14, జులై 2016, గురువారం

అప్పుడెప్పుడో విన్నాం

ఎప్పుడో విన్నాం. బస్సుల జాతీయకరణ విషయంలో కోర్టు తప్పుపట్టిందని నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఒదులుకోవడం. మళ్ళీ ఇప్పుడు వింటున్నాం,ఒకానొక అంశంపై ప్రజాతీర్పు, అదీ తన పరిపాలన మీద కాదు, వ్యతిరేకంగా వచ్చిందని బ్రిటిష్ ప్రధాని కేమరూన్ రాజీనామా చేశారని. కొత్త ప్రధాని కోసం ఘడియ కూడా ఆలస్యం చేయకుండా అధికార నివాసం వెంటనే ఖాళీ చేశారని. మనం వింటున్నాం సరే వినాల్సిన వాళ్ళు వింటున్నారా లేదా అన్నదే డౌటు.

43 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

అబ్బే. మనవాళ్ళు అంత మెతక మనుషులు కారండీ.

Zilebi చెప్పారు...



ఏమండీ భండారు వారు పెరుమాళ్ మురుగన్ , ఫ్రీడం ఆఫ్ స్పీచ్ , మద్రాసు హైకోర్టు తీర్పు మీద మీ టపా ఎప్పుడు ?


జిలేబి

Jai Gottimukkala చెప్పారు...

నాకు తెలిసి సంజీవ రెడ్డి గారు 1953-1969లో ఏదో ఒక పదవిలో ఉన్నారు. 1960-62లో ముఖ్యమంత్రి పదవి పోయినా ఎంతో ముఖ్యమయిన పార్టీ జాతీయ అధ్యక్ష హోదా దొరికింది.

అజ్ఞాత చెప్పారు...

భండారు వారు మీవంటి విలేఖరుల శుద్దులు భలే చెపుతారే! బ్రిటన్ కి ఇండియాకి పోలికేమిటి? ఎంతమంది మీడీయావారు,మేధావులు వాళ్ళు ప్రచారం చేసిన అసత్యాలపై రాజీనామ చేశారు? దేశంలొ ఎంత మంది మేధావులు చేసిన తప్పుడు ప్రచారానికి బాధ్యత వహించాల్సిందని వాదించారు.

ఏ రాజకీయ నాయకుడి (వీరుడు శూరుడు అనుకొన్నా) కెరీర్ తీసుకొన్న లైం లైట్ లో 10-15 ఏళ్లకు మించి ఉండదు. మీ విలేఖరులు 58 ఏళ్ల వరకు ఉద్యోగాన్ని పట్టుకొని వేలాడే వారే, ఒక ఛానల్ నుంచి ఇంకొక ఛానల్ కు మారుతు సర్వైవ్ అయ్యే పత్రికవిలేఖరులు రాజకీయ నాయకులకు సుద్దులుచెప్పటం.

అజ్ఞాత చెప్పారు...

శ్యామలీయం గారు, ఐ.టి. కంపెనిలో 60ఏళ్లొచ్చినా పనిచేస్తున్న మీరు రాజకీయ నాయకులను విమర్శించేది?

శ్యామలీయం చెప్పారు...

ఎవరండీ యీ అఙ్ఞాత? పృష్ట తాడనాత్ దంతభంగః అన్నట్లు సందర్భశుధ్ధి లేకుండా ఆ ప్రశ్న యేమిటి?

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

శ్యామలీయం గారు, సందర్భశుద్దా??? భాతదేశం లో 10వ వంతు కూడా ఉండని ముష్టిదేశం బ్రిటన్ తో పోల్చుకొని బానిస బుద్ది చూపుతున్నారు. అమెరికా, బ్రిటన్ లు పతివ్రతలు. వాటి దేశ చరిత్ర,విలువల చరిత్ర ఏపాటిదో మాకు తెలియదా? దొంగల కంపెనిలో పని చేస్తూ భారతదేశానికి నీతులు చెప్పింది చాలులే!

అజ్ఞాత చెప్పారు...


కాశ్మీర్ విషయం లో రిపరెండం పెట్టే ధైర్యం ఇండియాకి.

నీ నోటికేదొస్తే అదీ మాట్లాడకు. మా భారతదేశానికి ధైర్యం,సాహసం మీ దేశానికి నాలుగు సార్లు చూపించాం. తెలియకపోతే తెలుసుకో! వచ్చిన ప్రతిసారి చావుదెబ్బలు తిన్నాడు. వాళ్ళొక మనుషులు?? ఇష్టముంటే ఉండమను లేకపోతే పొమ్మను. కాష్మీర్ భూబాగం లో ఒక ఇంచె కూడా వదులుకొనేది లేదు. ఎదో అలవాటు ప్రకారం రాళ్ళేస్తున్నారంట గదా! మిలటరి వాళ్ళు పిల్లేట్లతో వీపులను సాపు చేశారట. అయ్యో మా చేతి లోని రాళ్లతో మిలటరి వాళ్ళు దెబ్బతింటామనుకొన్నామే గాని మా వీపులను ఇలా విమానం మోత మోగిస్తారనుకోలేదు అని ఏడుస్తున్నారంటే! ఇకనుంచి తోక జాడిస్తే కట్ చేసి పారేస్తుంది భారత ప్రభుత్వం.

