‘కలం కూలీ’,
కీర్తిశేషులు జి.కృష్ణ గారు గొప్ప
వాక్చాతుర్యం కలవారు. అంతేకాదు మంచి సంభాషణాచతురులు కూడా. హైదరాబాదు రాం నగర్ లో
ఆయన అద్దెకు వున్న ఇంటికి వెళ్లి ఆయన చెప్పే కబుర్లు వినే వారిలో కేవలం పత్రికల
వాళ్ళే కాకుండా విభిన్న వ్యావృత్తులకు
చెందినా వాళ్ళు కూడా వుండేవారు. అలా వెళ్ళిన ఓ పెద్దమనిషిని కృష్ణ గారు ఓ కోరిక
కోరారు. ఒక మనిషిని చూడాలని వుందని, చూడడమే కాదు అతడితో మాట్లాడాలని వుందని మనసులో
మాట బయట పెట్టారు. ఒకపక్క ఇంతమంది కృష్ణ
గారిని చూడడానికి వస్తుంటే కృష్ణ గారు చూడాలని
అనుకుంటున్నదెవరా అని ఆశ్చర్యపోతుండగా కృష్ణగారు అతడి వివరాలు చెప్పేశారు. అది
విని ఆ పెద్దమనిషి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టాడు. అతడెవరంటే – బన్సీలాల్ పేట
శ్మశానంలో పనిచేసే కాటికాపరి.
కృష్ణ గారి కోరిక
తీర్చడం మహద్భాగ్యం అనుకునే ఆ పెద్దమనిషి ఒకటి రెండు రోజుల్లోనే అతడిని
వెంటబెట్టుకుని తీసుకువచ్చాడు. ఆ కాటికాపరిని చూడగానే కృష్ణ గారి కళ్ళు వెలిగి
పోయాయి. అతడిని ఆప్యాయంగా తన పడక పక్కనే కూర్చోబెట్టుకుని, ‘లచ్చమ్మా!(కృష్ణ గారు
భార్యను పిలిచే తీరు) మనవాడు వచ్చాడు, మంచి కాఫీ పట్రా’ అని కేకేసి అతడితో సంభాషణ ప్రారంభించారు.
‘ఇదిగో చూడవయ్యా!
(అతడి పేరు గుర్తుకు రావడం లేదు) నువ్వు రోజుకు ఎన్ని శవాలు దహనం చేస్తుంటావు
ఏమిటి?’
‘రోజుకు ఇన్ని అనీ
లెక్కేమిటుంటాది చెప్పండి. ఎన్నొచ్చినా కాదనకుండా కాలుస్తూ పోవడమే’ అన్నాడా కాటి
కాపరి.
‘సరే! నన్ను చూసావు
కదా. బక్క పలచగా వున్నాను. కాస్త నొప్పితగలకుండా కాల్చడం కుదురుతుందా?’
‘అన్ని నొప్పులు వొదిలేకే
కదా మా దగ్గరకు వచ్చేది. ఆ బాధేమీ వుండదు లెండి.’ అన్నాడతను తాపీగా.
‘అది సరే ఇంత
సన్నగా వున్నాకదా కాటిమీద లేచి కూర్చొను కదా’
‘అలా లేస్తే మరో
మొద్దు మీద వేస్తా ఫికరు పడకండి’ అన్నాడతను మరింత తాపీగా.
అలా ఆ ఇద్దరు
మాట్లాడుకుంటూ వుంటే వినే వాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టారు.
(సూతుడు శౌనకాది
మునులకు చెప్పగా విని, ఆ విన్నవాళ్ళల్లో ఒకరు చెప్పిన ‘కృష్ణ కధ’)
(21-06-2013)
(కృష్ణ గారు జీవించివున్న రోజుల్లో ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళిన నాటి జర్నలిస్టు, నేటి రాజ్యసభ సభ్యులు శ్రీ రాపోలు ఆనంద భాస్కర్)
-ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ లోకేశ్వరరావు రచించిన ఆంగ్ల గ్రంధంలో కృష్ణ గారి గురించి-
JEEVITHAM ATANI KOKA TAMAASHAA: Lokeshwar,
Gandhi Publications, "Shobha" H.No. 12-2-709/5/1/C, Navodaya Colony,
Mehidipatnam, Hyderabad-500028. Rs. 40. (Review
in Hindu)
THIS VOLUME is a collection of 18 essays most of which support the
cause of Telangana.
The author provides insights into the evolution of the mulki
(local) movement since the days of Kutub Shahi Kings. His convincing arguments
are sometimes overshadowed by emotional overtones. Creation of smaller states
at this juncture has to be tackled at the national level as similar demands are
on the anvil elsewhere.
The introductory article provides glimpses of the eventful career
of the veteran journalist G. Krishna, who went to jail under the Quit India
movement.
After release, as a reporter he had a unique experience of having
supper with a former prison mate (to fulfil the last wish) who was to be hung
for murder next morning. No wonder, "one could see both a child's laughter
and Ramana Maharshi's brilliance in his face." A dedicated professional,
Krishna is a role model to younger journalists.
1 కామెంట్:
కాటి కాపరితో తన గురించి తాను మాట్లాడడానికి దమ్ముండాలి, జ్ఞానం ఉండాలి ....
కామెంట్‌ను పోస్ట్ చేయండి