నో
తాతయ్యా!
అంది
కళ్ళతో,
సరిగ్గా
ఏడాది క్రితం ఇదే రోజున.
విన్నాను, పిల్లలు, దేవుడు చెప్పింది వినాలని
అనిపించి.
సాలు
తిరిగింది.
మళ్లీ
అదే మాట.
‘నో
తాతా!’ అంది. కాకపొతే ఈసారి నోటితో. మళ్లీ వింటాను. తప్పేదేముంది?
తప్పేమి
వుంది?
డెబ్బయి
ఏడు వసంతాల పైచిలుకు జీవితంలో మొట్టమొదటిసారి, పాత సంవత్సరం కొత్త సంవత్సరంలోకి కొత్త విధంగా జారిపోయింది నిరుడు. అప్పుడు ఏడాది వయసున్న నా మనుమరాలు జీవిక ఆ రాత్రి
నాకు కంపెనీ ఇచ్చింది. అదేమిటో ఇంత రాత్రి వరకు అది మేలుకునే వుంది.
పాత
అలవాట్ల ప్రకారం ఏదైనా చేయబోయినా, చక్రాలు లాంటి కళ్ళతో వద్దు అనే సంకేతం
ఇచ్చింది. కొన్ని విషయాల్లో ప్రాణానికి
ప్రాణం అయిన మా ఆవిడ మాటే నేను వినలేదు.
అలాంటిది
జీవిక తన కళ్ళతోనే నన్ను కట్టి పడేసింది.
నన్ను
మార్చేసింది.
ఒక్క
రోజు నా చిట్టితల్లి చెప్పే మాట వింటే ఏం పోతుంది.
దేవుడు
అంతటివాడే పిల్లల మాట వింటాడు అంటారు.
ఇక
నేనెంత?
విన్నాను, అంతే !
ఇంతకు
ముందు ఎందుకు వినలేదు?
అదీ!
అంతే!! అనుభవానికి
వస్తే కానీ అర్ధం కాదు.
(31-12-23)
1 కామెంట్:
గిల్టీ ఫీలింగొదలయ్యిందా ఏమిటి మీలో కొంపదీసి ? తీసి పారేయండి భండారు వారు :)
శుభ్రంగా క్తొత్త వత్సరాన్ని పాత అలవాట్ల ప్రకారం చేస్తో పోవాలె :)
కామెంట్‌ను పోస్ట్ చేయండి