Zilebi చెప్పారు...


నీహారిక గారు ,

సామాజిక కట్టుబాట్లు, తల్లి కాలేకున్న ఒక స్త్రీ చుట్టూతా ఉన్న పరిస్థితులు, ఎత్తిపొడుపులు ; మనో వ్యథ ;

రచయిత భావ ప్రకటనా స్వేచ్చ ; సామాజిక ఆంక్షలు ; ఏది తప్పు ఏది ఒప్పు ? భావ స్వేచ్చ ఎంత దాక ?

నేపథ్యం లో అవసరమనే అనుకుంటా నండి

చీర్స్
జిలేబి

శ్రీనివాసుడు చెప్పారు...

భండారు శ్రీనివాసరావుగారూ!
తెలుగు వెబ్ పత్రిక, బ్లాగుల లోకంలో అత్యధికభాగం, లేదా దాదాపు పూర్తిభాగం ఎడమ, ఎడమాతి ఎడమ భావజాలాలవే వున్నాయి. అవి మనదేశంలోనూ, ప్రపంచంలోనూ జరుగుతున్న సంఘటనల గురించి పాక్షిక సత్యాలనే ప్రచారంచేస్తూ, తమ భావజాల భజన తత్త్వాన్ని ప్రముఖంగా బయటపెట్టుకుంటూ, తామున్న ఒకానొక భ్రాంతిని ప్రచలితం చేస్తూ ప్రచారకూటాలుగా మారిపోయాయని నా అవగాహన. వాటిని ఎదుర్కొనేవాళ్ళ వ్యాఖ్యలను ప్రచురించే సాహసం కూడా చేయని అత్యుత్తమ ప్రజాస్వామ్యయోధులు వాళ్ళు.
మీరు ఇటువంటి పరిస్థితుల్లో భావజాలల నిబంధత లేకుండా అనావృతంగా (ఇంగితజ్ఞానం ప్రధానంగా) వ్యాస్తున్నందుకు నా అభినందనలు.
మీనుండి ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న కష్మీర్ సమస్య, పెరుమాళ్ మురుగన్ అహంభావంతో భావస్వేచ్ఛ పేరుతో ఒకానొక కులంలోని ఆడవాళ్ళని కులటలుగా చిత్రించిన తీరు ఇటువంటి విషయాల గురించి వ్యాఖ్యలను కోరుకుంటున్నాము.
మప్పిదాలతో,
..................శ్రీనివాసుడు

శ్రీనివాసుడు చెప్పారు...

అలాగే, జకీర్ నాయక్ అనే మతోన్మాది గురించి, సౌదీ అరేబియా మనదేశంలోనూ, ప్రపంచదేశాలన్నింటిలో మతపరమైన ఉగ్రవాదాన్ని ప్రచలితం చేస్తున్న వైనం గురించి కూడా మీ వ్యాఖ్యను ఆశిస్తున్నాము.

శ్యామలీయం చెప్పారు...

నేను 60ఏళ్లొచ్చినా పనిచేస్తున్నానని ఆరోపిస్తున్న అఙ్ఞాత ఉద్దేశం ఏమిటి? 60దాటిన వారు పని చేయలేరనా? పని చేయరాదనా? వారిలో పొట్టపోసుకొందుకు పనిచేసుకొన వలసిన అవసరం ఉన్నవాళ్ళు ఎవరూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండరనా? ఎవరి ఇబ్బందులూ అవసరాలూ వారివి. అందరిలోనూ స్వార్థమే చూస్తామంటే ఎట్లాగు? ఈ పేరూఊరూ లేని మనిషి నేను దొంగల కంపెనిలో పని చేస్తూ ఉన్నానటమేమిటి? ఇలాంటి నిందారోపణలను భండారువారు నిర్మొగమాటంగా ప్రచురించటమేమిటి. నేనేమీ దొంగల కంపెనిలో పనిచేయటం లేదు! ఈ క్షణంలో దురదృష్టవశాత్తూ ముక్కూ ముఖమూ లేని ఒక దొంగవ్యాఖ్యాతకు జవాబిస్తున్నాను సరా?

నీహారికగారు ఈ విషయంలో కొంత ఆలోచన చేస్తూ, జర్నలిస్టుల దగ్గర నుండి శ్యామలీయం గారి వరకూ తమ ఉద్యోగాలూ,తమ వ్యాపకాలే ముఖ్యం అని భావిస్తున్నారే కానీ చేయగలిగిన స్థితిలో ఉండీ చేయకున్నారని ఈ అఙ్ఞాత ఉద్దేశం కావచ్చునన్నారు. చాలా సమంజసంగానే ఉంది. కాని ఇక్కడ నేనొక వివరణ ఇచ్చుకోవటం‌ మంచిదని చెబుతున్నాను. నేనింకా ఉద్యోగం చేస్తూ ఉండవలసిన పరిస్థితిలో ఉండటం విచారించవలసిన విషయమే. కాని ఈ ఉద్యోగం నేనూ నా శ్రీమతీ పొట్టపోసుకుందుకు. నా యీ బ్లాగువ్యపకం నా సాధనలో ఒక భాగంగా నా వ్యక్తిగత విషయం. ఈ విషయాలు వ్యక్తిగతం కాబట్టి ఇతరులు విసుర్లు వేయటం అనైతికం అని నా ఉద్దేశం.

