వాక్టూన్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వాక్టూన్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
12, మార్చి 2013, మంగళవారం
చీరే మేరే సప్నే
లేబుళ్లు:
ఆంధ్ర జ్యోతి,
వాక్టూన్లు,
andhra jyothy
27, ఆగస్టు 2011, శనివారం
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 8 - భండారు శ్రీనివాసరావు
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 8 - భండారు శ్రీనివాసరావు
స్కోరెంత?
ఇవ్వాళా రేపూ హలో అనడం కన్న
క్రికెట్ సంగతి తెలిసినా తెలియకున్న
వికెట్ల గురించి అజ్ఞానం ఎంత వున్న
'స్కోరెంత?' అంటూ పలకరించడమే మిన్న
(జూన్, 13, 1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక)
చేసే పక్కింటి రేడియో గోల వినివిని
చక్కావెళ్లి మానేసి చేస్తున్న పని
'ప్లేటిడ్లీ' తెమ్మంటే యెలా వుంటుందా అని
(జులై, 1, 1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక)
కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు- రచయిత
లేబుళ్లు:
1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక,
వాక్టూన్లు
24, ఆగస్టు 2011, బుధవారం
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 7 -భండారు శ్రీనివాసరావు
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 7 - భండారు శ్రీనివాసరావు
శీర్షికాసనం
రేపు రాయాల్సిన వాక్టూన్ కోసం
ఆలోచిస్తూ డాబాపై పచార్లు దోసం ఎదురింటి పిల్లకు ఫోజు కోసం
అనుకుంటే శ్రీమతి అసలుకే మోసం (జూన్, 21, 1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక )
మెడ ముప్పయి డిగ్రీల్లో వంచి
చెవిదగ్గర కత్తెర టకటక లాడించి
క్షణాల్లో క్షవరం అయిందనిపించి
పంపేస్తే ఏం చెప్పాలా క్రాపు గురించి
(జూన్, 15,1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక )
కార్టూనిష్టులకు/ ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత
లేబుళ్లు:
1975 ఆంధ్ర జ్యోతి దినపత్రిక,
వాక్టూన్లు
23, ఆగస్టు 2011, మంగళవారం
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 6 - భండారు శ్రీనివాసరావు
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 6 - భండారు శ్రీనివాసరావు
షరా 'మామూలు'
పండుగ మామూలేమో మనదగ్గర వసూలుచేసి
మనకొచ్చే ఉత్తరాలేమో ఎదురింట్లో ఇచ్చేసి
చక్కాపోయే పోస్ట్ మాన్ని చూసి
పుట్టుకురాదా వొళ్ళంతా కసి
(జూన్, 14, 1975, ఆంధ్ర జ్యోతి దినపత్రిక)
పరీక్షిత్తులు
అర్ధరాత్రి దాకా నిద్దుర కాచి కాచి
చదివిన ఫలితం కోసం వేచి వేచి
పండయితే ఆనందం విరగపూచి
కాయయితే తలిదండ్రితో తప్పదు పేచి
(జూన్, 18, 1975, ఆంధ్ర జ్యోతి దినపత్రిక)
కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత
లేబుళ్లు:
1975,
1975- ఆంధ్ర జ్యోతి దినపత్రిక,
వాక్టూన్లు
22, ఆగస్టు 2011, సోమవారం
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 5 - భండారు శ్రీనివాసరావు
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 5 - భండారు శ్రీనివాసరావు
ఏ రోడ్డు చరిత్ర చూసినా ......
రోడ్లపైన వరదలా చేరు వాన నీరు
కాలు జారు ప్రమాదాలు అడుగడుగున జోరు
ఒక్క వాన మాత్రంతో రోడ్లతీరు మారు
సైడు కాల్వలుప్పొంగి ఏకమయ్యి పారు
(జూన్, 24, 1975, ఆంధ్రజ్యోతి దినపత్రిక)
కలవని జంట
అద్దానికి దువ్వెనకు వివాదాలు జాస్తి
ఆ రెంటిని మా ఇంటిలో కలపాలని చూస్తి
ఎడమొగం పెడమొగం కలవదాయె దోస్తీ
(జూన్, 19, 1975, ఆంధ్రజ్యోతి దినపత్రిక)
కార్టూనిస్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత
లేబుళ్లు:
1975,
ఆంధ్రజ్యోతి దినపత్రిక,
వాక్టూన్లు
18, ఆగస్టు 2011, గురువారం
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు- 1- భండారు శ్రీనివాసరావు
ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు- 1 - భండారు శ్రీనివాసరావు ![]() |
గుండెలమీది కుంపట్లు ఎదిగొచ్చిన ఆడపిల్ల ఎంత చదువు చదివినా మల్ల కట్నం లేకుండా పెళ్లి కల్ల నలుగురున్న తండ్రి ఇల్లు గుల్ల |
(కార్టూనిస్టులకు ధన్యవాదాలు)
లేబుళ్లు:
1975 ఆంధ్ర జ్యోతి,
వాక్టూన్లు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)










