23, సెప్టెంబర్ 2019, సోమవారం

క్రౌడ్ మేనేజ్మెంట్ – భండారు శ్రీనివాసరావు


శ్రీ ఆర్ ప్రభాకరరావు ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు.  సున్నిత మనస్కులు. కఠినంగా మాట్లాడ్డం తెలియని ఈ పెద్దమనిషి పోలీసు శాఖలో ఎలా నిభాయించుకొచ్చారా అని ఆయనను సన్నిహితంగా తెలిసిన వాళ్ళు అనుకుంటూ వుంటారు.
పదవీవిరమణ అనంతరం ఒక సారి అమెరికాలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్లి, న్యూయార్క్ స్టేట్ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు ఆహ్వానం మేరకు వారి ఇంటికి భోజనానికి వెళ్ళారు. ముచ్చట్ల నడుమ ప్రభాకర రావు గారు తాను హైదరాబాదు పోలీసు కమీషనర్ గా ఉన్నప్పటి ఓ అనుభవాన్ని పంచుకున్నారు.
ఆ రోజుల్లో క్రౌడ్ మేనేజ్ మెంట్ అంశాన్ని అధ్యయనం చేసేందుకు అమెరికా వెళ్లి న్యూయార్క్ నగర పోలీసు కమీషనర్ను (అక్కడ ఈ ఉద్యోగాన్ని యేమని పిలుస్తారో తెలవదు) కలిసారు.
‘మీ దేశంలో నాయకులు పాల్గొనే బహిరంగ సభలకు హాజరయ్యేవారి సంఖ్య ఏమాత్రం ఉంటుందని’ ఆ అమెరికా అధికారి ఆరా తీశారు. ఎన్టీఆర్ వంటి గ్లామర్ కలిగిన నాయకులు పాల్గొనే సభలకు ఇంచుమించు యాభయ్ అరవై వేలమంది వరకు జనాలు వస్తారని ప్రభాకరరావు గారు బదులు చెప్పారు.
దానికి అమెరికా పోలీసు అధికారి బిగ్గరగా నవ్వుతూ ఇలా అన్నారట.
“క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో మీరు మా దేశంలో నేర్చుకునేది కొత్తగా ఏమీ ఉండక పోవచ్చు. నిజానికి మేమే ఈ విషయంలో మీనుంచి చాలా నేర్చుకోవాలి’  

3 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

అమెరికాలో హౌడీ మోడీ గురించి చెప్పకుండానే చక్కగా చెప్పారు.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

న్యూయార్క్ సిటీ పోలీస్ ముఖ్యాధికారిని పోలిస్ కమిషనర్ అనే అంటారు .. అని ఎక్కడో చదివినట్లు గుర్తు.

సూర్య చెప్పారు...

కావచ్చు. డార్క్ నైట్ సినిమాలో కూడా ప్రమోషన్ వచ్చాక గోర్డాన్ కాస్తా "కమిషనర్ గోర్డాన్ " అయ్యాడు. ఆలెక్క సిటీ పోలీస్ ముఖ్యఅధికారి కమిషనరే అయ్యుండాలి