ఊరూపేరూ లేని వారి ఆరోపణలకు జవాబు చెప్పవలసిన అగత్యం లేదు. నేనేమీ‌ దాపరికంతో వర్తించటం లేదే, కనీసం పేరు నైన వెల్లడించలేని వారికి కూడా జవాబులు చెప్పటం అవసరం అనుకోవటం ఎలా? కాని కొన్నిసార్లు తప్పనిసరి అవుతున్నది. ముఖ్యంగా ఈ అనామకుల నిందారోపణల కారణంగా. వాక్స్వాతంత్ర్యం అంటే నోటికి వచ్చినట్లు మాట్లాడటమూ చేతికి వచ్చినట్లు వ్రాసిపారేయటమూనా? అలాంటి విశృంఖలత్వాలకు కొందరి మద్దతులా? బాగుండ లేదండీ.

అందుచేత అఙ్ఞాతలకు రాజగౌరవాలు అందించటానికి సిధ్ధంగా ఉండే బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం అంత మంచిది కాదని అనిపిస్తున్నది. ఈ విషయం సోదరబ్లాగర్లూ వ్యాఖ్యాతలూ కూడా అలోచించుకోవటం అవసరం అనిపిస్తోంది కూడా.

Zilebi చెప్పారు...



శ్యామలీయం గారిది సరియైన మాట

అన్నానిమస్సిచట నో
రున్నా దని గెలికెనోయి రుసరుస పలుకుల్
కన్నా, రివెర్సు గేరున
తన్నన్ నెంత సమయమగు, తకరా రేలన్


జిలేబి

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

విలేకరి ఉద్యోగ వయస్సు గురించి రాసిన అజ్ఞాత గారికి. నేనయితే అరవై వరకు వేళ్ళాడాను.పైగా రెండేళ్ళు extension కూడా దొరికింది. అంటే ఏమన్నమాట అరవై రెండు వరకు ఉద్యోగంలో వున్నానని అర్ధం. అంటే ఏమిటన్న మాట, కడుపు నిండిన వ్యవహారం అనే కదా. అంచేత అలాగే రాస్తుంటాము.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

టపా మీద చర్చ ఎక్కడికో వెళ్ళిపోయినట్లుందే !
ఈ టపాలో భండారు గారు చెప్పదల్చుకున్నది పబ్లిక్ లైఫ్‌లో ఉన్నవారు కొన్ని సంఘటనలకి / పరిణామాలకి బాధ్యత వహించి పదవికి రాజీనామా చెయ్యడం గురించనుకుంటాను. నీలం సంజీవ రెడ్డి గారు ఎప్పుడూ ఏదో ఒక పదవిలో ఉండేవారా కాదా అన్నది ఇక్కడ ప్రధానం కాదు (1960 లో ముఖ్యమంత్రిగా రాజీనామా చెయ్యడం కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయినందువల్ల; దానికీ ఈ టపాకీ సంబంధం లేదు. కానీ1964 లో రాజీనామా చేసిన కారణం బస్సుల జాతీయకరణని కోర్ట్ తప్పు పట్టిందని. ఈ టపాలో చెబుతున్నది ఆ నైతికత గురించి).
సంజీవ రెడ్డి గారి కన్నా ముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన రైలు ప్రమాదాలకి నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యలేదా?
తమ రాజీనామాల తర్వాత కూడా శాస్త్రి గారు, రెడ్డి గారు ఇతర పదవులు నిర్వహించారన్నది వేరే సంగతి. ఏ కాలంలోనైనా ఆ నాటి ప్రముఖ నాయకులు ఖాళీగా ఉండరుగా, ఏదో ఒక పదవి వరిస్తూనే ఉంటుంది.
తర్వాత తర్వాత కాలంలో అటువంటి నాయకులు కనబడడం తగ్గిపోయిందనీ, ఆ మూసలోని వ్యక్తిగా ఇప్పుడు బ్రిటిష్ ప్రధాని కనిపించారనీ చెప్పడం ఈ టపా ముఖ్యోద్దేశ్యం అని తోస్తోంది. మంచి పని చేసినవారెవరి గురించయినా మంచి పని చేసారని చెప్పడంలో తప్పేముంది - అది స్వదేశీయుడయినా, విదేశీయుడయినా, తెల్లవాడయినా, నల్లవాడయినా, పచ్చవాడయినా, చామనచాయవాడయినా ? దీంట్లో బానిసత్వబుద్ధెకడుంది? పైగా ఎన్నేళ్ళొచ్చినా ఇంకా ఉద్యోగాలు చేస్తున్నవారనే విసురేమిటి మధ్యలో? ఎవరి తిప్పలు వారివి. 90 ఏళ్ళొచ్చినా రాజకీయాలు పట్టుకుని వేళ్ళాడే "నాయకులు" లేరా?
తన టపా మీద వ్యాఖ్యలు ఇలా కొత్త పుంతలు తొక్కుతాయానుకునుండరు భండారు గారు, పాపం ��.

Jai Gottimukkala చెప్పారు...

