2012)
19 కామెంట్‌లు:
నమ్మశక్యం కాని నిజాన్ని మీదైన జర్నలిస్ట్ స్టైల్ లో చాలా సంక్షిప్తం గా వివరించారండీ రావు గారు.
జిలేబి.
చాలా బావుంది..!
@Zilebi and వామనగీత - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
ఆకాశవాణి పూర్వ డైరెక్టర్ శ్రీ.వి.వి.శాస్త్రి గారు మొదటి ఫొటోలో కనిపిస్తున్నారు.ఆయా,మీరూ కలసి కొల్ కటా వెళ్ళివచ్చారేమిటి సార్!
నమ్మశక్యం కాని నిజాన్ని మీదైన జర్నలిస్ట్ స్టైల్ లో చాలా సంక్షిప్తం గా వివరించారండీ రావు గారు.
చాలా బావుంది ధన్యవాదాలు
బాగుంది. నేనింకా టైటిల్ చూసి మీరు చౌరంఘీ లేన్ గురించి చెబుతారేమో అనుకున్నా.
super sir... chala baga vivarinchaaru...... u r really great sir. mana desam etu pothundo ekkadiki cheruthundo kalame nirnainchaali.
@సుధామ - అవునండీ. ఈ యాత్రకు కర్తా కర్మా క్రియ అన్నీ ఆయనే.- భండారు శ్రీనివాసరావు
@సలక్షణ దీక్షిత ఘనపాటి సన్నిదానం - ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
@ puranapandaphani -ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
@unknown - very many thanks - bhandaru srinivasrao
మనిషి ఆశలు చంపుకుని సాదా సీదాగా బ్రతకడం చాలా కష్టం. ఎంతమాత్రం పాలిస్తున్నారో (నాకు తెలియదు) పక్కనబెడితే దీదీ నిరాడంబరతకు హ్యాట్సాఫ్....
రైల్వే బడ్జెట్ పై ఆమె స్పందనకు నా జోహార్లు...
మీరు చెప్పినట్లే ప్రజాధనం గురించి నాయకులు కూసంత ఆలోచిస్తే మంచిది.
మంచి పోస్ట్ వేసారు.....
2014 ఎన్నికల్లో ఈ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం మీద ఓ పోస్ట్ ఆశిస్తున్నాం....
@వినోద్ కుమార్ - మీ స్పందనకు, సూచనకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు
ఆవిడ జీవనం ఆదర్శ వంతంగా ఉంది!
This is a great piece of journalism, Bhandaru garu! Thanks very much for presenting it so beautifully!
@Ananth and శివ ఘనపాఠి - ధన్యవాదాలు.-భండారు శ్రీనివాసరావు
wow great information Sreinivasa Ravu garu. As a contrast, you should have taken the photograph of the house of Jyti Basu and posted it beside the house of Mamata Benarjee.
Then your journalistic talent would have been more reflected in your article.
చాలా ఆశ్చర్యంగా ఉందండీ...
hm interesting!
కామెంట్‌ను పోస్ట్ చేయండి