చలి వొంటిని చుట్టినట్టు పట్టె పాడు ముసురు
వెలవదాయ ఆగదాయ మనసంటది ఉసురు
పొయ్యి
తడిసె కట్టె బిగిసె ఎట్ట కాగు ఎసరు
గూటిపైన తడవనట్టి ఎండుటాకు గుంజి
కూరనార దేవుడెరుగు, కాయాలిక గంజి
కలిగినింట గ్యాసువంట
లేదుకదా తంటా
చినుకులుతో ఆరదు కద
పేదకడుపు మంట
కడుపు చల్ల కదలకుండ
ఏసీల్లో
టీవీలతో
గడిపెటోని
కేముంటది కడుపులోన దిగులు
వానయినా వొగ్గయినా పేదోడికె కద గుబులు
1 కామెంట్:
మీరు కవితలు కూడా వ్రాస్తారా ? ఇప్పటి వరకూ మీ బ్లాగులో ఎప్పుడూ కవితలు వ్రాసినట్లు లేదే?
చాలా బాగుంది ఈ కవిత. గుడిసెల్లో వాళ్ళు వాన వల్ల పడే ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.,
కామెంట్‌ను పోస్ట్ చేయండి