@శ్యామలీయం:

మీరు పని చేయడం వలన మీకే కాదు మీ సహచరులకు, కస్టమర్లకు, కంపెనీకి & దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో లాభం. అనుభవజ్ఞులతో కలిసి పని చేయడం జూనియర్లు మెళుకువలు నేర్చుకుంటారు అలాగే వారి స్కిల్ పెరుగుతుంది. వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న మీ వలన ప్రయోజనమే తప్ప ఇంకోటి కాదు.

Hats off to you sir!

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీనివాసుడు చెప్పారు...

@ నీహారిక
ఏది అవసరమో, ఏది అనవసరమో మీతో చెప్పించుకునే స్థితిలో నేను లేను. నేను అడిగింది శ్రీనివాసరావుగారిని, మిమ్మల్ని కాదు. మీకు ఇష్టం లేకపోతే నా టపా చదవడం మానేయండి. నేను వ్రాసిన వ్యాఖ్యలలో అసమంజసమైనవి ఏమైనా వుంటే బ్లాగు నిర్వాహకులే తొలగిస్తారు. మధ్యలో మీకెందుకు బాధో నాకు అర్థం కాలేదు.
మీరిచ్చిన లంకె మీ బ్టాగుదేనని అర్థమయింది.అనవసరమైన విషయాలకు ప్రాచుర్యం తెచ్చే నాలాంటివాళ్ళనిగాక మీరు మెచ్చేవారినే మీ బ్లాగుకు ఆహ్వానించడం వివేకవంతమైన పని.
వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా విషయానికే పరిమితమై మాట్లాడడం మీరు నేర్చుకున్న తరువాత మాత్రమే ఎవరినైనా మీ బ్లాగుకు ఆహ్వానించండి.

అజ్ఞాత చెప్పారు...

@శ్యామలీయం గారు,

అందరిలోనూ స్వార్థమే చూస్తామంటే ఎట్లాగు? అనే మీరు మాత్రం రాజకీయ నాయకులలో స్వార్థం కాక ఎమి చూశారు? డేవిడ్ కెమరాన్ అంత గొప్ప వ్యక్తి,నిజాయితి పరుడైతే టాక్స్ హెవెన్ లో (Panama పేపర్స్)ఆయన పేరు బయటికి వస్తే ఎందుకు రాజినామ చేయలేదు? ఒక ఉద్యోగం చేస్తున్నపుడు తప్పులు దొర్లడం సహజం. సుదీర్ఘ ప్రయాణంలో మీరన్ని ప్రాజెక్ట్లని ఆన్ టైం లో(మీ మర్కెటింగ్ వాళ్ళు కష్టమర్ కి ప్రామిస్ చేసిన విధంగా), ఏ తప్పు దొర్లకుండా డేలివరి చేశారా? ప్రతి కష్టమర్ మీ పని చూసి మెచ్చుకొన్నాడా? మీకేవి అపజయాలు లేవా? అన్ని విజయాలేనా? అపజయం ఎదురైనపుడు రాజీనామ ఇచ్చేశారా?అపజయం లేని వాడు ఎవ్వరు ఉండరు. మీరు అవకాశం చిక్కింది గదా అని రాజకీయ నాయకుల విషయం లో రాజీనామా చేయాలని దూరిపోతారే!

మీరు పనిచేసే అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీలు బిలియన్ డాలర్లలో ప్రతి సంవత్సరం పన్నులు ఎగవేస్తూన్నాయి. ఇండియాలో కంపెనీలు పెట్టింది పన్నులు ఎగవేయటానికే! అటువంటి దొంగ కంపెనీల వద్ద మీకున్న కారణాల వలన మీరు చక్కగా ఎమి ఎరగనట్టు పనిచేస్తారు. పాలకులకు నీతులు చెపుతారు.మీ పని భలే ఉంది .

అజ్ఞాత చెప్పారు...

@ విన్నకోట నరసింహా రావు,

అంత నిజాయితిగల నాయకుడైతే డేవిడ్ కెమరాన్ నల్లధనం సంగతి బయటపడినపుడు ఎందుకు రాజీనామ చేయలేదు? కొన్ని రోజులు ఆగండి ఈ రాజీనామ వెనుక అసలు సంగతి తెలుస్తుంది. టొని బ్లేయర్ మీద ఇప్పుడు ఆరోపణలు ఎలా వస్తున్నాయో అలా వస్తాయి కెమరాన్ మీద కూడా. భారత దేశాన్ని ఏ ఇతర పశ్చిమ దేశాలతో పోల్చటం బానిసత్వ మనస్థితే కారణం. మన దేశానికి వాటికి పోలికే లేదు.

శ్యామలీయం చెప్పారు...

ఇక్కడ ఎంతమంది అఙ్ఞాతలున్నారో తెలియదు. ఒక్కరో పెక్కురో! పేరుకూడా చెప్పుకో(లే)ని వారి వరుసప్రశ్నలకు నేను ఎందుకు జవాబులు చెబుతూ‌పోవాలీ అన్న కనీసస్పృహకూడా వారికి ఉన్నట్లు తోచదు. ఇలా నిందారోపణలతో స్వైరవిహారం చేసేవారికి అడ్డుకట్టవేయటం ఉచితం అని భండారు వారికీ తోచదు.

