22, మార్చి 2016, మంగళవారం

ఒకనాడిలా.......

ఒకనాడిలా ...
ఒకప్పుడు ఇలా జరిగేవి విలేకరుల సమావేశాలు. కూర్చోడానికి వీల్లేక నిలబడి, సోఫా అంచుల మీద కూలబడి విలేకరులు ప్రశ్నలు అడిగి జవాబులు రాసుకునేపనిలో వున్నట్టున్నారు. ఎదురుగా ఓ సోఫాలో తల పట్టుకు కూర్చుంది ఎవ్వరో కాదు, భారత దేశ ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. నెత్తి మీద గాంధీ టోపీ లేదు కదా, గుర్తుపట్టడం కష్టం.(గాంధీ టోపీ ఆయన తప్ప మిగిలిన కాంగ్రెస్ నాయకులు చాలామంది పెట్టుకునే వాళ్ళు. నిజానికి ఆ టోపీ పెట్టుకుంటే గాంధీ గారిని పోల్చుకోవడం కూడా ఇబ్బందే) 
Photo Courtesy : Shri Seshagiri Rao Pothapragada

కామెంట్‌లు లేవు: