ఇలాగయినా అర్ధం చేసుకోండి!
“నా వయస్సు కేవలం ఎనభై ఆరు సంవత్సరాలు. గత అరవై ఏళ్లుగా మీ బాంక్
ఖాతాదారుగా వున్నాను. ఉద్యోగం చేసేటప్పుడు, ఇప్పడు రిటైర్ అయిన తరువాత కూడా అదే
బ్యాంకు లో నా ఖాతా కొనసాగిస్తూ వచ్చాను.నేను ఖాతా తెరిచినప్పుడు మీది చాలా చిన్న బ్యాంకు.
అయినా సర్వీసు చాలా గొప్పగా వుండేది. మీ బ్యాంకులో పనిచేసే సిబ్బంది అనేకమందితో
నాకు వ్యక్తిగత పరిచయాలు వుండేవి. ఆ రోజుల్లో బ్యాంకు కు వచ్చినప్పుడల్లా అంతా
ఆత్మీయ వాతావరణం కనబడేది. ఇప్పటిలా ఏసీలు లేవు. సోఫాలు లేవు. కంప్యూటర్లు లేవు. టోకెన్
తీసుకుని పిలుపుకోసం ఎదురు చూసేవాళ్ళం. మరి ఇప్పుడో – బ్యాంకు కు ఏదో పెద్ద పని
వుంటే తప్ప రావాల్సిన పని లేకుండా చేశారు. అక్కడ పనిచేసేవారు ఎవరో, యెలా వుంటారో నాకు తెలియదు. నేనెవరో వారికి తెలియదు.
“ఈ
సొదంతా యెందుకు? అసలే మీరు మీ పనితో బిజీగా వుంది వుంటారు. అసలు విషయానికి వస్తాను.
“మొన్నీమధ్య
మా డ్రైవర్ కు జీతం చెక్కు ఇచ్చాను.అతను ఆ
చెక్కు బ్యాంకులో ఇచ్చే సమయానికి నా ఖాతాలో సరిపడా డబ్బులు లేవనే సాకుతో దాన్ని తిరగగొట్టారు.
మామూలుగా నా పెన్షన్ మీ బ్యాంకు కే నెలనెలా దానంతట అదే జమ అయ్యేలా ముందుగానే
ఏర్పాటు చేసుకున్నాను.అయినా చెక్కు రిటర్న్ చేశారు. నా లెక్క ప్రకారం మా డ్రైవర్
నేనిచ్చిన చెక్కును బ్యాంకులో జమ
చేయడానికీ, దాన్ని గౌరవించి మీరు డబ్బు
చెల్లించేలా సరిపడే డబ్బు నా ఖాతాలోకి చేరడానికీ నడుమ కొన్ని నిమిషాలకంటే ఎక్కువ వ్యవధి పట్టి వుండదు. యేది ఏమయినా మీరు మీ రూల్స్ ప్రకారం
దాన్ని తిరగ్గొట్టారు. ఏం చేస్తాం? కంప్యూటర్ తన పని తాను చేసుకుపోయింది.గత
పదేళ్లుగా ప్రతి నెలా నా పెన్షన్ డబ్బులు ఒక్క రోజంటే ఒక్క రోజు వార కూడా లేకుండా నా ఖాతాకు జమ అవుతున్నాయని
దానికి తెలియదు కదా.
“నేను నెట్లో సరి చూసుకున్నాను. నా పెన్షన్ డబ్బులు అదే రోజు నా ఖాతాకు జమ అయ్యాయి. అయినా డబ్బులు లేకుండా చెక్కు ఇచ్చి మీ బ్యాంకును ఇబ్బంది పెట్టినందుకు పరిహారంగా ఓ అయిదు వందలు నా ఖాతా నుంచి మీరు వసూలు చేసిన సంగతి కూడా అప్పుడే తెలిసింది. ఇంత ఖచ్చితంగా పనిచేస్తున్నందుకు మీకూ మీ సిబ్బందికీ, మీ కంప్యూటర్లకూ నా ధన్యవాదాలు.
“అయితే, ఈ సంఘటన వల్ల ఇన్నాళ్ళుగా మీ బ్యాంకు పట్ల నేను అనుసరిస్తూ వచ్చిన విధానంలో మార్పు తీసుకురావాల్సిన అగత్యం బోధపడింది. అందుకు కూడా మీకు మరోసారి నా ధన్యవాదాలు.