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

కాశ్మీర్ మీదని మీరనుకుంటున్నపుడు,అక్కడి ప్రజలకు ఎవరితో ఉండాలనుకుంటున్నారో

మాదని మేమనుకోవటమేమిటి? ముమ్మాటికి కాశ్మీర్ భారతదేశానిదే. రెండో మాట లేదు. కాశ్మీర్ భూభాగం చట్టపరంగా భారతదేశానిదే!

రెఫెరండం ఎందుకు? ఇష్టం లేని ప్రజలను భారతదేశ కాష్మిర్ లో ఎవరు ఉండమట్టున్నారు. ఖాళీ చేసి పొమ్మటుంటే. జిలాని కి రోగం రొప్పు వస్తే చేరేది డిల్లి ఆసుపత్రిలో, వత్తాసు పలికేది పాకిస్థాన్ కా? వీళ్ళ నక్క జిత్తులు ఇక చెల్లవు. వీళ్ళు మనుషులా? రాక్షసులా? ఎదో వంకతో రోజు గొడవకు దిగుతూ, రక్తం కళ్ళ బడనిదే నిద్రపట్టదా? 65ఏళ్లుగా చూస్తున్నాం వారి తంతు. పాకిస్థాన్ అండ చూసుకొని ఎగిరే ప్రజలను దిక్కున్న చోటికి వెళ్ళి చెప్పుకోమను. ఈసారి నకరాలు చేస్తే పాకిస్థాన్ బార్డర్ వద్ద,ఆ చేసే వాళ్ళని వదిలేస్తే తిక్క కుదురుతుంది.

అజ్ఞాత చెప్పారు...

శ్యామలీయం గారు,

మీ నుంచి వివరణ ఎవరడిగారు? ఇది మొదటి సారి కాదు చాలా మార్లు మీరు రాజకీయ నాయకులంటే చిన్న చూపు. ప్రపంచంలోని విలువలన్ని వారేపాటించాలన్న మీ యక్స్ పెక్టేషన్.

అక్కడికి మీరేదో కంపేనీలో నీతినిజాయితిలతో పనిచేసి ప్రపంచం మార్చేస్తున్నట్లు మీ ఫీలింగ్. మీ కంపెనివాడు మీకిచ్చే జీతం పైన మాత్రమే టాక్స్ కట్ చేసి ప్రభుత్వానికి చెల్లిస్తూ, ఆయన బిలియన్ డాలర్లు ఎగవేస్తున్నాడు. అంటే మీరు ఒక పెద్ద పిండారుల దోపిడి మూఠా దగ్గర నిజాయితిగా పనిచేసే పనివారు. కాకపోతే మీకు ఒక ప్రాజెల్ట్ మేనేజరో, సొల్యుషన్ ఆర్కి టేక్టో, డేటా సైంటిస్టో వైస్ ప్రెసిడేంట్ డెసిగ్ నేషన్ లు ఇస్తారనుకోండి. అది వేరే సంగతి.

శ్రీనివాసుడు చెప్పారు...

@ నీహారిక
మీరూ గౌరవప్రదమైన వ్యక్తి అనుకునే సున్నితంగా చెప్పేను. అనవసరంగా వాగొద్దు. చెప్పులు అందరికీ వుంటాయి. పళ్ళు రాలగొట్టించుకోవాలనుకుంటే నా ప్రస్తావన తెండి.
నేనే కాదు, అనేక వెబ్ సైట్లు, తెలుగు టి.వి.ఛానెళ్ళు, ప్రతికలు, హిందీ, ఇంగ్లీషు చానెళ్ళు కోడై కూస్తున్నా ఇంకా వినబడలేదా? బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇంకా ఇతరదేశాల మాధ్యమాలు చెప్పింది వినబడలేదుా? వాళ్ళందరినీ చెప్పులతో కొడతారా?
మీకు ఇంకా సమాచారం కావాలంటే ఈ వెబ్ సైట్స్ లోచూసుకోవచ్చు.
ఈ క్రింద వరుసుగా ఇచ్చన సైట్లలో మొదటి సైట్ ముస్లిం స్కాలర్స్‌ది. చివరిది ఇస్కాన్ వాళ్ళది.
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
Is the Logic of Zakir Naik Reliable?
http://www.unchangingword.com/naik_refuted.php
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
Exposing The self-proclaimed scholar of comparative religion,Fraud and Terrorist ZAKIR
http://exposingzakirnaik.blogspot.in/
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
Why Muslims hate Zakir Naik so much?
http://agniveer.com/hate-zakir/
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
Dr Zakir Naik's Fraud Exposed in Misusing Vedic Texts
http://www.iskcondesiretree.com/profiles/blogs/dr-zakir-naiks-fraud-exposed

అజ్ఞాత చెప్పారు...

నిహారిక

మీసంస్కారం తెలుసుకోవటానికి ఒక్క మెతుకు పట్టుకొంటే చాలండి. అది అర్థమయ్యే శ్రీనివాసుడు గారు తప్పుకొన్నారు. మీ అభిప్రాయం కరెక్టే అండి జకీర్ నాయక్ మతోన్మాది కాదు జాతీపిత. ఆయన భారతజాతి పిత అయితేకాదు.

నీహారిక చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్రీనివాసుడు చెప్పారు...

మనం చదివేవి నిలువుపాటివాళ్ళ రచనలు, ఇతరులు చదివేవి అడ్డమైనవాళ్ళ రచనలు.
మన మేధస్సుతోనే సమస్తం తెలుసుకోగలమనుకునే అహంభావంతో ప్రతి బ్లాగుతోనూ ప్రతి ఒక్కళ్ళతో తగాదాలాడడం మాని స్వంతపైత్యం, రాగద్వేషాలు కట్టిపెట్టి, ‘‘నాకేమీ తెలియదు, నేనెంతో తెలుసుకోవాలి, నాకు తెలిసిందే పరమసత్యం కాదు’’, అనే వినయంతో ఎదుటివాడు చెప్పింది విని వివేకంతో నిర్ణయానికి రండి.
నాకు ఇష్టమైనవాళ్ళని అందరూ పొగడాలి. నేను ఇష్టపడనివాళ్ళని అందరూ తిట్టాలి అనుకునే మనస్తత్త్వమే మన సంస్కారానికి నిదర్శనం.
హేతుబద్ధంగా వివేచనతో నిర్ణయం తీసుకోవడమే మనకున్న ఇంగితజ్ఞానాన్ని సూచిస్తుంది.
నిజమైన సత్యాన్వేషులయితే మతోన్మాది ఎవరో తెలుసుకోడానికి నేనిచ్చిన సమాచారంలో ఆ మతం వాళ్ళే సైద్ధాంతికంగా, తాత్త్వికంగా అతడిని ఖండించడాన్ని తెలుసుకోడానికి చదవాలి. అది లేకపోతే మన కూపస్థ మాండూక్యం బయటపడుతుంది.
సూఫీలను సమాధి ఆరాధకులని కించపరచిన వ్యక్తి మతోన్మాది కాడా?
స్వంత మేధస్సు అంటే రాగద్వేషాలతో జీవితాంతమూ బ్రతకడం కాదు. అనావృతంగా వుండగలగడం.
************************************

కచ్చితంగా అయిదు రోజుల క్రితం భారతదేశంలోఅని అనేక తెగలకు చెందిన ముస్లిం మతపెద్దలంతా జాకీర్ నాయక్ ను ఏకకంఠంతో ఖండించడాన్ని మన స్వంత చెవులతో వింటే, మన స్వంత కళ్ళతో చూస్తే, మన స్వంత బుఱ్ఱతో చదివితే, మన స్వంత పైత్యం మనం ఆలోచించడానికి అడ్డుపడకపోతే, మనకు సత్యం తెలుస్తుంది.

Showing unprecedented solidarity, Muslim clerics from all sects have come forward to urge strong action against Naik and his channel for misinterpreting the Quran and misleading Muslims with his evangelism.

****************************************
దీని పూర్తి లంకె ఇది,
Muslim clerics in India unite against superstar televangelist Zakir Naik
http://scroll.in/article/811508/muslim-clerics-in-india-unite-against-superstar-televangelist-zakir-naik
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
మనకు తెలిసింది మాత్రమే సత్యం అవదు. వితండ వాదన అవుతుంది. ఎదుటివాడు చెప్పింది విని సహేతుకంగా స్పందిస్తే సంస్కారానికి దగ్గరవుతాం.

అజ్ఞాత చెప్పారు...

శ్రీనివాసరావుగారూ!
టపాకి సంబంధించని కామెంట్లు డిస్కషన్ నడుస్తోంది. మీ బ్లాగ్ కూడా ఇలా అయి పోయినట్టేనా? మేలుకోండి.

అజ్ఞాత చెప్పారు...

టపాకి సంబంధించని కామెంట్లు డిస్కషన్ నడుస్తోంది. మీ బ్లాగ్ కూడా ఇలా అయి పోయినట్టేనా? మేలుకోండి.

నువ్వు ఉన్నవు గదా అటెండర్ వి వచ్చి మేలుకొల్పటానికి. బ్లాగు ఎమై పోయింది? జాకీర్ నాయక్ వంత పాడే మెంటల్ కేసులు మనమధ్యే ఉన్నారని తెలిసింది. శ్రీనివాసరావు కి తెలుసులే వ్యాఖ్యలను ఎమి చేయాలో, మూసుకొని నీ పని చూసుకో.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