“ఏమయితేనేం
! ఇన్ని రోజులుగా మీ బ్యాంకు తో నాకున్న
సంబంధ బాంధవ్యాలను ఓ సారి సమీక్షించు కున్నాను. దాన్నిబట్టి తెలిసిందేమిటంటే-
“నానుంచి
మీరు ఏదయినా సమాచారం కోరినప్పుడల్లా నేను దాన్ని స్వయంగా బ్యాంకుకు వచ్చి
తెలియచేస్తున్నాను. కానీ, నాకేదయినా అవసరం వచ్చి మీ బ్యాంకు ఫోను చేసినప్పుడు మాత్రం ముందుగా రికార్డు చేసివుంచిన ఓ స్వరం బదులిస్తుంది. పైగా ఏదయినా అనుమానం వచ్చి దాన్ని
నివృత్తి చేసుకోవడానికి ఎంతో సమయం వృధా
చేసుకుంటూ, బుద్ధిమంతుడయిన రాముడి మాదిరిగా ఆ
మానవాతీత స్వరం అడిగే అనేక ప్రశ్నలకు
జవాబులు ఇవాల్సివస్తోంది. ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అంటూ కంప్యూటర్ జారీ చేసే
ఆదేశాలను అనుసరిస్తూ చిన్న పనికి కూడా నా పుట్టిన తేదీని, తలిదండ్రుల పేర్లతో సహా
ప్రవర చెప్పుకుంటే కాని పని జరగని పరిస్తితితో రోజురోజుకూ విసుగెత్తి పోతోంది.
“అందుకే,
ఇప్పుడు నేనొక నిర్ణయానికి వచ్చాను. అది తెలిపేందుకే ఈ ఉత్తరం.
“నేను
కాని ఇతర ఖాతాదారులు కాని పడుతున్న ఇబ్బందులు మీకు తెలియాలంటే ఇంతకంటే నాకు వేరు మార్గం
తోచడం లేదు. మా వూరికి మీ వూరెంత దూరమో, మీ వూరికి మా వూరంతా దూరం అనే సామెత
మీరెరుగనిది కాదుకదా. ఇక చిత్తగించండి.
“ఇన్నేళ్ళుగా మీ బ్యాంక్ కు నేను కట్టాల్సిన ఇంటి రుణం నెలసరి వాయిదాలు ఇకనుంచి నేరుగా మీ బ్యాంకు కు జమ అయ్యే పద్ధతికి స్వస్తి చెబుతున్నాను. వాటిని ముందు ముందు చెక్కు ద్వారానే చెల్లిస్తాను.అది కూడా మీరు లిఖిత పూర్వకంగా నామినేట్ చేసిన మీ బ్యాంకు ఉద్యోగి పేరిట రిజిస్టర్ పోస్ట్ లో పంపిస్తాను. అతడు కాకుండా నేను పంపిన ఆ కవరును మరెవ్వరూ తెరవడానికి పోస్టల్ రూల్స్ అంగీకరించవని నేను ముందుగానే మీకు తెలియచేసుకుంటున్నాను.
“నేను ఈ ఉత్తరంతో పాటు పంపుతున్న నమూనా దరఖాస్తులో ఆ ఉద్యోగి వివరాలు తిరుగు టపాలో పదిరోజుల లోపల నాకు పంపాలని కోరుతున్నాను. దరఖాస్తు ఏడెనిమిది పేజీలు వుందని భయపడకండి. కానీ ఏమీ చేయలేను. బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు ఖాతాదారుడి గురించి మీరెంతగా తెలుసుకోవాలని అభిలషిస్తారో అదేమేరకు నేనూ మీ ఉద్యోగి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోగోరితే మీరు అభ్యంతర పెట్టాల్సిన విషయంగా నేను భావించడం లేదు.
“ఇకపోతే, మరో విషయం. మీ ఉద్యోగి తెలియచేసే విషయాలు, అతగాడి ఆర్ధిక పరిస్థితులు ఇవన్నీ సక్రమంగా వున్నాయని ఓ గుర్తింపు పొందిన నోటరీ ధృవపరచాల్సివుంటుంది.

“
ఆ తరువాత, నేను నా వీలును బట్టి మీరు నామినేట్ చేసిన ఉద్యోగికి ఒక పిన్ నంబరు
పంపుతాను. నాతో ఏదయినా విషయం చరించాలని
అనుకున్నప్పుడు అతడు విధిగా ఆ నెంబరును ముందు పేర్కొనాల్సి వుంటుంది.