అందరికీ వందనాలు
అపార్ధాలు సాగేనా? ఆగేనా?
అర్ధం చేసుకోకపోవడం కంటే అపార్ధం చేసుకోవడం మేలు అంటారు. ఎందుకంటే కనీసం పద్దెనిమిదో రీలులో అయినా అపార్ధాలు దూదిపింజల్లా తొలగిపోయి గ్రూప్ ఫోటోతో శుభం కార్డు పడడం పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో అనేకసార్లు అందరం చూసి వుంటాం.
అయితే చిక్కల్లా కలిగిన అపార్ధాలు తొలగిపోవాలంటే అంత ఈజీ ఏమీ కాదు.
మొన్నీమధ్య ఫేస్ బుక్ లో ఓ మిత్రుడు పోలవరం మీద ఒక పోస్ట్ పెట్టాడు. అదేమిటో పూర్తిగా చూడకుండా పోలవరం గురించిన నా పరిజ్ఞానం మొత్తం రంగరించి, కామెంటుగా రాసేసి ఇక ఆ విషయమే మరిచిపోయాను . కానీ అసలు కధ రెండో రోజుల తరువాత మొదలయింది. ఇంకో మిత్రుడు ఫోను చేసి మరీ నిలదీశాడు. ఆ మొదటి మిత్రుడు రాసిన పోస్ట్ లో అన్యాప దేశంగా ఈ రెండో మిత్రుడి గురించి కొన్ని అభ్యంతర వాఖ్యలు వున్నాయట. అటువంటి వాటిని ఖండించాల్సింది పోయి లైక్ కొడతారా లైక్ అంటూ పట్టుకున్నాడు. నాకు ఈ లైక్ ల గొడవ అసలే అర్ధం కాలేదు. కామెంటు పెట్టినా అది లైక్ కిందికి వస్తుందేమో తెలియని కంప్యూటర్ పరిజ్ఞానం నాది. దాంతో ఆ మొదటి మిత్రుడికి క్షమాపణలు చెప్పుకుని పోలవరం చరిత్ర యావత్తూ తొలగించేశాను. ఆ విధంగా రెండో మిత్రుడి అపార్ధాన్ని ఓ మేరకు తొలగించగలిగానని అనుకున్నాను. అలా ఆ కధ సుఖాంతం అయిందని సంతోషించేలోగా నేను పోస్ట్ చేసిన మరో చిన్న పేరా కధనంపై సీరియస్ గా వాదోపవాదాలు మొదలయ్యాయని కాస్త ఆలస్యంగా తెలిసింది. నేను రాసిన దాని మీద కాకుండా వాళ్ళ వ్యాఖ్యల మీద ఒకరికొకరు చాలా భీషణంగా మాటల యుద్ధం సాగించారు. ఆ విషయంలో కూడా నా అజ్ఞానమే మరోసారి అపార్ధాలు తెచ్చి పెట్టింది. బ్లాగులో రాసి ఊరుకోవడమే తప్ప ఆ దరిమిలా వ్యాఖ్యలను గురించి కూడా కాస్త కన్నేసి వుండాలని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇదీ లేటుగా తెలిసింది.
నేను రాసిన దానిపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, వాడకూడని పదాలు వాడినా వాటిని తొలగించడం అనేది నాకు ఇష్టం వుండదు. నావి చదివిన వారు, వాటిని కూడా చదివితే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ కూడా పైన చెప్పిన ఉదంతమే పునరావృతం అయింది. ‘ఇదేమిటండీ, మీ బ్లాగులో కూడా ఇలాంటి రచ్చను అనుమతిస్తారా? తప్పుకదా’ అని ఓ శ్రేయోభిలాషి మెత్తగా చీవాట్లు పెట్టారు కానీ, వ్యాఖ్యల్ని తొలగించరాదు అనే నియమం మళ్ళీ అడ్డొచ్చి మరోసారి అపార్ధాల సీను మొదలయింది.
ఈ రెండింటిలో నాకు అర్ధం అయింది ఏమిటంటే, రచ్చ సాగింది నేను రాసిన దానిమీద కాదు. అదే కొంత ఊరట.
అపార్ధాల విషయంలో నా మునుపటి అభిప్రాయం సరయినదేనా కాదా అనే గుంజాటన మాత్రం నాలో ఇప్పుడు మొదలయింది.
NOTE: Courtesy image owner

శ్యామలీయం చెప్పారు...

భండారువారూ, మీరు లోగడనే ఒకటి రెండు పర్యాయాలు చెప్పారని గుర్తు. మీకు ఎటువంటి వ్యాఖ్యలనూ తొలగించడం అనేది ఇష్టం వుండదని. అది మరొకసారి అందరికీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఎక్కడెక్కడ అత్యంత ఉదారంగా కువ్యాఖ్యలూ నిందాలాపాలూ కూడా నిర్మొగమాటంగా ఆమోదించబడుతాయో అక్కడక్కడకు వెళ్ళి వ్యాఖ్యలను చేయటం విషయంలో వ్యాఖ్యాతలే తాము కొంచెమో గొప్పో తెలివిడితో వ్యవహరించాలని గమనికతో ఉండాలని మీరు అన్యాపదేశంగా చెప్పకనే చెబుతున్నారు. మీరు 'మీ వ్యాఖ్యను ఉంచండి' అని ఉన్న సూచనను కొంచెంగా పొడిగించి 'మీ వ్యాఖ్యను ఉంచండి - అది ఎటువంటిదైనా స్వాగతం - ఎట్టిపరిస్థితుల్లోనూ మీ వ్యాఖ్య తొలగించబడదు' అని ప్రకటిస్తే వ్యాఖ్యను ఉంచేముందే హెచ్చరికగా ఉంటుంది. మీ పధ్ధతిని ఎవరూ అక్షేపించలేరు - మీ‌ బ్లాగులో మీకు అనుకూలమైన విధానం నడవటంలో ఏమాత్రమూ తప్పులేదు. అలాగే వ్యాఖ్యాతలు కూడా వారివారి పధ్ధతుల ప్రకారం వ్యాఖ్యలను గమనిక ప్రకారమే ఉంచకతప్పదు. చాలా సంతోషం.

నీహారిక చెప్పారు...

ఎవరు ఎటువంటి వ్యాఖ్యను వ్రాసినా మీరు అనుమతించడంలో తప్పులేదు.ఇతరులను మీ బ్లాగులో దూషిస్తూ ఉన్నా నాకేమీ పట్టదు అన్న మీ మెట్ట వేదాంతాన్ని నేను సహించను.అజ్ఞాతల పరుష వ్యాఖ్యలను మీరు డెలిట్ చేయనందుకు గాను ఒక సంవత్సరం పాటు మీ బ్లాగులో వ్యాఖ్యానించకూడదని నేను నిర్ణయించుకున్నాను.మీరు వ్రాసేసి వెళ్ళిపోతే నా వ్యాఖ్యలకి విలువలేనిచోట అనవసరంగా వ్యాఖ్యానించడానికి నేను సిద్ధంగా లేను.ఇదేమీ టీవీలో చర్చా కార్యక్రమం కాదు. నా ప్రతి వ్యాఖ్యా నాకు చాలా విలువయినదే !


hari.S.babu చెప్పారు...

@neehaarika
ఎవరు ఎటువంటి వ్యాఖ్యను వ్రాసినా మీరు అనుమతించడంలో తప్పులేదు.ఇతరులను మీ బ్లాగులో దూషిస్తూ ఉన్నా నాకేమీ పట్టదు అన్న మీ మెట్ట వేదాంతాన్ని నేను సహించను

@haribabu
నువేదో పత్తిత్తులాగ నీతులు చెప్పకు!నేను నిన్ను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పే దమ్ము లేక పబ్లిస్గ్ చెయ్యకుండా మూసుకుని కూర్చున్నావేం?
@నీహారిక గారూ,
పెళ్ళి కెదిగిన కొడుకు ఉన్న ఒక వివాహిత "లాడెనుకి నేనూ,నాకు లాడెనూ" అని దీర్ఘాలు తీస్తూ రాయడం ఏ నియమాల కింద సభ్యతాయుతమైన భాష కింద వస్తుంది?

పత్తిత్తులా మాట్లాడకండి.నా బ్లాగులో మిగతా వ్యాఖ్యాతల్లో కొందరు ఇతరుల పట్ల "కల్లు తాగిన కోతిలా" అన్న మాట వాడినప్పుడు నాకు నచ్చకపోయినా సహించాను - వదనలో పర్తివారూ సామెతల్ని
వాడుకోవటం మామూలే గనక!అదే ఇతర్లని "వీడు మళ్ళా వచ్చాడు" అని ఉన్న కామెంట్లు న అనతట నేనే తీసేసి వాళ్ళకి సజషన్ ఇచ్చాను.నా బ్లాగులో మెరేదో సభ్యతాయుతంగా రాస్తే ఇతర్లు మీతో
బూతులు మాట్లాడినట్టు ఇప్పుడు చెప్తే అది నాకూ నా బ్లాగుకీ అవమానం - దయచేసి నా బ్లాగుకి సంబధించిన మీ అభిప్రాయం తప్పని ఒప్పుకోండి!


P.S:చెత్త కామెంట్లు వెయ్యడం దేనికి?తర్వాత ఖాళీలు వుంచడం దేనికి>

అజ్ఞాత చెప్పారు...

రామాయణంలో పిడకలవేటలాగా దిక్కుమాలిన జిలేబి పద్యం ఒకటి. తగుదునమ్మ అంటూ అన్ని బ్లాగులలోకి దూరి జుజుబి పద్యాలు రాస్తుంది.
అన్నట్టు శ్యామలరావు సారు. మీ బ్లాగులో అనామక వాక్యలు అనుమతించాలి. ఓకేనా.

అజ్ఞాత చెప్పారు...

నీహారికమ్మకు కోపమొచ్చిందన్నట్టు. నువ్వు రాసే పిడక వాక్యలు లేకపోతే ఏమైతుంది. అట్లనే జిలేబి గుడక పిచ్చి పద్యాలు రాయొద్దని చెప్పు. నీకు పుణ్యముంటుంది.

అజ్ఞాత చెప్పారు...

ఇంకా బాగా గడ్డి పెట్జ్టు
నీహారికా జిలేబి థూత్ యాక్

hari.S.babu చెప్పారు...

@neehaarika
ఒక సంవత్సరం పాటు మీ బ్లాగులో వ్యాఖ్యానించకూడదని నేను నిర్ణయించుకున్నాను.
@haribabu
very gooD Decision - keep it Up!
నీ చెత్త వ్యాఖ్యలు ఇక్కడ లేకపోవడమే బెటరు:-)
ఏదో ఒక చెత్త వ్యాఖ్య వెయ్యటం నీ వ్యాఖ్యల్ని నువ్వే డెలిట్ చేసుకోవటం - ఈ సుత్తి పన్లకి బదులు అసలు వ్యాఖ్య వెయ్యకుండా ఉండటం చాలా చాలా అమంచి న్ర్ణ్యం,కానీ కుక్క బుద్ధి వూరుకోనిస్తుందా?తోక వూగకుండా ఉంటుందా?