“మీలాగానే
నేను కూడా మా ఇంట్లో ఫోనుకు కొన్ని ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసుకున్నాను.ఇకనుంచి
మీ బ్యాంకు నుంచి నాకు ఫోన్ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ఇవేమీ కొత్తవి కావు. అనేక సంవత్సరాలుగా మీ బ్యాంకు ఖాతాదారులం
అందరం పాటిస్తూ వస్తున్నవే. ‘అనుసరణ పొగడ్తకు నమూనా’ అంటారనే నానుడి మీకు
తెలియనిదని అనుకోను.
“ప్రతి ఖాతాదారుడు ఎంతో ముఖ్యమయిన వ్యక్తి అని బ్యాంకుల్లో రాసిపెడుతుంటారు కదా. అందుకే, నాకు ఫోను చేయాల్సిన అవసరం పడ్డప్పుడల్లా ఈ కింది సూచనలు పాటించండి.
* ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకుంటే * బటన్ ప్రెస్ చేయండి.

*
నన్ను కలుసుకోవాలని అనుకుంటే ఒకటి నొక్కండి.
*
నేను బకాయి పడ్డ వాయిదా గురించి తెలుసుకోవాలని అనుకుంటే ‘రెండు’ నొక్కండి.
*
మీ ఫోను కాల్ నా మొబైల్ కి బదిలీ చేయాలనుకుంటే ‘మూడు’ నొక్కండి.
* నా మెయిల్ కు సమాచారం పంపాలి అనుకుంటే పాస్ వర్డ్ తప్పనిసరి.
·
ఒక్కోసారి నా నుంచి ఫోనులో జవాబు రావడం ఆలశ్యం అయితే
మీరు కొద్ది సేపు రికార్డు చేసిన సంగీతాన్ని వినాల్సివుంటుంది. ముందు ముందు
ప్రకటనలు కూడా వినాల్సిన పరిస్తితి ఏర్పడినా ఆశ్చర్య పోనక్కరలేదు.
· ఈ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కొంత
మీనుంచి నేను వసూలు చేయాల్సివుంటుంది.ఇలాటి
వ్యవహారాలు మీకు కొట్టిన పిండే కనుక మీరు విభ్రాంతికి గురి కానవసరం లేదు.
· నూతన సంవత్సరానికి ముందు ఇలాటి ఉత్తరం
రాయడం నాకూ ఇబ్బందిగానే వుంది. కాకపోతే, షరా మామూలుగా మీకూ, మీ బ్యాంకు
సిబ్బందికీ, మానవాతీత స్వరంతో మాట్లాడే కంప్యూటర్లకూ కొత్త సంవత్సరం ఆనందదాయకంగా
గడవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మరింత సౌభాగ్యవంతంగా కూడా గడవాలని
కోరుకోవాలని వుంది. కానీ, నాలాటి కష్టమర్ల సంఖ్య మరింత పెరిగితే ఖర్చులు కూడా
పెరిగి బ్యాంకు రాబడి తరిగి సౌభాగ్యం కొంత తగ్గే అవకాశం వుండగలదన్న భయంతో ఆ
ఆకాంక్షను వ్యక్తం చేయకుండా అణచిపెట్టుకుంటున్నాను.
· పీఎస్:
దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ముసలివాళ్ళం కదా అని మమ్మల్ని పిచ్చివాళ్లని కూడా చేయాలని చూడవద్దు.
(అమెరికాలో నివసించే ఎనభయ్ ఆరేళ్ళ వృద్ధురాలు తన
బ్యాంకు మేనేజర్ కు రాసిన ఉత్తరం ఇది. సహజంగా హాస్యప్రియుడయిన ఆ అధికారి ఆ ఉత్తరం చదివి, చిన్నబుచ్చుకోకుండా పెద్ద
మనసుతో దాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’కు పంపితే ఆ పత్రిక దాన్ని యధాతధంగా
ప్రచురించింది)
(23-07-2012)
4 కామెంట్‌లు:
Nice one :-)
అయ్యో! ఇక్కడ కూడా అదే పరిస్తితులున్నాయండీ. నాకో గొప్ప అనుభవమయింది ఒక నేషనలైజెడ్ బేంక్ తో ఒక టపా రాసేస్తా.మీ దగ్గరకొస్తే టపా రాసుకునే కొస దొరుకుతుంది. ధన్యవాదాలు.
@kashtephale and Sreeram - thanks
Hahhaha....very nice letter by an old intelligent lady....thanks for sharing sir..
కామెంట్‌ను పోస్ట్ చేయండి